NTR 30: కొరటాల స్పీడ్ చూశారా.. అప్పుడే ఒకటి ఫినిష్..!

ABN , First Publish Date - 2023-04-12T11:29:06+05:30 IST

NTR 30 సినిమాకు సంబంధించి కొరటాల యమా ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నారు. ‘ఆచార్య’ ఫ్లాప్ మీదున్న ఆయన ఏం చేస్తున్నారంటే..

NTR 30: కొరటాల స్పీడ్ చూశారా.. అప్పుడే ఒకటి ఫినిష్..!
Jr NTR And Janhvi Kapoor at NTR 30 Pooja Event

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా వేచి చూస్తున్నారో.. సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి తెలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా తర్వాత ఎన్టీఆర్ (Jr NTR) ఏ సినిమాని ప్రకటించలేదు. కొరటాల శివ (Koratala Siva)తో అనుకున్న సినిమా పట్టాలెక్కలేదు. మరోవైపు రామ్ చరణ్ (Ram Charan) యమా స్పీడ్ మీద దూసుకెళుతున్నాడు. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వారి రచ్చ చూసిన ఎన్టీఆర్ కూడా ఈ మధ్య ఓ వేదికపై.. ‘సమయం వచ్చేంత వరకు ఆగాలి.. కాస్త ఓపిక ఉండాలి’ అంటూ కౌంటర్ వేశారు. అంతేకాదు, ఇలాగే చేస్తే నేను సినిమాలు కూడా మానేస్తానంటూ హెచ్చరించారు కూడా. అప్పటి నుంచి ఫ్యాన్స్ హడావుడి కాస్త తగ్గింది. అయితే ఎన్టీఆర్ ఇలా చెప్పిన రెండో రోజే.. కొరటాల సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోవడం, వెంటనే సెట్స్‌పైకి వెళ్లిపోవడం జరిగాయి. దీంతో ఫ్యాన్స్ (NTR Fans) యమా హ్యాపీగా ఫీలయ్యారు.

Read Also- Sridevi: శ్రీదేవిని ఆ నిర్మాత ఏమి చేసాడో తెలిస్తే షాక్ అవుతారు

NTR-30.jpg

ఇదిలా ఉంటే.. NTR 30 సినిమా షూట్ జరుగుతుండగానే.. ఆయన నటించనున్న మరో సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. బాలీవుడ్‌ (Bollywood)లో ‘వార్ 2’ (War 2)గా తెరకెక్కనున్న సినిమాలో హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్ (NTR) కలిసి నటించబోతున్నారంటూ అధికారికంగా ప్రకటన రావడంతో.. ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అప్‌డేట్ లేదు అనుకుని నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ అనేలా అధికారికంగా ప్రకటనలు వచ్చేశాయి. ఇవి రెండూ కాకుండా.. ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel)తో కూడా ఎన్టీఆర్ ఓ చిత్రం కమిటై ఉన్నారు. ఆ సినిమా వివరాలు కూడా త్వరలోనే రానున్నాయి. ఇక కొరటాలతో చేస్తున్న సినిమాకు సంబంధించి తాజాగా మరో అప్‌డేట్ వచ్చేసింది.

NTR-30-Movie.jpg

NTR 30 సినిమాకు సంబంధించి కొరటాల అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ని పూర్తి చేశారు. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 8 వరకు రామోజీ ఫిల్మ్ సిటీ‌ (RFC)లో వేసిన సెట్‌లో.. భారీ ఫైట్ సీన్‌ను చిత్రీకరించారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన రెండో షెడ్యూల్‌ని ఈ నెలాఖరు‌లో స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందనే విషయం తెలిసి.. కొరటాల‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘అయిన ఆలస్యం ఎలాగూ అయింది.. ఈసారి మిస్ కాకూడదు.. రికార్డులు షేకవ్వాలి.. ఏం చేస్తావో ఏమో ఇక నీ ఇష్టం’ అనేలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. కాగా.. ఎన్టీఆర్ సరసన జాన్వీకపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సౌత్ సెన్సేషన్ అనిరుధ్ (Anirudh) మ్యూజిక్ అందిస్తున్నారు. 2024లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి:

*********************************

*Raai Laxmi: రాయ్‌ లక్ష్మీ అందుకు ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తోందా?

*Allu Arjun: సూపర్ హిట్ సినిమా మిస్సయిన అల్లు అర్జున్.. ఏ సినిమానో తెలిస్తే షాకవుతారు

*Direct OTT Release: ఈ వారం రెండు సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోకి..

*Virupaksha Trailer: మత్తెక్కించేలా.. సరికొత్త లుక్‌లో సంయుక్తా మీనన్

*All India NTR Fans: ‘సింహాద్రి’ని అందుకే రీ రిలీజ్ చేస్తున్నాం తప్ప.. స్వలాభం కోసం కాదు

*Ram Charan and Upasana: మాల్దీవుల్లో ఉన్నా.. మరిచిపోలేదండోయ్..

Updated Date - 2023-04-12T11:33:40+05:30 IST