Brahmaji: ట్రైలర్ బాగుందా? అని అడిగిన సంయుక్తకు షాకింగ్ రిప్లయ్

ABN , First Publish Date - 2023-04-12T13:07:58+05:30 IST

విరూపాక్ష ట్రైలర్ ఎలా ఉందంటూ హీరోయిన్ సంయుక్తా మీనన్ ట్విట్టర్ వేదికగా నెటిజన్లను కోరింది. దీనికి బ్రహ్మాజీ..

Brahmaji: ట్రైలర్ బాగుందా? అని అడిగిన సంయుక్తకు షాకింగ్ రిప్లయ్
Brahmaji and Samyuktha Menon

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా (Pan India) మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ (Virupaksha). సంయుక్తా మీనన్ (Samyuktha Menon) కథానాయిక. కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కాబోతోంది. మంగ‌ళవారం (ఏప్రిల్ 11) ఈ చిత్ర ట్రైల‌ర్‌ను స్టార్ ప్రొడ్యూస‌ర్స్ అల్లు అర‌వింద్‌ (Allu Aravind), దిల్ రాజు (Dil Raju) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ ట్రైమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంటోంది. తాజాగా ఈ ట్రైలర్ ఎలా ఉందంటూ హీరోయిన్ సంయుక్తా మీనన్ ట్విట్టర్ వేదికగా నెటిజన్లను కోరింది.

దీనికి నెటిజన్లు.. ‘ట్రైలర్ చాలా బాగుంది.. ట్రైలర్ కంటే కూడా మీరు అందులో చాలా బాగున్నారు. ప్రత్యేకంగా ఓ షాట్ అయితే అదిరిపోయింది. ఆల్ ద బెస్ట్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ కామెంట్స్ సెక్షన్స్‌లోకి సడెన్‌గా ఒక నటుడు కూడా చేరారు. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల టాలీవుడ్ (Tollywood) నటులలో బ్రహ్మాజీ (Brahmaji) ఒకరు. నటన మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఆయన చాలా యాక్టివ్‌గా ఉంటుంటారు. మరీ ముఖ్యంగా తన తోటి నటీనటులు ఎవరు ట్వీట్స్ చేసినా.. ఆయన రిప్లయ్ ఇస్తూ.. పంచులతో కాసేపు కామెడీ చేస్తుంటారు. అలా ఇప్పుడు సంయుక్తా మీనన్ చేసిన ట్వీట్‌కు బ్రహ్మాజీ ఓ రిప్లయ్ ఇచ్చారు. దానికి ఆమె షాకయ్యింది.

ఇంతకీ బ్రహ్మాజీ ఏమని రిప్లయ్ ఇచ్చారంటే.. ‘చాలా బాగుంది ప్లాటినమ్ లెగ్ గారు’ (Chalaa Bavundi platinum LEG garu..😀) అంటూ సరదాగా బ్రహ్మాజీ ఇచ్చిన రిప్లయ్‌కి వెంటనే సంయుక్తా కూడా స్పందించింది. ‘అర్రె.. ఏంటి బ్రహ్మీగారు’ (Arreeeyyyy !!! Enti brammi gaaru 🥸🥸🥸) అంటూ.. అంతే సరదాగా ఆమె కూడా రియాక్ట్ అయ్యింది. దీంతో నెటిజన్లు అంతా ఫీల్ అవుతున్నారు. మీరు బ్రహ్మాజీకి మాత్రమే రిప్లయ్ ఇస్తారా? మాకు ఇవ్వరా? అంటూ సంయుక్తా మీనన్‌ని ప్రశ్నిస్తున్నారు. అయితే బ్రహ్మాజీ ఇచ్చిన రిప్లయ్‌లో మ్యాటర్ చాలానే ఉంది. ఆయన ఎందుకు ప్లాటినమ్ అన్నారంటే.. ఈ మధ్య సంయుక్తా మీనన్ చేస్తున్న చిత్రాలన్నీ మంచి విజయాలు సాధిస్తున్నాయి. ‘భీమ్లా నాయక్’, ‘బింబిసార’, ‘సార్’ వంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. అలాగే ‘విరూపాక్ష’ సినిమాపై కూడా ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడింది. మరో హిట్ ఆమె ఖాతాలో పడుతుందనేలా బ్రహ్మాజీ రిప్లయ్‌కి నెటిజన్లు అర్థాలు చెబుతున్నారు. సినిమాలు వరుసగా ప్లాప్ అవుతుంటే హీరోయిన్లను ఐరన్ లెగ్‌ (Iron Leg)తో పోల్చుతుంటారు.. హిట్ అయితే గోల్డెన్ లెగ్ (Golden Leg). ఇక వరుసగా హిట్లు పడితే ప్లాటినమ్ (Platinum LEG) అన్నమాట. అది బ్రహ్మాజీ రిప్లయ్ వెనుక ఉన్న మ్యాటర్.


ఇవి కూడా చదవండి:

*********************************

*NTR 30: కొరటాల స్పీడ్ చూశారా.. అప్పుడే ఒకటి ఫినిష్..!

*Raai Laxmi: రాయ్‌ లక్ష్మీ అందుకు ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తోందా?

*Allu Arjun: సూపర్ హిట్ సినిమా మిస్సయిన అల్లు అర్జున్.. ఏ సినిమానో తెలిస్తే షాకవుతారు

*Direct OTT Release: ఈ వారం రెండు సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోకి..

*Virupaksha Trailer: మత్తెక్కించేలా.. సరికొత్త లుక్‌లో సంయుక్తా మీనన్

*All India NTR Fans: ‘సింహాద్రి’ని అందుకే రీ రిలీజ్ చేస్తున్నాం తప్ప.. స్వలాభం కోసం కాదు

Updated Date - 2023-04-12T13:16:08+05:30 IST