Rudrudu: రాఘవ లారెన్స్‌ ‘రుద్రుడు’కి లైన్ క్లియర్

ABN , First Publish Date - 2023-04-13T14:39:55+05:30 IST

రిలీజ్‌కు ఇంకొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో సినిమా విడుదల కావడం లేదంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

Rudrudu: రాఘవ లారెన్స్‌ ‘రుద్రుడు’కి లైన్ క్లియర్
Rudrudu Movie Still

రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence) హీరోగా నటించిన ‘రుద్రుడు’ (Rudrudu) విడుదలకు సంబంధించి వినిపిస్తున్న వార్తలకు నిర్మాత ఠాగూర్ మధు బ్రేక్ వేశారు. ఈ సినిమా అన్ని ఇష్యూస్‌ని అధిగమించి ఏప్రిల్ 14న అన్ని చోట్లా విడుదల కాబోతున్నట్లుగా తెలిపారు. నిర్మాత కదిరేశన్‌ ఫైవ్‌స్టార్‌ క్రియేషన్స్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. టాలీవుడ్‌లో పిక్సెల్ స్టూడియోస్‌‌పై నిర్మాత ఠాగూర్ మధు (Pixel Studios Tagore Madhu) విడుదల చేస్తున్నారు. హిందీతో పాటు ఉత్తరాది పంపిణీ హక్కులను సొంతం చేసుకున్న రెవెన్సా అనే కంపెనీ సినిమాపై కోర్టుకు వెళ్లడంతో సినిమా రిలీజ్ ఆగిపోయినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా అన్ని ఇష్యూని సాల్వ్ చేసుకుని.. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 14న గ్రాండ్‌గా విడుదల కాబోతున్నట్లుగా నిర్మాత ఠాగూర్ మధు తెలిపారు.

అసలు.. సమస్య ఏమిటంటే?

హిందీతో పాటు ఉత్తరాది పంపిణీ హక్కులను సొంతం చేసుకున్న రెవెన్సా అనే కంపెనీ.. ఇందుకోసం రూ.12.25 కోట్లతో ఒప్పందం కూడా కుదుర్చుకుని, రూ.10 కోట్లను అడ్వాన్స్‌గా చెల్లించిందట. ఇపుడు మరో రూ.4.25 కోట్లు చెల్లించాలని నిర్మాణ సంస్థ డిమాండ్‌ చేయడంతో రెవెన్సా సంస్థ మద్రాస్‌ హైకోర్టు (Madras High Court)ను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఈ నెల 24వ తేదీ వరకు చిత్రాన్ని విడుదల చేయవద్దని ఆదేశాలు జారీచేయడంతో.. నిర్మాతలు ఆ కంపెనీతో మాట్లాడుకుని సమస్యని సాల్వ్ చేసుకున్నారు. దీంతో ఈ సినిమా విడుదలకు సంబంధించి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. పాన్‌ ఇండియా (Pan India) మూవీగా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ మాస్‌ యాక్షన్‌ మూవీలో రాఘవ లారెన్స్‌, ప్రియా భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar) జంటగా నటించారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ యమా జోరుగా నడుస్తున్నాయి. రీసెంట్‌గా హైదరాబాద్‌లో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.

Lawrence.jpg

‘రుద్రుడు’ సినిమా గురించి హీరో లారెన్స్ చెబుతూ.. కాంచనలో వున్న థ్రిల్ రుద్రుడులో కూడా వుంటుంది. అయితే అది వేరే విధంగా వుంటుంది. కాంచనలో వున్న ఎంటర్‌టైన్‌మెంట్, మాస్ ఎపిసోడ్స్ రుద్రుడులో వుంటాయి. అలాగే యాక్షన్‌కి చాలా ఇంపార్టెన్స్ వుంటుంది. మాస్ అంటే ఎమోషన్. ఎమోషన్ ఉంటేనే మాస్ వస్తుంది. రుద్రుడులో ఎమోషన్‌ని బాగా నమ్ముతున్నాను. ఇది వందశాతం రీచ్ అవుతుందని భావిస్తున్నానని అన్నారు. కాగా ఇందులో శరత్‌ కుమార్‌ (Sarath Kumar) విలన్‌గా నటించగా.. పూర్ణిమా భాగ్యరాజ్‌ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Shocking: యాంకర్ సుమ అరెస్ట్.. ఎందుకంటే?

*Brahmaji: ట్రైలర్ బాగుందా? అని అడిగిన సంయుక్తకు షాకింగ్ రిప్లయ్

*NTR 30: కొరటాల స్పీడ్ చూశారా.. అప్పుడే ఒకటి ఫినిష్..!

*Allu Arjun: సూపర్ హిట్ సినిమా మిస్సయిన అల్లు అర్జున్.. ఏ సినిమానో తెలిస్తే షాకవుతారు

*Direct OTT Release: ఈ వారం రెండు సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోకి..

*Virupaksha Trailer: మత్తెక్కించేలా.. సరికొత్త లుక్‌లో సంయుక్తా మీనన్

Updated Date - 2023-04-13T15:13:04+05:30 IST