Radha Nair: తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో.. మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమో?

ABN , First Publish Date - 2023-03-10T18:16:26+05:30 IST

‘తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో.. మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమో?’.. ఈ పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. మరిచిపోయే పాటా ఇది!. ఈ లైన్ వినగానే అందరూ ఏదేదో..

Radha Nair: తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో.. మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమో?
Radha Nair

‘తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో.. మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమో?’.. ఈ పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. మరిచిపోయే పాటా ఇది!. ఈ లైన్ వినగానే అందరూ ఏదేదో ఊహించేసుకుంటారు. కానీ పాట రాసిన కవి మాత్రం.. ఈ ప్రశ్నకు ఎంత చక్కగా సమాధానమిచ్చాడంటే.. ‘కల్లకపట మెరుగని మనిషి కోసము.. మనసులోని చల్లనీ మమత కోసము’ అంటూ మనిషి, మనసు, మమతలకు ముడిపెడుతూ వర్ణించిన తీరు అద్భుతమనే చెప్పాలి. ‘అంతస్తులు’ (Antasthulu) సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు (ANR), కృష్ణకుమారి (Krishna Kumari) మధ్య వచ్చే డ్యూయట్ ఇది. ఈ పాట ఇప్పటికీ అప్పుడప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ పాట సందర్భం అటువంటిది. సరేలే.. ఇప్పుడీ పాట గురించి ఎందుకు? అని అనుకుంటున్నారు కదా.. తాజాగా సీనియర్ నటి రాధ (Radha Nair) ఈ పాటను తన ట్విట్టర్ వేదికగా గుర్తు చేసింది. (Radha in Tella cheera Kattukundi evarikosamo Song)

తెల్ల చీర (White Saree) కట్టుకుని, జడలో మల్లెపూలు (Jasmine Flowers) పెట్టుకుని వయ్యారంగా రాధ నడిచి వస్తుంటే.. వెనుక బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ పాట వస్తుంది. అలనాటి పాటకి పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యేలా రాధ మేకోవర్ అయిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంతే కాదు.. ఈ వీడియోలో రాధ కట్టు, బొట్టు చూసిన వారంతా.. చాలా అందంగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘అద్భుతమైన డ్యాన్సర్ మీరు.. మళ్లీ నటించి అలరించండి’.. ఇలా రాధ ట్వీట్‌కు కామెంట్స్ పడుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియో షేర్ చేసిన రాధ.. ‘‘ఫ్యాషన్‌లో కొన్ని కాంబినేషన్‌లు ఎప్పటికీ చెక్కు చెదరవు. అలాంటి వాటిలో తెలుపు చీర, నలుపు జాకెట్టు మరియు మల్లెపూలు.. ఆహా.. వాట్టే బ్యూటీఫుల్ కాంబినేషన్’’ అంటూ చెప్పుకొచ్చారు. రాధ విషయానికి వస్తే.. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో ఆమె ‘బిబి- జోడీ’ (BB Jodi) ద్వారా కనిపించారు. ఈ షో ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ మధ్య 80స్ పార్టీలో రాధ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. వీటితో పాటు ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతీది షేర్ చేసుకుంటూ.. ఫ్యాన్స్‌ని అలరిస్తోంది.


ఇవి కూడా చదవండి:

*********************************

*Nagababu: ‘ఆర్ఆర్ఆర్’ మీద కామెంట్‌కు వైసీపీ వారి భాషలో సమాధానం

*Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సైడ్ యాక్టరా? ఇలా అవమానించారేంటి?

*Lakshmi Manchu: రక్తం మరిగిపోతోంది.. మంచు లక్ష్మికి కోపం తెప్పించిన వైరల్ వీడియో..

*Star Producer: పాపం.. దీన స్థితిలో స్టార్ నిర్మాత.. ఆదుకున్న స్టార్ హీరో

*NBK: ఏదైనా బాలయ్య దిగనంత వరకే.. వన్స్ హి స్టెప్ ఇన్..

*Poonam Kaur: మళ్లీ చెబుతున్నా అర్థం చేసుకోండి.. వేదికపైనే కంటతడి పెట్టిన పూనమ్ కౌర్..

*Allu Sneha Reddy: ‘క్యూటీ’ అంటూ అల్లు అర్జున్ పోస్ట్.. వైరల్ అవుతోన్న పిక్

*Manchu Manoj: ఏ జన్మ పుణ్యమో నాది.. పెళ్లి తర్వాత మంచు మనోజ్ ఎవరి గురించి ఈ మాటన్నాడంటే..

Updated Date - 2023-03-11T08:46:10+05:30 IST