Shocking: యాంకర్ సుమ అరెస్ట్.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2023-04-13T11:38:41+05:30 IST

సుమను అరెస్ట్ చేసి కారులో తీసుకెళుతున్నట్లుగా ఓ ఫొటో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. దీంతో సుమకి ఏమైంది? సుమ ఏం చేసిందని అరెస్ట్ చేశారు? అంటూ

Shocking: యాంకర్ సుమ అరెస్ట్.. ఎందుకంటే?
Suma Kanakala Arrested

తన యాంకరింగ్‌తో స్టేడియంలో ఉన్న ఆడియెన్స్‌‌నే కాకుండా.. ఆట ఆడే ఆటగాళ్లను సైతం ఆకట్టుకోగల నైపుణ్యం సుమ సొంతం. ఆమె లేకుండా స్టార్ హీరోలు తమ సినిమాలకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకలను కూడా నిర్వహించరు. సుమ (Suma) ఉంటేనే, సుమ వచ్చాకే ప్రీ రిలీజ్ వేడుక (Pre Release Event) నిర్వహించుకుందాం అనేంత క్రేజ్‌ని, నేమ్‌ని సుమ సొంతం చేసుకుంది. అలాంటి సుమను ఇప్పుడు అరెస్ట్ (Anchor Suma Arrest) చేశారు. ఎవరు అరెస్ట్ చేశారనేది క్లారిటీ లేదు కానీ.. ఆమెను అరెస్ట్ చేసి కారులో తీసుకెళుతున్నట్లుగా ఓ ఫొటో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. దీంతో సుమకి ఏమైంది? సుమ ఏం చేసిందని అరెస్ట్ చేశారు? అంటూ ఒకటే చర్చలు నడస్తున్నాయి.

Suma-dash.jpg

అసలే ఈ మధ్య సుమకి, రాజీవ్ కనకాల (Rajiv Kanakala)కి మధ్య విభేదాలు తలెత్తాయనేలా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఏమైనా చేయకూడని పని చేసి ఉంటుందా? అందుకే పోలీసులు అరెస్ట్ చేశారా? లేదంటే.. ఈ మధ్య ప్రతి ఫంక్షన్‌లో హీరోలు మాట్లాడేటప్పుడు ఎవరో ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి.. వారి కాళ్లమీద పడిపోతుండటం గమనించిన సుమ (Anchor Suma).. అలా వస్తున్న వారినెవరినైనా కత్తితో కసకసమని పీక కోసేసి ఉంటుందా? ఏమో ఏదైనా జరిగి ఉండవచ్చు. సుమ అసలే హైపర్ యాక్టివేటెడ్ ఉమెన్. ఏదైనా జరిగి ఉండవచ్చు. అందుకే ఆమెను అరెస్ట్ చేసి ఉండవచ్చు అనేలా రకరకాలుగా సుమ అరెస్ట్‌పై కామెంట్స్ నడుస్తున్నాయి.

Suma-1.jpg

అయితే అసలు విషయం తెలిసి అంతా నోరెళ్లబెడుతున్నారు. వాస్తవానికి సుమ అరెస్ట్ అయిందంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదా. ఈ మధ్య సినిమాల ప్రమోషన్స్ కోసం, వార్తలను హైలెట్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడెక్కడో యుద్ధం జరిగితే.. ఆ యుద్ధం పక్కనుండి కవర్ చేసినట్లుగా, బాత్ టబ్‌లో హీరోయిన్ చనిపోతే.. అందులో పడుకుని ఇలా చనిపోయిందా? అలా చనిపోయిందా? అనేలా హైలెట్ చేసే స్థాయికి మైండ్ సెట్స్ చేరినప్పుడు.. ఒక సినిమా ప్రమోషన్ కోసం సుమ అరెస్ట్ కావడం పెద్ద విషయమే కాదు. ఇదంతా సినిమా ప్రమోషన్ కోసమనేది ఇట్టే అర్థమైపోతుంది. నాగచైతన్య చేస్తున్న ‘కస్టడీ’ (Naga Chaitanya Custody) లేదంటే, అల్లరి నరేష్ ‘ఉగ్రం’ (Allari Naresh Ugram) సినిమా ప్రమోషన్స్ నిమిత్తం.. సుమ ఇలా అరెస్ట్ అయి ఉంటుందనేలా టాక్ నడుస్తున్న నేపథ్యంలో.. ‘ఉగ్రం’ సినిమా ప్రమోషన్స్ కోసం సుమ ఇలా అరెస్ట్ అయిందనేలా మేకర్స్ నుంచి చిన్న క్లారిటీ కూడా వచ్చేసింది. అదీ విషయం.

ఇవి కూడా చదవండి:

*********************************

*Brahmaji: ట్రైలర్ బాగుందా? అని అడిగిన సంయుక్తకు షాకింగ్ రిప్లయ్

*NTR 30: కొరటాల స్పీడ్ చూశారా.. అప్పుడే ఒకటి ఫినిష్..!

*Raai Laxmi: రాయ్‌ లక్ష్మీ అందుకు ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తోందా?

*Allu Arjun: సూపర్ హిట్ సినిమా మిస్సయిన అల్లు అర్జున్.. ఏ సినిమానో తెలిస్తే షాకవుతారు

*Direct OTT Release: ఈ వారం రెండు సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోకి..

*Virupaksha Trailer: మత్తెక్కించేలా.. సరికొత్త లుక్‌లో సంయుక్తా మీనన్

Updated Date - 2023-04-13T15:17:46+05:30 IST