Allu Arjun: సూపర్ హిట్ సినిమా మిస్సయిన అల్లు అర్జున్.. ఏ సినిమానో తెలిస్తే షాకవుతారు

ABN , First Publish Date - 2023-04-12T08:49:51+05:30 IST

అల్లు అర్జున్ తన దర్శకత్వంలో వచ్చిన ఓ చిత్రంలో చేయాల్సింది కానీ.. మిస్సయిందని అన్నారు కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెట్రిమారన్.. వివరాలలోకి వెళితే..

Allu Arjun: సూపర్ హిట్ సినిమా మిస్సయిన అల్లు అర్జున్.. ఏ సినిమానో తెలిస్తే షాకవుతారు
Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (IconStar Allu Arjun) కి ఓ పవర్‌ఫుల్ రోల్ చెప్పాను.. కానీ కొన్ని కారణాల వల్ల అతనని డైరెక్ట్ చేసే అవకాశం రాలేదని అన్నారు.. తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran). సూరి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో వెట్రిమారన్ రూపొందించిన చిత్రం ‘విడుతలై పార్ట్ 1’ (Viduthalai Part 1). రీసెంట్‌గా కోలీవుడ్‌ (Kollywood)లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడీ చిత్రాన్ని గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ (Geetha Film Distribution) ద్వారా ‘విడుదల పార్ట్ 1’ (Vidudhala Part 1) పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఏప్రిల్ 15న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మంగళవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‌ (Allu Arjun)తో సినిమాకు సంబంధించి వెట్రిమారన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అల్లు అర్జున్‌తో సినిమా ఎప్పుడు అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ (Vetrimaaran Talks about Movie with Allu Arjun).. ‘ఆడుకాలం’ మూవీ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ గారిని చెన్నైలో కలిశాను. అప్పుడు ఆయనే కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను.. ఏదైనా స్టోరి ఉంటే చెప్పండి సర్ అని అడిగారు. అప్పుడు నా దగ్గర ‘వడ చెన్నై’ (Vada Chennai) మూవీ స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఆయన కోసం కొన్ని మార్పులు చేసి స్టోరీ వినిపించాను. ఆయనకు కూడా నచ్చింది కానీ.. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆయనతో చేయలేకపోయాను. ఆయనతో మళ్లీ ఛాన్స్ వస్తే మాత్రం తప్పకుండా మంచి సినిమా చేయడానికి ప్రయత్నిస్తానని వెట్రిమారన్ (Director Vetrimaaran) చెప్పుకొచ్చారు.

Vetrimaaran.jpg

వెట్రిమారన్ చెప్పిన విషయం ప్రకారం అల్లు అర్జున్ (Allu Arjun) కోలీవుడ్‌లో ఓ మంచి సక్సెస్ చిత్రాన్ని మిస్సయ్యారని చెప్పుకోవచ్చు. ఇక బన్నీ (Bunny) విషయానికి విషయానికి వస్తే.. ‘పుష్ప’ (Pushpa) చిత్రంతో ఆయన క్రేజ్ ఖండంతరాలను దాటింది. ఇప్పుడు ‘పుష్ప 2’ (Pushpa The Rule)తో మరోసారి తన సత్తా చాటేందుకు అల్లు అర్జున్ సిద్ధమవుతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై దీనిని వై. రవిశంకర్, నవీన్ యెర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఇటీవలే ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్‌ని బన్నీ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌తో పాటు కొరటాల శివ, సందీప్ వంగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారితో ఆయన వరుసగా సినిమాలు చేయనున్నారు. ఇక వెట్రిమారన్ చెబుతున్న ప్రకారం చూస్తే.. త్వరలోనే అల్లు అర్జున్, వెట్రిమారన్ కాంబినేషన్‌లో సినిమా ఉండే అవకాశం అయితే లేకపోలేదు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Direct OTT Release: ఈ వారం రెండు సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోకి..

*Virupaksha Trailer: మత్తెక్కించేలా.. సరికొత్త లుక్‌లో సంయుక్తా మీనన్

*All India NTR Fans: ‘సింహాద్రి’ని అందుకే రీ రిలీజ్ చేస్తున్నాం తప్ప.. స్వలాభం కోసం కాదు

*Ram Charan and Upasana: మాల్దీవుల్లో ఉన్నా.. మరిచిపోలేదండోయ్..

*Allu Aravind: సాయిధరమ్ ఫోన్ చేస్తుంటే.. గీతా ఆర్ట్స్‌లో సినిమా అడుగుతాడనుకున్నా.. కానీ?

*Raghava Lawrence: రామ్ చరణ్‌లో నాకు నచ్చింది ఏమిటంటే..

Updated Date - 2023-04-12T08:49:52+05:30 IST