Ayalaan: ట్రెండింగ్‌లో ‘అయలాన్‌’.. అందుకే సంక్రాంతికి అంటోన్న ఎస్.కె.

ABN , First Publish Date - 2023-10-09T11:42:59+05:30 IST

ఆర్‌. రవికుమార్‌ దర్శకత్వంలో శివకార్తికేయన్‌ నటించిన కొత్త చిత్రం ‘అయలాన్‌’. ఏ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, యోగిబాబు, కరుణాకరన్‌ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. 24ఏఎం స్టూడియోస్‌, కేజేఆర్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించాయి. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని చెన్నైలో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Ayalaan: ట్రెండింగ్‌లో ‘అయలాన్‌’.. అందుకే సంక్రాంతికి అంటోన్న ఎస్.కె.
Ayalaan Movie Still

ఆర్‌. రవికుమార్‌ (R Ravikumar) దర్శకత్వంలో శివకార్తికేయన్‌ (Sivakarthikeyan) నటించిన కొత్త చిత్రం ‘అయలాన్‌’ (Ayalaan). ఏ.ఆర్‌.రెహ్మాన్‌ f(AR Rahman) సంగీతం అందిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh), యోగిబాబు, కరుణాకరన్‌ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. 24ఏఎం స్టూడియోస్‌, కేజేఆర్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించాయి. భారీ అంచనాల మధ్య సంక్రాంతికి విడుదలయ్యేందుకు ఈ చిత్రం ముస్తాబవుతోంది. ఈ చిత్ర టీజర్‌ను తాజాగా చెన్నై నగరంలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Ayalaan Movie Teaser Launch)

ఈ సందర్భంగా హీరో శివకార్తికేయన్‌ మాట్లాడుతూ.. ఈ సినిమాని దీపావళికి విడుదల చేయాలని సన్నాహాలు చేశాం. కానీ, సీజీ ఇతర గ్రాఫిక్స్‌ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశాం. మరికొంత సమయం ఇస్తే ఇంకొన్ని కొత్త విషయాలు పొందుపరచవచ్చని చెప్పారు. ఇంతకాలం వేచిచూశాం.. మరో రెండు నెలలే కదా అని ఓకే చెప్పి అంగీకరించాం. టీజర్‌లో చూసిన ఏలియన్స్‌ వరల్డ్‌ అలా కొత్తగా సృష్టించిందే. పైగా దీపావళి రిలీజ్‌ తేదీ కంటే సంక్రాంతి (Sankranthi) ఎంతో అనుకూలంగా ఉందని, వరుస సెలవులు వస్తున్నాయని, అందువల్ల ఫ్యామిలీ, చిన్నారులు ఇలా ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్‌ చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.


Ayalaan.jpg

దర్శకుడు ఆర్‌. రవికుమార్‌ మాట్లాడుతూ.. నా సుఖదుఃఖాల్లో వెన్నంటివున్న కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు. ముఖ్యంగా హీరో శివకార్తికేయన్‌ బలమైన శక్తిగా నాకు అండగా ఉన్నారు. అందుకే కొన్ని సంవత్సరాల విరామాన్ని కొన్ని రోజులుగా భావిస్తున్నాను. వయసుతో నిమిత్తం లేకుండా, ప్రతి ఒక్కరినీ ఏలియన్స్‌ ప్రపంచానికి తీసుకెళ్ళి అలరించే చిత్రంగా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. అలాగే, చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొని ప్రసంగించారు. (Ayalaan Movie Teaser)


ఇవి కూడా చదవండి:

============================

*Manchu Lakshmi: మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’ లుక్.. అరాచకం అంతే..!

**********************************************

*Jagapathi Babu: అభిమానం, ప్రేమ కంటే ఆశించడం ఎక్కువైందంటూ జగ్గు భాయ్ షాకింగ్ డెసిషన్

********************************************************

*Mangalavaaram: ‘ఏమయ్యిందో ఏమిటో..’.. పాయల్ రాజ్‌పుత్ ఆగమాగం

**************************************

*Bubblegum: సుమక్క కొడుకు హీరోగా అరంగేట్రం.. దర్శకధీరుడు ఏం చేశారంటే..

**************************************

*Pawan Kalyan: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై సినీ ఇండస్ట్రీ స్పందించకపోవడంపై సంచలన వ్యాఖ్యలు

*********************************

Updated Date - 2023-10-09T11:42:59+05:30 IST