Ram Charan: మా నాన్న పెంపకం అలాంటిది.. ఆసక్తికర విషయాలు చెప్పిన చరణ్

ABN , First Publish Date - 2023-03-10T21:03:56+05:30 IST

గ్లోబల్ స్టార్ (Global Star) ఇమేజ్‌తో యుఎస్‌లో రామ్ చరణ్ (Ram Charan) హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్‌ (RRR)లోని నాటు నాటు (Naatu Naatu) పాట గురించి, ఆస్కార్‌లో పార్టిసిపేషన్‌ గురించి

Ram Charan: మా నాన్న పెంపకం అలాంటిది.. ఆసక్తికర విషయాలు చెప్పిన చరణ్
Mega Power Star Ram Charan

గ్లోబల్ స్టార్ (Global Star) ఇమేజ్‌తో యుఎస్‌లో రామ్ చరణ్ (Ram Charan) హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్‌ (RRR)లోని నాటు నాటు (Naatu Naatu) పాట గురించి, ఆస్కార్‌లో పార్టిసిపేషన్‌ గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి, హాలీవుడ్‌ (Hollywood) ప్రాజెక్టుల గురించి.. ఇలా ఎన్నో విషయాలను ఆయన హాలీవుడ్ మీడియాతో షేర్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా టాక్‌ ఈజీ షోలో సామ్‌ ఫ్రగోసోతో మాట్లాడారు మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Mega Power Star Ram Charan). 50 నిమిషాల పాటు సాగిన పాడ్‌కాస్ట్‌లో ఎన్నో విషయాల గురించి చెప్పుకొచ్చారు చరణ్. మరీ ముఖ్యంగా తన ఫ్యామిలీ (Family)‌కి సంబంధించి ఆయన చెప్పిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అవేంటంటే..

‘‘నేను పెరుగుతున్నప్పుడు, మా నాన్న అవార్డులుగానీ, మా నాన్నకు సంబంధించిన వార్తలున్న మ్యాగజైన్లు కానీ, మా ఇంటికి తీసుకొచ్చేవారు కాదు. వాటన్నింటినీ మా ఇంటి కింద ఉన్న ఇంట్లోనే ఉంచేవారు. ఒక ఫేమస్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్ పెయింటింగ్‌ వేసినా, అది కూడా మా వరకు రాలేదు. ఆయన వృత్తి ప్రభావం మా ఇంట్లో వాళ్ల మీద పడకూడదన్నది నాన్నగారి అభిప్రాయం. ఆ వైవిధ్యాన్ని చాలా బాగా పాటించేవారు. సినిమా ఇండస్ట్రీ చాలా గ్లామరస్‌ ఇండస్ట్రీ అని అలా భావించేవారేమో. మమ్మల్ని మామూలు పిల్లలుగా పెంచడానికే ప్రయత్నించేవారు. మా నాన్న సూపర్‌స్టార్‌ అనే గర్వం మా తలకు ఎక్కకుండా చూసుకునేవారు. అందులోనూ తప్పేం లేదు. ఇవాళ నేను నా ఈఎంఐలను కట్టుకోగలుగుతున్నాను.. నా అంతట నేను ఉండగలుగుతున్నాను అంటే ఆయన పెంపకమే కారణం. నేనేమైనా చెడ్డ సినిమా చేస్తే, మా నాన్నగారి దగ్గరకు వెళ్లి, ఎందువల్ల తప్పు జరిగిందో, ఎక్కడ తప్పు జరిగిందో అడిగి తెలుసుకుంటా (నవ్వుతూ). నా జర్నీని మా నాన్నగారు (Mega Star Chiranjeevi) ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆయనకు ఇప్పుడు 67 ఏళ్లు. సెట్లో మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. (Ram Charan Interview)

చిన్నతనంలో మా స్కూల్లో నాకు మార్కులు తక్కువగా వస్తే, నా స్కూల్‌ని మార్చేసేవారు. రెండేళ్లకు పైగా ఒకే పాఠశాలలో నేనెప్పుడూ చదవలేదు. కొన్నిసార్లు నాకు వచ్చే గ్రేడ్‌ల కోసం కావచ్చు, మరికొన్నిసార్లు నాలో క్రమశిక్షణ పెంచడం కోసం కావచ్చు.. కారణం ఏదైనా స్కూళ్లు మార్చేసేవారు. నేను స్పోర్ట్స్ లో ఉండటం వల్ల మార్కులు తక్కువగా వచ్చేవి. చిన్నతనంలో మ్యాథ్స్, హిస్టరీ చాలా ఇష్టంగా చదివేవాడిని. అల్లరి పిల్లాడిని, ఆకతాయి కుర్రాడిని మాత్రం కాదు. చాలా మంచివాడిని.

Chiranjeevi.jpg

మా నాన్నతో ఎక్కువ సమయం గడపడానికి వీలయ్యేది కాదు. ఆయనతో కలిసి భోజనం చేసేటప్పుడు మాత్రమే మాకు సమయం దొరికేది. ఆయన్ని మిగిలిన సమయాల్లో డిస్టర్బ్ చేయకూడదు అనే రూల్‌ ఉండేది మా ఇంట్లో. నా చిన్నతనమంతా ఉమ్మడి కుటుంబంలోనే గడిచింది. ఇంట్లో చాలా మంది స్టాఫ్‌ ఉండేవారు. ఇంట్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిచేసేవారు. యుఎస్‌లో లాగా కాకుండా, ఇండియాలో ఉమ్మడికుటుంబాలుంటాయి. (Mega Power Star about Family)

మా ఇంట్లో మొత్తంగా ఎనిమిది మంది వరకు నటులున్నాం. మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. మా నాన్నగారి నుంచి మేం అందరం చాలా విషయాలు నేర్చుకున్నాం. పండగలప్పుడు అందరం కలిసి భోజనం చేస్తాం. ఇంట్లో ఉన్నప్పుడు అసలు పని గురించి మాట్లాడుకోం. మా హాలీడేస్‌ గురించి, కుటుంబం గురించి, ఆప్యాయతలు, అనుభూతులు, మధురానుభూతుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం..’’ అని చరణ్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Radha Nair: తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో.. మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమో?

*Nagababu: ‘ఆర్ఆర్ఆర్’ మీద కామెంట్‌కు వైసీపీ వారి భాషలో సమాధానం

*Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సైడ్ యాక్టరా? ఇలా అవమానించారేంటి?

*Lakshmi Manchu: రక్తం మరిగిపోతోంది.. మంచు లక్ష్మికి కోపం తెప్పించిన వైరల్ వీడియో..

*Star Producer: పాపం.. దీన స్థితిలో స్టార్ నిర్మాత.. ఆదుకున్న స్టార్ హీరో

*NBK: ఏదైనా బాలయ్య దిగనంత వరకే.. వన్స్ హి స్టెప్ ఇన్..

*Poonam Kaur: మళ్లీ చెబుతున్నా అర్థం చేసుకోండి.. వేదికపైనే కంటతడి పెట్టిన పూనమ్ కౌర్..

*Manchu Manoj: ఏ జన్మ పుణ్యమో నాది.. పెళ్లి తర్వాత మంచు మనోజ్ ఎవరి గురించి ఈ మాటన్నాడంటే..

Updated Date - 2023-03-11T08:47:36+05:30 IST