Kangana Ranaut: నాకూ పెళ్లి చేసుకోవాలనే ఉంది.. కానీ?

ABN , First Publish Date - 2023-10-09T16:55:03+05:30 IST

ఏ విషయం గురించి అయినా కుండబద్ధలు కొట్టేలా అభిప్రాయాలను చెప్పే కాంట్రవర్సరీ క్వీన్‌... కంగనా రనౌత్‌. ఈ జాతీయ ఉత్తమ నటి తాజాగా ‘చంద్రముఖి-2’గా అవతారం ఎత్తింది. ఇటీవలి కాలంలో దక్షిణాది చిత్రాలపై మక్కువ పెంచుకుంటున్న ఈ అందాల భామ.. తాజాగా పెళ్లిపై తన అభిప్రాయం చెప్పుకొచ్చింది. ఆ సమయం కోసం వేచి చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.

Kangana Ranaut: నాకూ పెళ్లి చేసుకోవాలనే ఉంది.. కానీ?
Kangana Ranaut

ఏ విషయం గురించి అయినా కుండబద్ధలు కొట్టేలా అభిప్రాయాలను చెప్పే కాంట్రవర్సరీ క్వీన్‌... కంగనా రనౌత్‌ (Kangana Ranaut). ఈ జాతీయ ఉత్తమ నటి తాజాగా ‘చంద్రముఖి-2’ (Chandramukhi 2)గా అవతారం ఎత్తింది. ఇటీవలి కాలంలో దక్షిణాది చిత్రాలపై మక్కువ పెంచుకుంటున్న ఈ అందాల భామ వెల్లడించిన కొన్ని అభిప్రాయాలివి...

నో జెండర్‌ ప్లీజ్‌...

సాధారణంగా విమెన్‌ ఓరియెంటెడ్‌, మేల్‌ ఓరియెంటెడ్‌ సినిమాలంటూ ట్యాగ్‌ ఇచ్చేస్తుంటాం. కానీ అలాంటి భావనను అందరూ తొలిగించుకోవాలి. సినిమాను సినిమాలాగే చూడాలి తప్ప దానికి జెండర్‌ జోడించొద్దు. నటిగా అన్ని రకాల సినిమాల్లోనూ నటించి, ప్రేక్షకులను మెప్పించాలనేదే నా కోరిక.

సరైన సమయం రావాలిగా...

ఇంకెన్నాళ్లు బ్యాచ్‌లర్‌గా ఉంటావని తరచూ అడుగుతుంటారు. నిజానికి నాకూ పెళ్లి (Marriage) చేసుకోవాలనే ఉంది. కానీ సరైన సమయం రావాలి కదా! ఏది ఎప్పుడు జరగాలని రాసిపెట్టుంటే అప్పుడే జరుగుతుంది. నాకంటూ సొంత కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలని ఆశగా ఉంది. అలాగని తొందరపడితే జరగదు కదా. చూద్దాం ఏం జరుగుతుందో మరి.

అడిగి మరీ...

‘ధామ్‌ ధూమ్‌’, ‘తలైవీ’ తర్వాత తమిళంలో నేను చేసిన మూడో సినిమా ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2). డ్యాన్స్‌, ఫైట్స్‌, మ్యూజిక్‌.. కలబోతగా వచ్చిన ఇలాంటి ఒక చిత్రంలో నటించడం ఇదే మొదటిసారి. నిజానికి దర్శకుడు వేరే కథ వినిపించడానికి నా దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో ఆయన ‘చంద్రముఖి 2’ తెరకెక్కిస్తున్నారని తెలిసి.. అందులో అవకాశం ఇవ్వమని అడిగా. ఇన్నేళ్ల నా సినీ ప్రయాణంలో అవకాశాల కోసం ఎవరినీ అడిగింది లేదు. కానీ ఐకానిక్‌ హిట్‌ ’చంద్రముఖి’ సీక్వెల్‌లో భాగమవ్వాలనే ఎలాంటి మొహమాటం లేకుండా అడిగి మరీ సాధించుకున్నా.

ఫన్నీ పర్సన్‌

లారెన్స్‌ మాస్టర్‌ (Lawrence Master) గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎక్కడో బ్యాగ్రౌండ్‌ డ్యాన్సర్‌గా కెరీర్‌ మొదలుపెట్టి... హీరో, దర్శకుడు రేంజ్‌కు ఎదిగారు. ఆయన ఫన్నీ పర్సన్‌ కూడా. సెట్‌లో ఎప్పుడూ జోక్స్‌ వేస్తూ అందరినీ నవ్విస్తుంటారు. సెట్‌లో అడుగుపెట్టిన మొదటిరోజు ఆయన నన్ను ‘మేడమ్‌’ అని పిలిచారు. రెండు రోజులు పోయాక ‘కంగనా’ అని పిలవడం మొదలుపెట్టారు. వారం తిరిగేసరికి ‘కంగూ’ అని ముద్దుపేరు పెట్టేశారు.

సెట్‌లో సరదాగా...

బాలీవుడ్‌లో అయితే షాట్‌ పూర్తయిన వెంటనే ఎవరి క్యారవాన్‌లోకి వాళ్లు వెళ్లిపోతారు. ఒకరితో ఒకరు మాట్లాడుకునే ఛాన్సే ఉండదు. కానీ సౌత్‌లో అలా కాదు.. షాట్‌ పూర్తయ్యాక, అందరూ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. తర్వాతి షాట్‌ రెడీ అనగానే మళ్లీ ఎవరి పాత్రల్లో వాళ్లు లీనమైపోతారు. నాకు ఈ పద్ధతి తెగ నచ్చేసింది. అందుకే నా రాబోయే చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency) సెట్‌లో ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నా... సహనటులందరూ ఫాలో అయ్యేలా చేస్తున్నా.


Kangana.jpg

డైలాగ్స్‌కు గొంతు పోయింది

‘చంద్రముఖి 2’ హిందీ వెర్షన్‌కి నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నా. ఆ సమయంలో గట్టి గట్టిగా అరుస్తూ, కేకలు వేస్తూ డైలాగ్స్‌ చెప్పాల్సి వచ్చింది. దాంతో గొంతు బాగా వాచిపోయింది. డబ్బింగ్‌ పూర్తయ్యే సరికి నీరసపడిపోయి జ్వరం కూడా వచ్చేసింది. కొన్ని రోజులు పాటు మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడ్డా.

ఫటాఫట్‌:

హ్యాండ్‌బ్యాగ్‌లో ఎప్పుడూ ఉండేవి: రుద్రాక్ష, లిప్‌బామ్‌, పర్ఫ్యూమ్‌, మొబైల్‌

ఫేవరెట్‌ హాలీడే స్పాట్‌: మనాలి

ఫేవరెట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌: ఏ.ఆర్‌. రెహమాన్‌

ఇష్టమైన నటుడు: డానియల్‌ డే లెవిస్‌

డ్యాన్స్‌ లేదా స్టంట్స్‌: స్టంట్స్‌కే నా ఛాయిస్‌

ఎక్కువగా భయపడేది: బల్లి.. అదంటే చాలా భయం

షాపింగ్‌ అంటే గుర్తొచ్చేది: లండన్‌

ఇష్టమైన ఫుడ్‌: ఆలూ టిక్కీ


ఇవి కూడా చదవండి:

============================

*Sreeleela: కట్ చెప్పిన తర్వాత కూడా అదే ఎమోషన్‌లో ఉండేదాన్ని..

************************************

*Chiranjeevi: మీ మాటను వెనక్కి తీసుకోవాలి.. సినీ జర్నలిస్ట్‌ను కోరిన చిరు!

**********************************

*NBK: ‘భగవంత్ కేసరి’ ట్రైలర్‌లో చూసింది కొంతే.. చూడాల్సింది చాలా ఉంది.. అదంతా దాచి పెట్టాం!

*************************************

*Ganjam: మ్యారేజ్ అనంతరం త్రిగుణ్ చేస్తున్న సినిమా ఇదే.. టీజర్ విడుదల

**********************************

*Ayalaan: ట్రెండింగ్‌లో ‘అయలాన్‌’.. అందుకే సంక్రాంతికి అంటోన్న ఎస్.కె.

*************************************

*Manchu Lakshmi: మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’ లుక్.. అరాచకం అంతే..!

**************************************

Updated Date - 2023-10-09T16:55:03+05:30 IST