Ilaiyaraaja: దర్శకుడిపై ఇళయరాజా సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-03-11T16:57:50+05:30 IST

ఈ మూవీ చిత్ర పరిశ్రమ ఇప్పటివరకు చూడని కాలంలో సాగుతుంది. ఈ దర్శకుడు చెప్పే ఒక్కో కథ ఒక ఆణిముత్యంలాంటిది. సినీ ఇండస్ట్రీలో

Ilaiyaraaja: దర్శకుడిపై ఇళయరాజా సంచలన వ్యాఖ్యలు
Isaignani Ilaiyaraaja

చిత్రపరిశ్రమలో వెట్రిమారన్‌ ఒక ముఖ్యమైన దర్శకుడు అని ఇసైజ్ఞాని ఇళయరాజా (Isaignani Ilaiyaraaja) అన్నారు. అలాగే ‘విడుదలై’ (Viduthalai) చిత్రంలో తన నుంచి ఇప్పటివరకు సినీ ప్రేక్షకులు వినని సంగీతాన్ని వింటారని వ్యాఖ్యానించారు. ఆర్‌.ఎస్‌. ఇన్ఫోటై‌న్‌మెంట్‌ బ్యానరుపై నిర్మాత ఎల్‌రెడ్‌ కుమార్‌ నిర్మించిన ‘విడుదలై’ చిత్రం ఆడియో రిలీజ్‌ వేడుక తాజాగా చెన్నైలో జరిగింది. ఈ వేడుకలో ఇళయరాజా (Ilaiyaraaja) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ మూవీ చిత్ర పరిశ్రమ ఇప్పటివరకు చూడని కాలంలో సాగుతుంది. వెట్రిమారన్‌ (Vetrimaaran) చెప్పే ఒక్కో కథ ఒక ఆణిముత్యంలాంటిది. సినీ ఇండస్ట్రీలో వెట్రిమారన్‌ కీలకమైన దర్శకుడు. ఈ సినిమాలో ఇప్పటివరకు వినని సరికొత్త సంగీతాన్ని ప్రేక్షకులు వింటారు’’ అని అన్నారు. అనంతరం దర్శకుడు వెట్రిమారన్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ఇళయరాజా సార్‌ ఓ ముఖ్య కారణం. 45 నిమిషాలు సినిమా రూపొందించి, ఇళయరాజాకు చూపించాను. ఆయన పాటే ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళుతుంది. నేపథ్య సంగీతం వినగానే ఒక విధమైన అనుభూతికి లోనయ్యా. ఇళయరాజాతో కలిసి పనిచేయడం ఒక గొప్ప అనుభవం. ఆయన షేర్‌ చేసిన అనేక విషయాలు నాకు మంచి పాఠాలు వంటివి. ఇళయరాజా పాటలను వింటూ పెరిగాం. ఇపుడు ఆయన సంగీతాన్ని ఆనందంతో ఆస్వాదిస్తున్నాం’’ అని అన్నారు. (Viduthalai Audo Launch)

ఇంకా ఈ కార్యక్రమంలో విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) మాట్లాడుతూ.. ‘వడ చెన్నై’ (Vada Chennai) చిత్రంలో వెట్రిమారన్‌తో కలిసి పనిచేసే అవకాశాన్ని కోల్పోయా. అందుకే ‘విడుదలై’ చిత్రంలో నటించే ఛాన్స్‌ను మిస్‌ చేసుకోలేదు అన్నారు. నటుడు సూరి, హీరోయిన్‌ భవానీ శ్రీ, సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్‌, నిర్మాత కలైపులి ఎస్‌ థాను, నిర్మాత ఎల్‌రెడ్‌ కుమార్‌ తదితరులు ప్రసంగించారు.

ఇవి కూడా చదవండి:

*********************************

* Harish Shankar: పెరుగన్నం, బిర్యానీ.. దర్శకుడు మహాకు కౌంటర్

*Pavitra Naresh: బ్యాచ్‌లర్స్ ఫీల్ కాకండి.. ఈ మీమ్స్ ఏంటి సామి?

*Ram Charan: మా నాన్న పెంపకం అలాంటిది.. ఆసక్తికర విషయాలు చెప్పిన చరణ్

*Radha Nair: తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో.. మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమో?

*Nagababu: ‘ఆర్ఆర్ఆర్’ మీద కామెంట్‌కు వైసీపీ వారి భాషలో సమాధానం

*Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సైడ్ యాక్టరా? ఇలా అవమానించారేంటి?

*Lakshmi Manchu: రక్తం మరిగిపోతోంది.. మంచు లక్ష్మికి కోపం తెప్పించిన వైరల్ వీడియో..

*Star Producer: పాపం.. దీన స్థితిలో స్టార్ నిర్మాత.. ఆదుకున్న స్టార్ హీరో

*Poonam Kaur: మళ్లీ చెబుతున్నా అర్థం చేసుకోండి.. వేదికపైనే కంటతడి పెట్టిన పూనమ్ కౌర్..

Updated Date - 2023-03-11T17:03:23+05:30 IST