Raai Laxmi: రాయ్‌ లక్ష్మీ అందుకు ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తోందా?

ABN , First Publish Date - 2023-04-12T10:30:05+05:30 IST

చిరంజీవి (Chiranjeevi), రవితేజ (Ravi Teja) వంటి అగ్రహీరోల సినిమాలలో ఐటం సాంగ్స్‌లో ఆమె నర్తించారు. ఈ నేపథ్యంలో ఇపుడామె ఎక్స్‌పోజింగ్‌

Raai Laxmi: రాయ్‌ లక్ష్మీ అందుకు ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తోందా?
Raai Laxmi

ఒకటిన్నర దశాబ్దంగా చిత్రపరిశ్రమలో కొనసాగుతున్న హీరోయిన్లలో రాయ్‌ లక్ష్మీ (Raai Laxmi) అలియాస్‌ లక్ష్మీరాయ్‌ (Laxmi Raai) ఒకరు. తెలుగు, తమిళం, మలయాళ భాషలతోపాటు బాలీవుడ్‌లోనూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఆమె... గ్లామర్‌ ఎక్స్‌పోజింగ్‌లో ఆరితేరారు. అనేక మంది అగ్రహీరోల చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో నటిస్తూ కుర్రకారును ఓ ఊపు ఊపుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ చిత్రం ‘భోళా’ (Bholaa) (తమిళ ‘ఖైదీ’ రీమేక్‌)లోనూ ఐటమ్‌ సాంగ్‌లో నటించారు. అదేవిధంగా మలయాళ అగ్రహీరోలు మమ్ముట్టి (Mammootty), మోహన్‌లాల్‌ (Mohan Lal) సరసన ఐదేసి చిత్రాల్లో నటించి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. టాలీవుడ్‌కి వచ్చేసరికి చిరంజీవి (Chiranjeevi), రవితేజ (Ravi Teja) వంటి అగ్రహీరోల సినిమాలలో ఐటం సాంగ్స్‌లో ఆమె నర్తించారు. ఈ నేపథ్యంలో ఇపుడామె ఎక్స్‌పోజింగ్‌ రోల్స్‌ తగ్గించి, ఫ్యామిలీ, పోలీస్‌ ఆఫీసర్‌ వంటి పాత్రలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

హీరోయిన్‌గా ఆమె ప్రయత్నాలు చేసినప్పుడు సరైన అవకాశాలు ఆమెను వరించలేదు. ఆ తర్వాత అవకాశాలు లేక ఐటం సాంగ్స్ (Item Songs), స్పెషల్ సాంగ్స్‌ (Special Songs)లో గ్లామర్ ప్రదర్శనకు ఓకే చెప్పేయడంతో.. ఆమెకు అన్ని సినిమాల ఇండస్ట్రీస్ నుంచి పిలుపు వస్తుంది. స్టార్ హీరోల సినిమాలలో సాంగ్స్ చేసే అవకాశం ఆమెను వరించింది. అయితే ఇలాంటి బ్యూటీకి ఇక సాంగ్సేనా? పాత్రలు రావా? అనుకుంటున్న సమయంలో.. ఇప్పుడామెను ప్రధాన పాత్రలో పెట్టి సినిమా తీసేందుకు దర్శకనిర్మాతలు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్లామర్ పాత్రలకి, ఐటం సాంగ్స్‌కి కొంతకాలం పాటు ఆమె గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉందట. ఇలా ఆమెపై వార్తలు రావడానికి కారణం లేకపోలేదు.

Raai-Laxmi.jpg

తాజాగా ఆమె మలయాళంలో నటిస్తున్న ఓ చిత్రానికి సంబంధించి కొన్ని పిక్స్ విడుదలయ్యాయి. అందులో ఆమె పోలీస్ ఆఫీసర్ (Police Role) పాత్ర చేస్తుంది. ఈ పాత్ర కోసం ఆమె బరువు కూడా తగ్గింది. స్లిమ్‌గా పోలీస్ అవతారంలో ఉన్న రాయ్ లక్ష్మీ (Raai Laxmi in Police Getup) ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుందని.. నెటిజన్లు అనుకుంటున్నారు. ఆమె గ్లామర్‌కి అలవాటు పడ్డవారంతా నిరాశకు లోనవుతున్నారు. ఎందుకంటే, సినిమా అవకాశాలు ఉన్నా, లేకున్నా.. గ్లామర్ ఫొటోషూట్స్‌తో నెటిజన్లని అలరించే రాయ్ లక్ష్మీని ఇకపై అలా చూడలేమేమో అనేలా వారు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. మొత్తానికి, చాలా కాలం తర్వాత.. రాయ్ లక్ష్మీకి కాస్త అభినయానికి ఆస్కారమున్న పాత్రలు (Raai Laxmi in Lady Oriented Films) లభిస్తున్నాయనేది మాత్రం స్పష్టమవుతోంది.

ఇవి కూడా చదవండి:

*********************************

*Allu Arjun: సూపర్ హిట్ సినిమా మిస్సయిన అల్లు అర్జున్.. ఏ సినిమానో తెలిస్తే షాకవుతారు

*Direct OTT Release: ఈ వారం రెండు సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోకి..

*Virupaksha Trailer: మత్తెక్కించేలా.. సరికొత్త లుక్‌లో సంయుక్తా మీనన్

*All India NTR Fans: ‘సింహాద్రి’ని అందుకే రీ రిలీజ్ చేస్తున్నాం తప్ప.. స్వలాభం కోసం కాదు

*Ram Charan and Upasana: మాల్దీవుల్లో ఉన్నా.. మరిచిపోలేదండోయ్..

*Allu Aravind: సాయిధరమ్ ఫోన్ చేస్తుంటే.. గీతా ఆర్ట్స్‌లో సినిమా అడుగుతాడనుకున్నా.. కానీ?

*Raghava Lawrence: రామ్ చరణ్‌లో నాకు నచ్చింది ఏమిటంటే..

Updated Date - 2023-04-12T11:30:33+05:30 IST