Virupaksha Trailer: మత్తెక్కించేలా.. సరికొత్త లుక్‌లో సంయుక్తా మీనన్

ABN , First Publish Date - 2023-04-11T22:28:29+05:30 IST

కంటెంట్ సంగతి అలా ఉంటే.. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. ‘భీమ్లా నాయక్’, ‘బింబిసార’, ‘సార్’ వంటి చిత్రాలతో హిట్లు కొడుతూ

Virupaksha Trailer: మత్తెక్కించేలా.. సరికొత్త లుక్‌లో సంయుక్తా మీనన్
Samyuktha Menon and Sai Tej in Virupaksha

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా (Pan India) మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ (Virupaksha). సంయుక్తా మీనన్ (Samyuktha Menon) కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కాబోతోంది. మంగ‌ళవారం (ఏప్రిల్ 11) ఈ చిత్ర ట్రైల‌ర్‌ను స్టార్ ప్రొడ్యూస‌ర్స్ అల్లు అర‌వింద్‌ (Allu Aravind), దిల్ రాజు (Dil Raju) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో చూస్తుంటే సినిమాలో కంటెంట్ బాగానే ఉన్నట్లుగా అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో అలరించే కంటెంట్ ఈ సినిమాలో పుష్కలంగా ఉందనే విషయాన్ని ఈ ట్రైలర్ తెలియజేస్తుంది.

కంటెంట్ సంగతి అలా ఉంటే.. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. ‘భీమ్లా నాయక్’, ‘బింబిసార’, ‘సార్’ వంటి చిత్రాలతో హిట్లు కొడుతూ దూసుకెళుతున్న ఈ భామని.. ఇందులో సరికొత్త లుక్‌లో ప్రజంట్ చేశారనే విషయం తొలి షాట్‌లో మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. మరీ ముఖ్యంగా సాయిధరమ్ తేజ్ చెప్పే ‘‘ఎంత పెద్ద కళ్లుంటే.. అంత ప్రేమ ఉంటుందని తెలుసా’’ డైలాగ్ షాట్‌లో సంయుక్తా మీనన్‌ని అంతా రిపీట్ మోడ్‌లో చూస్తున్నారంటే.. ఏ రేంజ్‌లో ఆమె ఆకర్షించిందో అర్థం చేసుకోవచ్చు. ‘సార్’ సినిమాలో చీరల్లో దర్శనమిచ్చిన సంయుక్తా.. ఇందులో లంగా ఓణీల్లో కనిపిస్తూ.. కాస్త గ్లామర్ ప్రదర్శన కూడా చేసినట్లుగా అర్థమవుతుంది. (Samyuktha Menon Appearence in Virupaksha Trailer)

ఈ మధ్య సంయుక్తా మీనన్ భారీగానే వార్తలలో నిలుస్తుంది. ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) సినిమా అప్పటి నుంచి టాలీవుడ్‌లో టాప్ ఛైర్ కోసం పోటీ పడుతున్న భామలలో తను కూడా వచ్చి చేరింది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను చూజ్ చేసుకుంటూ.. సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంటూ.. టాప్ ఛైర్ కోసం పోటీపడుతుంది. ఆమె ఖాతాలో ఇంకో రెండు హిట్స్ పడితే మాత్రం.. టాప్ ఛైర్ (Tollywood Top Heroine) విషయంలో సంయుక్తా పేరు మారుమోగడం ఖాయం. ఇప్పుడు ‘విరూపాక్ష’ ట్రైలర్‌లో ఆమెను చూసిన కుర్రకారు.. ‘మత్తెక్కించేస్తుంది.. అసలు మైండ్‌లో నుంచి పోవడం లేదు’ అనేలా కామెంట్స్ చేస్తున్నారంటే.. సంయుక్తా గ్లామర్ పవర్ అలాంటిది మరి. చూద్దాం.. ఈ సినిమా ఆమెను ఏ దరికి చేర్చుతుందో..


ఇవి కూడా చదవండి:

*********************************

*All India NTR Fans: ‘సింహాద్రి’ని అందుకే రీ రిలీజ్ చేస్తున్నాం తప్ప.. స్వలాభం కోసం కాదు

*Ram Charan and Upasana: మాల్దీవుల్లో ఉన్నా.. మరిచిపోలేదండోయ్..

*Allu Aravind: సాయిధరమ్ ఫోన్ చేస్తుంటే.. గీతా ఆర్ట్స్‌లో సినిమా అడుగుతాడనుకున్నా.. కానీ?

*Raghava Lawrence: రామ్ చరణ్‌లో నాకు నచ్చింది ఏమిటంటే..

*Samantha: నేను ఫేస్ చేసిన స‌మ‌స్య‌ల వ‌ల్లే.. ఇప్పుడిలా మారిపోయా!

*NTR 2 NTR: ‘ఆది’.. జూనియర్ ఎన్టీఆర్ టు సీనియర్ ఎన్టీఆర్.. మాస్ అప్‌డేట్

*Renu Desai: నా బాధ అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నందుకు ధైర్యంగా ఉంది

Updated Date - 2023-04-11T22:28:30+05:30 IST