Sreeleela: కట్ చెప్పిన తర్వాత కూడా అదే ఎమోషన్‌లో ఉండేదాన్ని..
ABN , First Publish Date - 2023-10-09T14:23:13+05:30 IST
నా జీవితంలో లేని అనుభవాల్ని ‘భగవంత్ కేసరి’ ఇచ్చిందని అన్నారు టాలీవుడ్ క్రష్ శ్రీలీల. నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఆదివారం వరంగల్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీలీల ఎమోషనల్‌గా మాట్లాడింది.
 
                                    
నటసింహా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా.. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari). కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో టాలీవుడ్ క్రష్ శ్రీలీల (Sreeleela) కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, పాటలు వంటి వన్నీ హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానున్న నేపధ్యంలో ఆదివారం వరంగల్ (Warangal)లో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. దర్శకులు వంశీపైడిపల్లి, గోపీచంద్ మలినేని, బాబీ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. (Bhagavanth Kesari Trailer Launch Event)
ఈ కార్యక్రమంలో టాలీవుడ్ క్రష్ శ్రీలీల (Sreeleela Speech) మాట్లాడుతూ.. ‘‘ఈ వేడుక వరంగల్ (Warangal)లో జరగడం చాలా ఆనందంగా వుంది. ఇందులో నేను వరంగల్ అమ్మాయిగా కనిపిస్తాను. ‘భగవంత్ కేసరి’ బ్యూటీఫుల్ స్టోరీ. అందుకే ఇక్కడకు శ్రీలీలలా రాలేదు.. ఇందులో పాత్ర అయిన విజ్జి పాప (Vijji Papa)లా వచ్చాను. విజ్జి పాప అనే పేరు పెట్టిన అనిల్ రావిపూడి (Anil Ravipudi)గారికి థాంక్స్. సోల్ కనెక్ట్ వున్న అందమైన పాత్ర ఇచ్చిన అనిల్ రావిపూడిగారికి చాలా చాలా థాంక్స్. ఈ పాత్ర చేయడం నా అదృష్టం.

బాలకృష్ణ (Balakrishna)గారితో పని చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఇందులో చాలా అందమైన సీన్స్ వున్నాయి. కట్ చెప్పిన తర్వాత కూడా అదే ఎమోషన్‌లో కంటిన్యూ అయిపోయేదాన్ని. అప్పుడు బాలకృష్ణగారు సరదాగా జోకులు వేసి నవ్వించేవారు. నా జీవితంలో లేని అనుభవాల్ని ఈ సినిమా ద్వారా నాకు ఇచ్చారు. బాలకృష్ణ గారిది గొప్ప మనసు. ఈ సినిమాలో భాగం కావడం నా అదృష్టం. మా నిర్మాతలకు థాంక్స్. అక్టోబర్ 19న సినిమా వస్తుంది. తప్పకుండా అందరూ థియేటర్లలో చూడండి’’ అని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి:
============================
*Chiranjeevi: మీ మాటను వెనక్కి తీసుకోవాలి.. సినీ జర్నలిస్ట్‌ను కోరిన చిరు!
**********************************
*NBK: ‘భగవంత్ కేసరి’ ట్రైలర్‌లో చూసింది కొంతే.. చూడాల్సింది చాలా ఉంది.. అదంతా దాచి పెట్టాం!
*************************************
*Ganjam: మ్యారేజ్ అనంతరం త్రిగుణ్ చేస్తున్న సినిమా ఇదే.. టీజర్ విడుదల
**********************************
*Ayalaan: ట్రెండింగ్‌లో ‘అయలాన్’.. అందుకే సంక్రాంతికి అంటోన్న ఎస్.కె.
*************************************
*Manchu Lakshmi: మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’ లుక్.. అరాచకం అంతే..!
**********************************************