Poonam Kaur: మళ్లీ చెబుతున్నా అర్థం చేసుకోండి.. వేదికపైనే కంటతడి పెట్టిన పూనమ్ కౌర్..

ABN , First Publish Date - 2023-03-06T22:22:58+05:30 IST

పూనమ్ కౌర్ (Poonam Kaur).. పరిచయం అక్కరలేని పేరు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పూనమ్ కౌర్ ఈ మధ్య సోషల్ మీడియా (Social Media)కే పరిమితమైంది. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్ట్‌లు.. కొన్ని వర్గాలను

Poonam Kaur: మళ్లీ చెబుతున్నా అర్థం చేసుకోండి.. వేదికపైనే కంటతడి పెట్టిన పూనమ్ కౌర్..
Poonam Kaur

పూనమ్ కౌర్ (Poonam Kaur).. పరిచయం అక్కరలేని పేరు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పూనమ్ కౌర్ ఈ మధ్య సోషల్ మీడియా (Social Media)కే పరిమితమైంది. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్ట్‌లు.. కొన్ని వర్గాలను టార్గెట్ చేసినట్లుగా ఉంటుంటాయి. ఒక్కోసారి ఆమె పోస్ట్‌లు అర్థం కాకపోయినప్పటికీ.. ఆ పోస్ట్‌ల వెనుక ఉన్న పరమార్థం మాత్రం అందరికీ తెలుస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె ఎమోషనలవుతూ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. రాజ్‌భవన్‌ (Raj Bhavan)లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Women's Day) పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె అతిథిగా హాజరైంది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ..

‘‘నేను తెలంగాణ (Telangana)లో పుట్టాను.. ఇక్కడే పెరిగాను. నా మతాన్ని చూపించి.. నన్ను పంజాబీ అంటూ ఈ రాష్ట్రం నుంచి వేరు చేయలేరు. నేను మీ అందరిలానే తెలంగాణ బిడ్డని. మళ్లీ చెబుతున్నా.. దయచేసి మైనారిటీ అని, సిక్కు అని.. నన్ను వేరు చేసి చూడవద్దని వేడుకుంటున్నా’’ అంటూ.. వేదికపైనే ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఆమె మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే ఇటీవల మృతి చెందిన మెడికో స్టూడెంట్ ప్రీతి(Preethi)ని తలచుకుని కూడా ఆమె భావోద్వేగానికి లోనైంది. ఈ అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలో పూనమ్ కౌర్ స్పీచ్ హైలెట్‌గా నిలవడం విశేషం. కాగా.. ఈ వేడుకకు సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఖుష్బూ సుందర్ (Khushbu Sundar)తో పాటు వివిధ రంగాలకు చెందిన మహిళా నిపుణులు, ప్రజా ప్రతినిధులు హాజరై.. ప్రతిభను చాటిన మహిళలకు పురస్కారాలు అందించారు.

పూనమ్ కౌర్ విషయానికి వస్తే.. ఆమె ఈ మధ్య ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తూ.. సందర్శించిన దేవాలయాల ప్రాముఖ్యతను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. నటిగా మాత్రం ఆమెకు ఇప్పుడేమీ అవకాశాలు లేవు. చివరిగా ఆమె చేసిన చిత్రం ‘నాతిచరామి’ (Nathicharami). మెసేజ్ ఓరియంటెడ్‌గా తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 20 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలైంది.

ఇవి కూడా చదవండి:

*********************************

Allu Sneha Reddy: ‘క్యూటీ’ అంటూ అల్లు అర్జున్ పోస్ట్.. వైరల్ అవుతోన్న పిక్

*Manchu Manoj: ఏ జన్మ పుణ్యమో నాది.. పెళ్లి తర్వాత మంచు మనోజ్ ఎవరి గురించి ఈ మాటన్నాడంటే..

*Amigos: ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు, ఎక్కడంటే?

* Waltair Veerayya: చిరంజీవి పేరు మీదే మరో రికార్డ్

* Veera Simha Reddy: 50 రోజులు.. ఎన్ని సెంటర్లలోనో తెలుసా?

* Sir: రియల్ ‘సార్’కు ‘సార్’ టీమ్ సహకారం

* Virupaksha Teaser: ప్ర‌మాదాన్ని దాట‌డానికే ఈ ప్రయాణం.. ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్లుందే!

* Allu Arjun: ఇక్కడా తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ ఖాతాలో మరో రికార్డ్

* Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్

* Mega Power Star Ram Charan: నా జీవితంలో అద్భుత‌మైన క్ష‌ణాలివి

Updated Date - 2023-03-06T22:22:59+05:30 IST