Summer Release: ఈ వేసవికి విడుదలయ్యేది ఆ మూడు చిత్రాలేనా?

ABN , First Publish Date - 2023-04-12T14:45:19+05:30 IST

ప్రతి వేసవికి (Summer) అనేక చిత్రాలు విడుదలవుతుంటాయి. నిర్మాతలు కూడా వేసవి సెలవుల్లో తమ చిత్రాలను విడుదల చేసి నాలుగు రూపాయలు సంపాదించుకునేందుకు ఇష్టపడుతుంటారు. కానీ

Summer Release: ఈ వేసవికి విడుదలయ్యేది ఆ మూడు చిత్రాలేనా?
Ponniyin Selvan 2 and Maaveeran Stills

సాధారణంగా ప్రతి వేసవికి (Summer) అనేక చిత్రాలు విడుదలవుతుంటాయి. నిర్మాతలు కూడా వేసవి సెలవుల్లో తమ చిత్రాలను విడుదల చేసి నాలుగు రూపాయలు సంపాదించుకునేందుకు ఇష్టపడుతుంటారు. కానీ, ఈ సారి గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం మూడు చిత్రాలు మాత్రమే కోలీవుడ్‌ (Kollywood)లో విడుదలకానున్నాయి. వీటిలో మణిరత్నం (Mani Ratnam) తెరకెక్కించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’ (Ponniyin Selvan 2), శివకార్తికేయన్‌ (Sivakarthikeyan) నటించిన ‘మావీరన్‌’ (Maaveeran), ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) హీరోగా చేసిన ‘మామన్నన్‌’ (Maamannan) చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు మినహా ఏ ఇతర చిత్రాలు విడుదలయ్యేలా కనిపించడం లేదు.

Selvan-1.jpg

మరోవైపు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Super Star Rajinikanth) నటిస్తున్న ‘జైలర్‌’ (Jailer) చిత్రం దీపావళికి విడుదలయ్యే అవకాశం ఉంది. కమల్‌హాసన్‌ ‘ఇండియన్‌-2’ (Kamal Haasan Indian 2) చిత్రం షూటింగ్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. విజయ్‌ నటిస్తున్న ‘లియో’ (Vijay Leo) సినిమా షూటింగ్‌ ఇటీవలే మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. అజిత్‌ కుమార్ (Ajith Kumar) కొత్త చిత్రం పూజా కార్యక్రమమే ఇంకా నోచుకోలేదు.

Maaveeran.jpg

ఇక చిరుత్తై శివ (Siva) దర్శకత్వంలో పది భాషల్లో తెరకెక్కే టైటిల్‌ ఖరారు కానీ సూర్య (Suriya) కొత్త చిత్రం కూడా షూటింగ్‌ పూర్తికాలేదు. విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) నటించిన కొత్త సినిమా ఈ దఫా ఒక్కటీ లేదు. ధనుష్‌ ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Dhanush Captain Miller)లో నటిస్తున్నారు. కమల్‌ నిర్మాతగా శింబు (Simbu) నటించే కొత్త చిత్రం ప్రారంభంకావాల్సి ఉంది. అందువల్ల ఈ వేసవిలో పెద్ద హీరోలు నటించిన చిత్రాలు విడుదల లేకుండానే ప్రేక్షకులు వేసవి సెలవులను గడపాల్సి ఉంటుంది.

Maamannan.jpg

ఇవి కూడా చదవండి:

*********************************

*Brahmaji: ట్రైలర్ బాగుందా? అని అడిగిన సంయుక్తకు షాకింగ్ రిప్లయ్

*NTR 30: కొరటాల స్పీడ్ చూశారా.. అప్పుడే ఒకటి ఫినిష్..!

*Raai Laxmi: రాయ్‌ లక్ష్మీ అందుకు ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తోందా?

*Allu Arjun: సూపర్ హిట్ సినిమా మిస్సయిన అల్లు అర్జున్.. ఏ సినిమానో తెలిస్తే షాకవుతారు

*Direct OTT Release: ఈ వారం రెండు సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోకి..

*Virupaksha Trailer: మత్తెక్కించేలా.. సరికొత్త లుక్‌లో సంయుక్తా మీనన్

Updated Date - 2023-04-12T14:45:20+05:30 IST