Ilaiyaraaja on Jesus: దుమారం రేపుతున్న ఇళయరాజా వ్యాఖ్యలు.. ఆయన మనిషేకాదంటూ..

ABN , First Publish Date - 2023-03-25T12:56:50+05:30 IST

దేశవ్యాప్తంగా దిగ్గజ సంగీత దర్శకుల జాబితా తీస్తే అందులో ఇళయరాజా (Ilaiyaraaja) పేరు కచ్చితంగా ఉంటుంది.

Ilaiyaraaja on Jesus: దుమారం రేపుతున్న ఇళయరాజా వ్యాఖ్యలు.. ఆయన మనిషేకాదంటూ..

దేశవ్యాప్తంగా దిగ్గజ సంగీత దర్శకుల జాబితా తీస్తే అందులో ఇళయరాజా (Ilaiyaraaja) పేరు కచ్చితంగా ఉంటుంది. తమిళ సంగీత దర్శకుడైనప్పటికీ తన మ్యూజిక్ దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన కంపోజ్ చేసిన పాత పాటలను కూడా ఇప్పటికీ వింటూనే ఉంటారు. అలాంటి దిగ్గజ సంగీత దర్శకులు కొన్నేళ్లుగా వివాదాల పాలవుతున్నారు. ఆయన ప్రవర్తన గురించి పలువురు ప్రముఖులే విమర్శలు చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ సంగీత స్వరకర్త, వ్యాఖ్యాత జేమ్స్ వసంతన్ (James Vasanthan) కూడా ఇళయరాజాపై తాజాగా విమర్శలు చేశారు.

ఓ ఇంటర్వ్యూలో ఆయనకు వచ్చే అవార్డులకు ఇళయరాజా అర్హుడే కానీ తోటి మనిషిగా ఆయన చాలా తక్కువని జేమ్స్ ఘాటుగా కామెంట్ చేశారు. ‘ఇళయరాజా చాలా ఏళ్లుగా ఆధ్యాత్మికతలో ఉన్నారనే విషయం నాకు తెలుసు. ఆధ్యాత్మికతలోకి వెళ్లే కొద్దీ ఔదార్యం, వినయం, సహనం, యాక్సెప్టెన్స్ వంటి లక్షణాలు వస్తాయి.. కానీ ఇళయరాజా మాత్రం ఆధ్యాత్మికతలోకి వెళుతున్నానంటూ ఇతరులపై దుమ్మెత్తి పోస్తున్నారు. విమర్శలు చేస్తున్నారు.

ఉదాహరణకు, గూగుల్ ఈవెంట్‌లో ఇళయరాజా మాట్లాడుతూ.. జీసెస్ క్రైస్ట్ (Jesus Christ) పునరుత్థానం, క్రైస్తవుల విశ్వాసం గురించి అర్ధంలేని విధంగా మాట్లాడారు. నిజ జీవితంలో రమణ మహర్షి (Ramana Maharishi) మాత్రమే మళ్లీ పుట్టారని అన్నారు. అలా మాట్లాడటానికి ఆయన చరిత్ర చెప్పే ఉపాధ్యాయుడా లేక గొప్ప పరిశోధకుడా?. ఆయన చెప్పేది ఏసు క్రీస్తు విశ్వాసులకు బాధ కలిగించదా?. అలాంటి తెలివి తక్కువతనంతో ఇతరులను దూషిస్తూ ఆయన మాత్రమే సరైనవాడని అనుకుంటారు. అందుకే నేను ఆయన్ని చెడ్డవాడిగా గుర్తిస్తాను’ అని చెప్పుకొచ్చారు.

జేమ్స్ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడు మాట్లాడే విషయాలు సోషల్ మీడియాలోకి వెళతాయని, తర్వాత నన్ను తిడతారని కూడా నాకు తెలుసు. చాలా ఏళ్లుగా ఈ ఇండస్ట్రీలో ఉన్నాను. సినిమా సెలబ్రిటీలను రోల్ మోడల్స్‌గా ఫాలో అయ్యేవారు కొందరు కచ్చితంగా ఉంటారు. వారి కోసం నా ప్రవర్తన సరైన విధంగా ఉండాలి. మనం పాపులర్ అయిన తర్వాత వ్యక్తిత్వంతో స్వాత్రంత్య్రాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది.

అయినా, మన పాపులారిటీ దృష్ట్యా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అలాంటి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి. ఇది కనీస నైతిక బాధ్యత. అలాంటి లక్షణం అసలు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. అది ఇళయరాజా మాత్రమే. ఆయన వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడకూడదు. కానీ, ఓ సెలబ్రిటీగా ప్రవర్తన హుందాగా ఉండాలి’ అని కొంచెం ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

LEO Video Viral: సినిమా కోసం ఇంత కష్టపడాలా?

Breaking: హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం

Samyuktha Menon: మాట ఇచ్చి ఎందుకు తప్పారు.. ‘విరూపాక్ష’ టీంపై నటి ఫైర్..

NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..

Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

Updated Date - 2023-03-25T13:04:14+05:30 IST