Star Producer: పాపం.. దీన స్థితిలో స్టార్ నిర్మాత.. ఆదుకున్న స్టార్ హీరో

ABN , First Publish Date - 2023-03-07T16:54:07+05:30 IST

కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అలా చేయకపోతే ఏమవుతుందనే దానికి ఉదాహరణగా ఎందరో సీనియర్ నటీనటుల జీవితాలు ఉన్నాయి. స్టార్ స్టేటస్‌ని

Star Producer: పాపం.. దీన స్థితిలో స్టార్ నిర్మాత.. ఆదుకున్న స్టార్ హీరో
V.A. Durai

కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అలా చేయకపోతే ఏమవుతుందనే దానికి ఉదాహరణగా ఎందరో సీనియర్ నటీనటుల జీవితాలు ఉన్నాయి. స్టార్ స్టేటస్‌ని అనుభవించి.. చివరి రోజులలో పూట గడవడానికి కూడా ఇబ్బంది పడిన పద్మనాభం (Padmanabham), కాంతారావు (Kanta Rao), సావిత్రి (Savitri) వంటి వారెందరో ఉన్నారు. ఇప్పుడీ కేటగిరీలోకి కోలీవుడ్‌కి చెందిన స్టార్ నిర్మాత కూడా చేరారు. ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), విజయకాంత్ (Vijayakanth), విక్రమ్ (Vikram), సూర్య (Suriya) వంటి వారితో బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన నిర్మాత వి.ఏ. దురై (V.A. Durai) పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా మారింది. గుర్తు పట్టలేని విధంగా తయారైన ఆయనని చూసి అంతా జాలి పడుతున్నారు.

సీనియర్ నిర్మాత వి.ఏ. దురై దీన స్థితి గురించి తెలుసుకున్న స్టార్ హీరో సూర్య (Suriya) ఆయనకు ఆర్థిక సహాయం అందించి.. తన గొప్ప మనసు చాటుకున్నాడని కోలీవుడ్ మీడియా రాసుకొచ్చింది. నిర్మాత దురై కొన్నాళ్లుగా మధుమేహం వ్యాధితో బాధపడుతున్నాడట. కనీస వైద్య ఖర్చులకు కూడా ఆయన దగ్గర డబ్బులు లేకపోవడంతో.. ఇటీవల ఇంటిని కూడా అమ్మేశారట. అయినా కూడా ఆయన అవస్థలు తీరలేదు. సొంత ఇల్లు లేక, వైద్యానికి డబ్బులు లేక దురై పడుతున్న అవస్థలు చూసిన ఆయన స్నేహితుడు.. ఫేస్‌బుక్ ద్వారా విషయాన్ని షేర్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సూర్య వెంటనే స్పందించి రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించినట్లుగా సమాచారం. సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘శివపుత్రుడు’ (Sivaputrudu) చిత్రానికి దురైనే నిర్మాతగా వ్యవహరించారు.

సూర్యనే కాకుండా డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran) కూడా కొంత ఆర్థిక సహాయం అందించినట్లుగా తెలుస్తోంది. వీరితో పాటు ఫేస్‌బుక్ ద్వారా విషయం తెలుసుకున్న పలువురు నెటిజన్లు, సెలబ్రిటీలు కూడా దురైకి ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారట. ఇదిలా ఉంటే.. విషయం తెలియగానే స్పందించి.. ఆర్థిక సహాయం అందించిన సూర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన మంచి మనసుకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*NBK: ఏదైనా బాలయ్య దిగనంత వరకే.. వన్స్ హి స్టెప్ ఇన్..

*Poonam Kaur: మళ్లీ చెబుతున్నా అర్థం చేసుకోండి.. వేదికపైనే కంటతడి పెట్టిన పూనమ్ కౌర్..

*Allu Sneha Reddy: ‘క్యూటీ’ అంటూ అల్లు అర్జున్ పోస్ట్.. వైరల్ అవుతోన్న పిక్

*Manchu Manoj: ఏ జన్మ పుణ్యమో నాది.. పెళ్లి తర్వాత మంచు మనోజ్ ఎవరి గురించి ఈ మాటన్నాడంటే..

*Amigos: ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు, ఎక్కడంటే?

* Waltair Veerayya: చిరంజీవి పేరు మీదే మరో రికార్డ్

* Veera Simha Reddy: 50 రోజులు.. ఎన్ని సెంటర్లలోనో తెలుసా?

* Sir: రియల్ ‘సార్’కు ‘సార్’ టీమ్ సహకారం

* Virupaksha Teaser: ప్ర‌మాదాన్ని దాట‌డానికే ఈ ప్రయాణం.. ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్లుందే!

* Allu Arjun: ఇక్కడా తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ ఖాతాలో మరో రికార్డ్

* Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్

Updated Date - 2023-03-07T19:02:46+05:30 IST