Tiger Nageswara Rao: ఫస్ట్ లుక్‌కి డేట్ ఫిక్సయింది.. ఈ సారి వేట మామూలుగా ఉండదట!

ABN , First Publish Date - 2023-05-15T20:28:07+05:30 IST

ఈ సారి వేట మామూలుగా ఉండదు. ఫస్ట్ లుక్ వచ్చాక నా ఆకలితో పాటు మీ అందరి ఆకలి కూడా తీరిపోతుందని అనుకుంటున్నానని అన్నారు ‘టైగర్ నాగేశ్వరరావు’ దర్శకుడు. ఇంకా..

Tiger Nageswara Rao: ఫస్ట్ లుక్‌కి డేట్ ఫిక్సయింది.. ఈ సారి వేట మామూలుగా ఉండదట!
Tiger Nageswara Rao

‘‘ప్రియమైన తమ్ముళ్లు అందరికీ.. ఓపికగా వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు. మీ మెసేజెస్, ట్వీట్స్ అన్ని చూస్తున్నాను. మీరిస్తున్న ఎంకరేజ్మెంట్, ప్రేమే నాతో ఇంకా హార్డ్ వర్క్ చేపిస్తోంది. టైగర్.. నా నాలుగేళ్ల ఆకలి.. మీకు ఫస్ట్ లుక్‌లో చూపిస్తాను. ఈ సారి వేట మామూలుగా ఉండదు. ఫస్ట్ లుక్ వచ్చాక నా ఆకలితో పాటు మీ అందరి ఆకలి కూడా తీరిపోతుందని అనుకుంటున్నాను. ముహూర్తం ఫిక్స్ అయ్యింది తమ్ముళ్లు. వేటకి సిద్ధమా?’’ అంటూ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్ర దర్శకుడు (Tiger Nageswara Rao Director Vamsee) చేసిన ట్వీట్ చూస్తుంటే.. ఈసారి నిజంగా మోత గట్టిగా ఉండేలా అనిపిస్తోంది.

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). ఈ యేడాది విడుదలకాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఇది కూడా ఒకటి. ‘ద కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2’ వంటి రెండు బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) నిర్మిస్తోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. తాజాగా మేకర్స్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ లుక్‌ను మే 24న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు.

Tiger-Nageswara-Rao.jpg

టైగర్ నాగేశ్వరరావు 1970ల నేపథ్యంలో స్టూవర్టుపురంలోని గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. ఈ పవర్ ఫుల్ పాత్ర పోషించేందుకు రవితేజ (Ravi Teja) తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్త బాడీ లాంగ్వేజ్‌, యాసతో ఆకట్టుకోనున్నారు. ఈ సినిమా కోసం 5 ఎకరాల స్థలంలో స్టువర్టుపురం గ్రామాన్ని రిక్రియేట్ చేయడానికి భారీ బడ్జెట్‌ను కేటాయించారు. ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ (Gayathri Bharadwaj) హీరోయిన్లుగా నటిస్తుండగా.. అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు.


ఇవి కూడా చదవండి:

************************************************

*Anasuya: రంగమ్మత్త కాదు.. సుమతిగా బోల్డ్ క్యారెక్టర్‌లో!

*Spy Teaser: ‘కార్తికేయ 2’ని మించి.. నిఖిల్ మరో సాహసం చేస్తున్నాడు

*AadiKeshava Glimpse: పంజా వైష్ణవ్ తేజ్ ఉగ్రరూపం

*Pic Talk: రారా కృష్ణయ్యా.. రారా కృష్ణయ్యా..

*Ram Charan: ముంబైలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏం చేశారంటే..

*Krithi Shetty: కాబోయేవాడు కాస్త బొద్దుగా ఉండాలి..

*Ustaad Bhagat Singh: బాబాయ్ మూవీ గ్లింప్స్‌పై అబ్బాయ్ రియాక్షన్ ఇదే..

*Bandla Ganesh: బానిసత్వానికి భాయ్ భాయ్.. మళ్లీ రాజకీయాల్లోకి వస్తా..

Updated Date - 2023-05-15T20:28:07+05:30 IST