Direct OTT Release: ఈ వారం రెండు సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోకి..

ABN , First Publish Date - 2023-04-12T07:33:39+05:30 IST

ఈ వారం రెండు చిత్రాలు డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి. అవేంటంటే..

Direct OTT Release: ఈ వారం రెండు సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోకి..
Rudrudu and Shaakuntalam Movie Stills

ఈ వారం థియేటర్లలోనే కాకుండా.. ఓటీటీలో కూడా సరికొత్త సందడి నెలకొనబోతోంది. ఏప్రిల్ 14న సమంత (Samantha) ‘శాకుంతలం’ (Shaakuntalam), లారెన్స్ (Lawrence) ‘రుద్రుడు’ (Rudrudu), ఏప్రిల్ 15న సూరి (Soori), విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కాంబినేషన్‌లో తెరకెక్కిన వెట్రిమారన్ (Vetrimaaran) రూపొందించిన ‘విడుదల పార్ట్ 1’ (Vidudhala Part 1) చిత్రాలు థియేటర్లలో విడుదలవుతుండగా.. మరో రెండు చిత్రాలు డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి. అందులో నటుడు, నిర్మాత, దర్శకుడు రవిబాబు (Ravibabu) నిర్మించిన ‘అసలు’ (Asalu) చిత్రం కూడా ఉండటం విశేషం. ఈ సినిమాతో పాటు డైరెక్ట్‌గా ఓటీటీలోకి రాబోతున్న మరో చిత్రం ‘ఓ కల’ (O Kala).

Asalu-Movie.jpg

‘అసలు’ విషయానికి వస్తే..

వెర్సటైల్ యాక్టర్, డైరెక్టర్ రవిబాబు థ్రిల్లర్స్‌ని రూపొందించడంలో దిట్ట. ఇపుడు ఆయన నుంచి మరో ఎక్సయిటింగ్ మిస్టరీ థ్రిల్లర్ రాబోతుంది. ఈటీవీ విన్ సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రవిబాబు కీలక పాత్రలో నటిస్తూ నిర్మించిన సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్ ‘అసలు’ (Asalu). పూర్ణ మరో ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి ఉదయ్ బండారి (Uday Bandari), సురేష్ కంభంపాటి (Suresh Khambhampati) దర్శకత్వం వహించగా రవిబాబు స్వయంగా కథ అందించారు. ఈ చిత్రంతో ఉదయ్ బండారి, సురేష్ కంభంపాటి తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఇటీవల వచ్చిన ఈ చిత్ర ట్రైలర్ మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆద్యంతం క్యురియాసిటీని పెంచింది. ప్రొఫెసర్ చక్రవర్తిని ఎవరో దారుణంగా హత్య చేయడం, ఆ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి పవర్ ఫుల్ కాప్‌గా రవిబాబు రంగంలోకి దిగడం, ఈ కేసులో నలుగురు అనుమానితులు, నాలుగు రహస్యాలు, ఒక ఆశ్చర్యకరమైన నిజం, చివరికి హంతకుడు ఎవరు?.. ఇలా ఆసక్తికరమైన ప్రశ్నలు రేకెత్తిస్తూ ట్రైలర్ గ్రిప్పింగా సాగింది. ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం థ్రిల్లింగ్‌ని ఇవ్వబోతుందీ చిత్రం అనేలా ట్రైలర్ ఉంది. కచ్చితంగా మంచి ఆదరణను పొందుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఏప్రిల్ 13న ఈటీవీ విన్‌ (ETV Win)లో ఈ చిత్రం విడుదలకానుంది.

O-Kala.jpg

మంచి రైడ్‌లాంటి చిత్రం ‘ఓ కల’

ఎటిర్నిటి ఎంటర్‪టైన్‪మెంట్, అహం అస్మి ఫిల్మ్స్ బ్యానర్లపై గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ ఠక్కర్ హీరోహీరోయిన్లుగా దీపక్ కొలిపాక (Deepak Kolipaka) దర్శకత్వంలో లక్ష్మీ నవ్య మోటూరు, రంజిత్ కుమార్ కొడాలి, అదిత్య రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఓ కల’ (O Kala). సోషియో లవ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో దీపక్ కొలిపాక దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవల దిల్ రాజు చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై క్రేజ్‌ని పెంచేలా ఉంది. నిజజీవితాలకు దగ్గరగా ఉంటూ.. ప్రతిఒక్కరికీ గుర్తుండిపోయేలా ఈ చిత్రం ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేసే చిత్రమిదని.. ఒక మంచి రైడ్‌లా ఉంటుందని.. సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నారు. ఏప్రిల్ 13 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ (Disney Plus Hotstar)లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.

ఇవి కూడా చదవండి:

*********************************

*Virupaksha Trailer: మత్తెక్కించేలా.. సరికొత్త లుక్‌లో సంయుక్తా మీనన్

*All India NTR Fans: ‘సింహాద్రి’ని అందుకే రీ రిలీజ్ చేస్తున్నాం తప్ప.. స్వలాభం కోసం కాదు

*Ram Charan and Upasana: మాల్దీవుల్లో ఉన్నా.. మరిచిపోలేదండోయ్..

*Allu Aravind: సాయిధరమ్ ఫోన్ చేస్తుంటే.. గీతా ఆర్ట్స్‌లో సినిమా అడుగుతాడనుకున్నా.. కానీ?

*Raghava Lawrence: రామ్ చరణ్‌లో నాకు నచ్చింది ఏమిటంటే..

*Samantha: నేను ఫేస్ చేసిన స‌మ‌స్య‌ల వ‌ల్లే.. ఇప్పుడిలా మారిపోయా!

Updated Date - 2023-04-12T08:00:41+05:30 IST