Manchu Lakshmi: మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’ లుక్.. అరాచకం అంతే..!

ABN , First Publish Date - 2023-10-09T10:45:12+05:30 IST

తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో మంచు వారమ్మాయి, ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మీప్రసన్న ఫొటో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఈ ఫొటో బీభత్సమైన స్పందనను రాబట్టుకుంటోంది. రావుల వెంకటేశ్వర్రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ - అమెరికా ఇండియా (ఎ.ఐ) ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్ మేగోటి దర్శకుడు. మంచు లక్ష్మీ బర్త్‌డే స్పెషల్‌గా ఇందులోని ఆమె లుక్‌ని మేకర్స్ వదిలారు.

Manchu Lakshmi: మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’ లుక్.. అరాచకం అంతే..!
Manchu Lakshmi Prasanna in Adiparvam

తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో మంచు వారమ్మాయి, ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మీప్రసన్న (Manchu Lakshmi Prasanna) ఫొటో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఈ ఫొటో బీభత్సమైన స్పందనను రాబట్టుకుంటోంది. రావుల వెంకటేశ్వర్రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ - అమెరికా ఇండియా (ఎ.ఐ) ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఆదిపర్వం’ (Adiparvam). సంజీవ్ మేగోటి (Sanjeev Megoti) దర్శకుడు. మంచు లక్ష్మీ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. 1974-1990 మధ్యకాలంలో జరిగిన యధార్థ సంఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మంచు లక్ష్మీప్రసన్న ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మాధ్యమాలలో సైతం వైరల్‌ అవుతోంది.

‘అమ్మోరు - అరుంధతి’ చిత్రాల తరహా ఈవిల్ పవర్ అండ్ డివోషనల్ పవర్ మధ్య జరిగే పవర్ ఫుల్ మూవీ ఈ మధ్యకాలంలో రాలేదని చెప్పాలి. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న ప్రేమకథ ఈ ‘ఆదిపర్వం’. గ్రాఫిక్స్ ప్రధానమైన చిత్రంగా మలిచారు దర్శకుడు సంజీవ్ మేగోటి. అలాగే హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగానే కాకుండా ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మంచు లక్ష్మి పోషిస్తున్న పాత్ర ఆమె కెరీర్‌లోనే చిరస్థాయిగా నిలిచిపోతుందని మేకర్స్ చెబుతున్నారు. (Manchu Lakshmi First Look From Adiparvam Out)


Manchu-Bidda.jpg

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సంజీవ్ మెగోటి మాట్లాడుతూ.. మంచు లక్ష్మీప్రసన్న ఇంతకు ముందు ఎప్పుడూ చేయని పాత్రలో కొత్తగా ఇందులో కనిపిస్తారు. తను చేసిన రెండు ఫైట్స్ సినిమాకి హైలెట్స్‌గా నిలుస్తాయి. అన్వికా ఆర్ట్స్ మరియు అమెరికా ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థల సహకారంతో నేను అనుకున్న స్థాయిలో ఒక గొప్ప చిత్రాన్ని మలిచానన్న నమ్మకం నాకుంది. మంచు లక్ష్మి క్యారెక్టర్, ఆవిడ పెర్ఫామెన్స్ కూడా మెమొరబుల్‌గా ఉంటాయని తెలపగా.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాసరావ్ మాట్లాడుతూ.. రెట్రో ఫీల్‌తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మొదలై కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఆద్యంతం అలరించే చిత్రంగా ఈ సినిమా దర్శకుడు సంజీవ్ మేగోటి తెరకెక్కించారని తెలిపారు. ఈ సినిమాలోని ఫైట్స్ మరియు గ్రాఫిక్స్ ప్రశంసలందుకుంటాయని సహనిర్మాత గోరెంట శ్రావణి అన్నారు. ఆదిత్యఓం, ఎస్తేర్, సుహాసిని, శ్రీజిత ఘోష్, శివ కంఠంనేని వంటి వారంతా ఇతర పాత్రలలో నటించిన ఈ చిత్ర విడుదలకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

============================

*Jagapathi Babu: అభిమానం, ప్రేమ కంటే ఆశించడం ఎక్కువైందంటూ జగ్గు భాయ్ షాకింగ్ డెసిషన్

********************************************************

*Mangalavaaram: ‘ఏమయ్యిందో ఏమిటో..’.. పాయల్ రాజ్‌పుత్ ఆగమాగం

**************************************

*Bubblegum: సుమక్క కొడుకు హీరోగా అరంగేట్రం.. దర్శకధీరుడు ఏం చేశారంటే..

**************************************

*Pawan Kalyan: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై సినీ ఇండస్ట్రీ స్పందించకపోవడంపై సంచలన వ్యాఖ్యలు

*********************************

Updated Date - 2023-10-09T11:13:36+05:30 IST