సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kavya Thapar: మరణం అంచుల వరకు వెళ్ళి వచ్చా

ABN, First Publish Date - 2023-05-16T20:40:57+05:30

ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో హీరో విజయ్‌ ఆంటోని బోటు ప్రమాదానికి గురవ్వగా.. ఆ సమయంలో సముద్రంలో పడిపోయిన హీరోను హీరోయిన్‌ కావ్య థాపర్‌ రక్షించారు. ఈ విషయం స్వయంగా..

Kavya Thapar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హీరో విజయ్‌ ఆంటోని (Vijay Antony) కొత్త చిత్రం ‘పిచ్చైక్కారన్‌-2’ (Pichaikkaran 2). గతంలో వచ్చిన ‘పిచ్చైక్కారన్‌’ (Pichaikkaran)కు సీక్వెల్‌. టాలీవుడ్‌లో ఈ చిత్రం ‘బిచ్చగాడు 2’ (Bichagadu 2) పేరుతో విడుదలవుతోంది. ఈ నెల 19న విడుదల కానున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కావ్య థాపర్‌ (Kavya Thapar) నటించారు. అయితే, ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో హీరో విజయ్‌ ఆంటోని బోటు ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో సముద్రంలో పడిపోయిన హీరోను హీరోయిన్‌ కావ్య థాపర్‌ రక్షించారు. ఈ విషయం స్వయంగా హీరోనే మీడియాకు తెలియజేశారు. తాజాగా ఈ ఘటనపై హీరోయిన్ కావ్య థాపర్ కూడా స్పందించారు.

ఆమె మాట్లాడుతూ.. ‘‘ప్రమాదం జరిగిన వెంటనే విజయ్‌ ఆంటోని సముద్రంలో అపస్మారకస్థితిలో పడిపోయారు. ఆయన్ను చూడగానే రక్షించాలన్న తపనతో సముద్రంలో దూకి ఈత కొడుతూ పట్టుకున్నాను. ఇంతలో యూనిట్‌ సభ్యులు వచ్చి రక్షించారు. సముద్రంలో దూకినపుడు నేను కూడా మరణం అంచుల వరకు వెళ్లానని అనిపించింది. ఆ ఘటన ఎప్పుడు తలచుకున్నా కూడా.. మనసు భయానికి లోనవుతుంది. ఈ ఘటన జీవితంలో మరిచిపోలేనిది. నా ముఖానికి కూడా గాయాలయ్యాయి’’ అని చెప్పుకొచ్చింది. (Kavya Thapar about Accident at Bichagadu 2 sets)

కాగా ‘పిచ్చైక్కారన్‌’/ ‘బిచ్చగాడు’ సినిమా తల్లి సెంటిమెంట్‌‌‌‌తో తెరకెక్కగా.. ఇప్పుడు రాబోతోన్న ‘పిచ్చైక్కారన్‌-2’/ ‘బిచ్చగాడు 2’ చిత్రం చెల్లెలి సెంటిమెంట్‌తో (Sister Sentiment) ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ కథకు, ఆ కథకు అసలు సంబంధమే ఉండదని హీరో విజయ్ ఆంటోని కూడా తెలిపారు. ‘ఇది కొత్త కథ. ఈ కథను నేనే రాశా’ అని విజయ్ ఆంటోని చెప్పుకొచ్చారు. త్వరలోనే తెలుగులోనూ ఒక సినిమా చేసేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Major: ‘మేజర్’ హీరో అడివి శేష్‌‌ను.. మాజీ రాష్ట్రపతి ఇంటికి పిలిచి మరీ..!

* Sharwanand: మే ఎండింగ్‌లో.. జైపూర్‌లో పెళ్లి అనుకున్నారు కానీ..?

*Vijay Antony: చాలా రోజులు అరటిపళ్ళు తిని బతికా..

*Nikhil: అమిత్ షా నుంచి నాకూ ఆహ్వానం వచ్చింది.. కానీ?

*Tiger Nageswara Rao: ఫస్ట్ లుక్‌కి డేట్ ఫిక్సయింది.. ఈ సారి వేట మామూలుగా ఉండదట!

*Anasuya: రంగమ్మత్త కాదు.. సుమతిగా బోల్డ్ క్యారెక్టర్‌లో!

Updated Date - 2023-05-16T20:41:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!