కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lokesh Kanagaraj: ఆ డైలాగ్‌ వివాదానికి పూర్తి బాధ్యత నాదే!

ABN, First Publish Date - 2023-10-09T17:44:08+05:30

హీరో విజయ్‌ నటించిన తాజా చిత్రం ‘లియో’కు సంబంధించిన ట్రైలర్‌ను ఈ నెల 5న విడుదల చేయగా, అందులో ఓ అసభ్య పదజాలంతో కూడిన డైలాగ్‌ ఉంది. ఇది పెను దుమారం రేపింది. ఈ వివాదానికి పూర్తి బాధ్యత తనదేనని లియో దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ స్పష్టం చేశారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించే 171 చిత్ర కథను ‘మానగరం’కు ముందే సిద్ధం చేశానని కూడా లోకేష్ చెప్పుకొచ్చారు.

Lokesh Kanagaraj

హీరో విజయ్‌ నటించిన తాజా చిత్రం ‘లియో’ (Leo)కు సంబంధించిన ట్రైలర్‌ను ఈ నెల 5న విడుదల చేయగా, అందులో ఓ అసభ్య పదజాలంతో కూడిన డైలాగ్‌ ఉంది. ఇది పెను దుమారం రేపింది. ఈ వివాదానికి పూర్తి బాధ్యత తనదేనని లియో దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ (Lokesh Kanagaraj) స్పష్టం చేశారు. ఈనెల 19న లియో విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని తాజాగా జరిగిన ఓ ప్రమోషన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఈ డైలాగ్ వివాదం గురించి మాట్లాడుతూ.. ‘‘సినిమాలో కచ్చితంగా ఆ డైలాగ్‌ ఉండాలి. అమాయకుడైన ఒక వ్యక్తి తీవ్ర మనోవేదనకు గురై అలా మాట్లాడుతారు. ఆ డైలాగ్‌ ఏ ఒక్కరినీ నొప్పించాలన్నది ఉద్దేశం కాదు. దీనిపై చెలరేగిన వివాదానికి పూర్తి బాధ్యత నాదే. దీనికి, విజయ్‌ (Vijay)కు ఎలాంటి సంబంధం లేదు. ఈ షాట్‌ చిత్రీకరణ సమయంలో ఈ డైలాగ్‌ అవసరమా? అని విజయ్‌ ప్రశ్నించగా, కథ డిమాండ్‌ మేరకు ఉండాలని చెప్పాను. యూట్యూబ్‌లో రిలీజ్‌ చేసే ట్రైలర్‌లో సెన్సార్‌ ఉండదు. కానీ, సెన్సార్‌ చేసే సమయంలో ఆ డైలాగ్‌ను మ్యూట్‌ చేస్తారు. కాబట్టి మూవీలో ఆ డైలాగ్ వినిపించదు. (Lokesh Kanagaraj about Leo Dialogue Controversy)


సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Super Star Rajinikanth) నటించే 171 చిత్ర కథను ‘మానగరం’కు ముందే సిద్ధం చేశాను. ఇందులో నా స్నేహితుడు ఒకరు నటించాల్సి ఉంది. ఆ కథలోనే ఇపుడు రజనీకాంత్‌ నటిస్తున్నారు. ఇటీవల రజనీని కలిసి 20 నిమిషాలు పాటు కథ వినిపించాను. ‘దుమ్ము రేపుదాం కన్నా’ అని ఆయన అన్నారు. రెండు వారాల క్రితం ఆఫీసును కూడా ప్రారంభించాం. మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్‌ మొదటి వారంలో ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది’’ అని వివరించారు.


ఇవి కూడా చదవండి:

============================

*Kangana Ranaut: నాకూ పెళ్లి చేసుకోవాలనే ఉంది.. కానీ?

******************************

*Sreeleela: కట్ చెప్పిన తర్వాత కూడా అదే ఎమోషన్‌లో ఉండేదాన్ని..

************************************

*Chiranjeevi: మీ మాటను వెనక్కి తీసుకోవాలి.. సినీ జర్నలిస్ట్‌ను కోరిన చిరు!

**********************************

*NBK: ‘భగవంత్ కేసరి’ ట్రైలర్‌లో చూసింది కొంతే.. చూడాల్సింది చాలా ఉంది.. అదంతా దాచి పెట్టాం!

*************************************

*Ganjam: మ్యారేజ్ అనంతరం త్రిగుణ్ చేస్తున్న సినిమా ఇదే.. టీజర్ విడుదల

**********************************

*Ayalaan: ట్రెండింగ్‌లో ‘అయలాన్‌’.. అందుకే సంక్రాంతికి అంటోన్న ఎస్.కె.

*************************************

*Manchu Lakshmi: మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’ లుక్.. అరాచకం అంతే..!

**************************************

Updated Date - 2023-10-09T17:44:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!