Simbu: ఏఆర్ రెహ్మాన్‌ నా ఆధ్యాత్మిక గురువు.. ఆయన బాటలోనే నేను..

ABN , First Publish Date - 2023-03-20T10:16:20+05:30 IST

తమిళ నటుడు శింబు (Simbu)కి టాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉన్న సంగతి తెలిసిందే.

Simbu: ఏఆర్ రెహ్మాన్‌ నా ఆధ్యాత్మిక గురువు.. ఆయన బాటలోనే నేను..
Simbu

తమిళ నటుడు శింబు (Simbu)కి టాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయన ప్రతి సినిమా తెలుగులోకి డబ్ అయ్యి విడుదల అవుతూ ఉంటుంది. అయితే.. ఈ నటుడికి తమిళంలో మాత్రం మంచి క్రేజ్ ఉంది. ఏ సినిమాకి అయినా మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి. గతేడాది విడుదలైన ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ (The Life Of Muthu) సినిమాతో ఈ నటుడు సూపర్ హిట్ సాధించాడు. తాజాగా ఆయన నటించిన ‘పత్తు తల’ (Patthu Thala). ఈ నెల 30వ తేదీన విడుదలకానుంది.

దీంతో ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్‌ని ఈ చిత్రబృందం జోరుగా సాగిస్తోంది. ఇందులో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శింబు మాట్లాడాడు. శింబు మాట్లాడుతూ.. ‘ఈ ఆడియో వేడుకకు వచ్చే ముందు ఒక విషయాన్ని మనసులో అనుకుని వచ్చాను. భావోద్వేగానికిలోనై మీ (ఫ్యాన్స్‌) ముందు కన్నీరు పెట్టకూడదని గట్టిగా అనుకున్నా. ఎందుకంటే సాధారణంగా సినిమాలో ఒక చిన్న సెంటిమెంట్‌ సీన్‌ వచ్చినా నిజంగానే ఏడ్చేస్తా. నా మనస్తత్వం అలాంటిది. చిత్రపరిశ్రమలో అవకాశం వస్తే బురద జల్లేందుకు చాలా మంది ఉంటారు. కానీ కష్టం వస్తే అక్కున చేర్చుకునేందుకు ఇక్కడ ఎవరూ లేరు’ అని చెప్పుకొచ్చాడు. (spiritual journey)

శింబు ఇంకా మాట్లాడుతూ.. ‘ఏఆర్‌ రెహ్మాన్‌ (A. R. Rahman) నాకు గాడ్‌ఫాదర్‌లాంటి వారు. ఆయనకు నాపై ఒక శిష్యుడిగా ఉండే ప్రేమాభిమానాలను కాపాడుకుంటా. ఆధ్యాత్మికంలో ఆయన నాకు గురువు. ఇకపై పాత శింబు మీకు కనిపించరు. కొత్త శింబునే చూస్తారు. అలాగే, ఇకపై మాటలు ఉండవు.. అనుకున్నది చేసుకుంటూ పోవడమే. ఈ చిత్రంలో నాకు హీరోయిన్‌ లేదు. నిజ జీవితంలో కూడా తోడు లేదు. నాకు తోడుగా ఉన్నది మీరు మాత్రమే. అందుకే మీరు గర్వపడేలా నడుచుకుంటాను. మీరు తలదించుకునే పనులు చేయను’ అని శింబు తన అభిమానులకు మాట ఇచ్చాడు. ఈ మూవీలో గౌతం కార్తీక్‌, గౌతం వాసుదేవ్‌ మీనన్‌, ప్రియా భవానీ శంకర్‌ కీలకపాత్రల్లో నటించారు. గ్రీన్‌ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందించారు. (spiritual journey)

ఇవి కూడా చదవండి:

Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

LEO: మళ్లీ కలుసుకుందాం.. సార్‌

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

Updated Date - 2023-03-20T10:16:22+05:30 IST