Akkineni Family Hero: మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అక్కినేని హీరో

ABN , First Publish Date - 2023-03-18T15:26:24+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) హీరోగా మెహర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భోళా శంకర్’ (Bholaa Shankar). మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న

Akkineni Family Hero: మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అక్కినేని హీరో
Chiranjeevi and Keerthy Suresh in Bholaa Shankar

మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) హీరోగా మెహర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భోళా శంకర్’ (Bholaa Shankar). మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సిస్టర్‌గా కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తుండగా.. తమన్నా (Tamanna) హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్‌ని మేకర్స్ తెలియజేశారు. ఈ సినిమాలో అక్కినేని ఫ్యామిలీ హీరో (Akkineni Family Hero) ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్లుగా తెలుపుతూ.. అతని లుక్‌ని కూడా విడుదల చేశారు. ఇంతకీ ఈ సినిమాలో నటిస్తున్న అక్కినేని ఫ్యామిలీ హీరో ఎవరంటే.. సుశాంత్ (Sushanth). ఇంతకు ముందు అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ (Allu arjun ala Vaikunthapurramuloo) చిత్రంలో సుశాంత్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి మెగా హీరో (Mega Hero) చిత్రంలో సుశాంత్ నటిస్తున్నారు.

సుశాంత్ పుట్టినరోజును (#HBDSushanth) పురస్కరించుకుని.. మేకర్స్ ‘భోళా శంకర్’ చిత్రంలో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుపుతూ.. శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక వైపు సుశాంత్ లీడ్ రోల్స్‌ చేస్తూనే.. మంచి పాత్ర అయితే ఇతర హీరోల సినిమాలలో కూడా చేస్తున్నారు. ‘భోళా శంకర్‌’లో అతని పాత్ర చాలా కీలకంగా వుంటుందని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో.. సూట్‌లో లైట్ గడ్డంతో ఛార్మింగ్‌గా సుశాంత్ కనిపిస్తున్నారు. ఈ లుక్ చూస్తుంటే అతనిది ఇందులో లవర్ బాయ్ తరహా పాత్ర అనేది అర్థమవుతుంది. కీర్తి సురేష్ లవర్‌గా సుశాంత్ ఇందులో చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. (Sushanth Key Role in Bholaa Shankar)

Sushanth-Pic.jpg

ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీది మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మహా శివరాత్రి సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన మోషన్ పోస్టర్‌ చిరంజీవిని ఫెరోషియస్ అవతార్‌లో ప్రజంట్ చేసింది. ఆ తర్వాత చిరంజీవి, కీర్తి సురేష్‌ల వర్కింగ్ స్టిల్స్ కూడా సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి. ఇప్పుడు సుశాంత్ అప్‌డేట్‌తో మరోసారి ఈ ‘భోళా శంకర్’ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. కాగా.. భారీ తారాగణం నటిస్తోన్న ఈ చిత్రానికి సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో నడుస్తోంది. (Bholaa Shankar Latest Update)

ఇవి కూడా చదవండి:

*********************************

*Singer Sunitha: చాలా బరువుగా ఉంది.. అయినా హాయిగా ఉంది

*NTR30: ఇలా అయితే సినిమాలు మానేస్తా.. ఫ్యాన్స్‌కి స్వీట్ వార్నింగ్

*Young Tiger NTR: విశ్వక్ సేన్ దర్శకత్వం మానేయాలని కోరుకుంటున్నా..

*Jr NTR: ఆస్కార్ క్రెడిట్ ఎవరిదంటే.. ఎన్టీఆర్ స్పీచ్ వైరల్

*Bigg Boss Himaja: ఘోరంగా ఏడ్చాను.. కానీ?

*Shruti Haasan: సిల్లీ క్వశ్చన్ అడగమంటే.. శృతిని అలాంటి ప్రశ్నేనా అడిగేది?

*Pavitra Lokesh: పెద్ద బాంబ్ పేల్చిన పవిత్రా లోకేష్ మొదటి భర్త.. పాపం నరేష్..?

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

*Richa Panai: అవకాశాలు లేక ఈ భామ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

Updated Date - 2023-03-18T15:26:25+05:30 IST