Pavitra Naresh: బ్యాచ్‌లర్స్ ఫీల్ కాకండి.. ఈ మీమ్స్ ఏంటి సామి?

ABN , First Publish Date - 2023-03-10T22:42:24+05:30 IST

సీనియర్ నటుడు నరేష్ (VK Naresh), నటి పవిత్ర (Pavitra).. పెళ్లి చేసుకుంటున్న వీడియో (Marriage Video) ఒకటి నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వీడియోని స్వయంగా నరేష్ తన ట్విట్టర్ ద్వారా..

Pavitra Naresh: బ్యాచ్‌లర్స్ ఫీల్ కాకండి.. ఈ మీమ్స్ ఏంటి సామి?
Naresh and Pavitra Marriage

సీనియర్ నటుడు నరేష్ (VK Naresh), నటి పవిత్ర (Pavitra).. పెళ్లి చేసుకుంటున్న వీడియో (Marriage Video) ఒకటి నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వీడియోని స్వయంగా నరేష్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. అయితే రియల్ లైఫ్‌కి సంబంధించినదా? లేక రీల్ లైఫ్‌కి సంబంధిన పెళ్లా? అనేది పక్కన పెడితే.. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారనేది మాత్రం వాస్తవం. ఆ విషయం నరేషే చెప్పారు. అయితే మరోవైపు ఆయన మూడో భార్య రమ్య రఘుపతి (Ramya Raghupathi) మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నరేష్‌ని నాలుగో పెళ్లి (4th Marriage) చేసుకోనివ్వనని కంకణం కట్టుకుని కూర్చుంది. ఈ పరిస్థితుల్లో వీరి వ్యవహారం ఏదో ఒక రూపంలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా పెళ్లి వీడియోనే నరేష్ షేర్ చేశారు. అయితే ఇది వాస్తవమైన పెళ్లి అని మాత్రం ఈ వీడియో చూస్తుంటే అనిపించడం లేదు. కానీ ఈ వీడియోని చూసిన తర్వాత కొందరు బ్యాచ్‌లర్స్ (Bachelors), నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న మీమ్స్ (memes) చూస్తే మాత్రం.. ‘ఇదేందిది’ అని అనిపించకమానదు.

నరేష్, పవిత్ర పెళ్లి చేసుకుంటున్న ఫొటోలు పెట్టి.. ‘28 యేళ్లు.. స్టిల్ బ్యాచ్‌లర్.. నేనేం ఏడవట్లేదు.. జస్ట్ కళ్లలో నలక పడింది బ్రో’ అనేలా ఒక మీమ్, ‘మీరు ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే.. ఆ వయసులో చించి ఉంటారు సార్’, ‘పవిత్ర బంధమే కానీ.. పవిత్రం కాదు’ అంటూ నెటిజన్లు వదిలిన మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కామెంట్స్ గురించి అయితే చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా బ్యాచ్‌లర్స్.. ‘మాకు ఒక్కటికే దిక్కు లేదు.. నీకు నాలుగా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా నరేష్, పవిత్రల మ్యారేజ్ వీడియో.. సోషల్ మీడియా సంచలనంగా మారింది.

Memes.jpg

ఇక తన నాలుగో పెళ్లి గురించి నరేష్ ఓ సినిమా ఫంక్షన్‌లో ప్రస్తావిస్తూ.. ‘‘నా పెళ్లి విషయం డైవర్ట్ చేయదల్చుకోలేదు. నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని తప్పకుండా మీడియాకు తెలియజేస్తున్నా.. ఈ విషయం అందరికీ తెలిసిందే. త్వరలో పెళ్లికి సంబంధించిన విషయం కూడా ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెబుతాను. అప్పటి వరకు అందరూ కాస్త ఓపిక పట్టండి..’’ అని చెప్పుకొచ్చారు. మొత్తంగా అయితే నరేష్, పవిత్రలు మరొకసారి ట్రెండ్ సెట్టర్స్‌గా మారారనేది మాత్రం కాదనలేని విషయం. (Naresh Reaction on Video)

ఇవి కూడా చదవండి:

*********************************

*Ram Charan: మా నాన్న పెంపకం అలాంటిది.. ఆసక్తికర విషయాలు చెప్పిన చరణ్

*Radha Nair: తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో.. మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమో?

*Nagababu: ‘ఆర్ఆర్ఆర్’ మీద కామెంట్‌కు వైసీపీ వారి భాషలో సమాధానం

*Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సైడ్ యాక్టరా? ఇలా అవమానించారేంటి?

*Lakshmi Manchu: రక్తం మరిగిపోతోంది.. మంచు లక్ష్మికి కోపం తెప్పించిన వైరల్ వీడియో..

*Star Producer: పాపం.. దీన స్థితిలో స్టార్ నిర్మాత.. ఆదుకున్న స్టార్ హీరో

*Poonam Kaur: మళ్లీ చెబుతున్నా అర్థం చేసుకోండి.. వేదికపైనే కంటతడి పెట్టిన పూనమ్ కౌర్..

*Manchu Manoj: ఏ జన్మ పుణ్యమో నాది.. పెళ్లి తర్వాత మంచు మనోజ్ ఎవరి గురించి ఈ మాటన్నాడంటే..

Updated Date - 2023-03-11T08:48:13+05:30 IST