Major: ‘మేజర్’ హీరో అడివి శేష్‌‌ను.. మాజీ రాష్ట్రపతి ఇంటికి పిలిచి మరీ..!

ABN , First Publish Date - 2023-05-16T19:44:13+05:30 IST

మేజర్ సినిమా విడుదల తర్వాత ఆర్మీ సిబ్బంది, రాజకీయ నాయకులు, సినీ ప్రేక్షకులు తదితర అన్ని వర్గాల వారి నుంచి ఈ చిత్రంపై అభినందనలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన మాజీ రాష్ట్రపతి

Major: ‘మేజర్’ హీరో అడివి శేష్‌‌ను.. మాజీ రాష్ట్రపతి ఇంటికి పిలిచి మరీ..!
Adivi Sesh with Ram Nath Kovind

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) పాత్రలో అడివి శేష్ (Adivi Sesh) నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘మేజర్’. శశి కిరణ్ తిక్క (Sashi Kiran Tikka) దర్శకత్వంలో జీయంబీ ఎంటర్‌ టైన్‌‌మెంట్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, A+S మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా హ్యూజ్ బ్లాక్‌బస్టర్ కావడమే కాకుండా.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. సినిమా విడుదల తర్వాత ఆర్మీ సిబ్బంది, రాజకీయ నాయకులు, సినీ ప్రేక్షకులు తదితర అన్ని వర్గాల వారి నుంచి ఈ చిత్రంపై అభినందనలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన మాజీ రాష్ట్రపతి (Former President of India) రామ్ నాథ్ కోవింద్ (Ram Nath Kovind).. అడివి శేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

స్వయంగా హీరో అడివి శేష్‌ను ఇంటికి పిలిపించుకుని మరీ అభినందించారు. ఈ సినిమా నిర్మాణానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకోవడమే కాకుండా.. అంత గొప్పగా సినిమా తీసిన చిత్రయూనిట్‌ను ఆయన ఆశీర్వదించి, అభినందనలు తెలియజేశారు. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌ (Major Sandeep Unnikrishnan Biopic)‌గా ‘మేజర్’ చిత్రం తెరకెక్కింది. మాజీ రాష్ట్రపతి అభినందనలు ఈ సినిమాకు దక్కడంతో.. మేకర్స్‌‌కి గర్వకారణంగా ఫీలవుతూ.. ఇది అసలైన విజయం అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Major-Maji.jpg

‘మేజర్’ కథ (Major Story) విషయానికి వస్తే..

సందీప్‌ ఉన్నికృష్ణన్‌ (అడివి శేష్‌)కు చిన్నప్పటి నుంచి నేవీలో చేరాలని కోరిక. ఒకట్రెండు ప్రయత్నాలు చేసినా విఫలం అవుతాయి. తల్లిదండ్రులు (ప్రకాశ్‌రాజ్‌–రేవతి)లకు తను నేవీలోకి వెళ్లడం ఇష్టం ఉండదు. అయినప్పటికీ పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తాడు. అయితే తర్వాతి ప్రయత్నంలో తన క్లాస్‌మేట్‌ ఈషా(సయీ మంజ్రేకర్‌) సూచనతో ఆర్మీలో చేరాలనుకుంటాడు. అనుకున్నట్లుగానే ఆర్మీలో చేరి ఎన్‌.ఎస్‌.జీ కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి చేరుకుంటాడు. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి బరిలోకి దిగే.. ‘51 ఎస్‌.ఏ.జీ’ టీమ్‌కు సారథ్యం వహిస్తాడు. ఆ సమయంలో ముంబై తాజ్‌ హోటల్లో ఉగ్ర దాడి జరుగుతుంది. ఆ సమయంలో మేజర్‌ ఉన్నికృష్ణన్‌ తీసుకున్న స్టాండ్‌ ఏంటి? ఉగ్రవాదులను అంతమొందించడానికి మేజర్‌ సందీప్‌ ఏం చేశాడు. తాజ్‌ హోటల్‌‌లో బందీలుగా ఉన్న అమాయక ప్రజలను ఎలా కాపాడాడు? దాని కోసం తన ప్రాణాల్ని ఎలా పణంగా పెట్టాడు అన్నదే కథ.

ఇవి కూడా చదవండి:

************************************************

* Sharwanand: మే ఎండింగ్‌లో.. జైపూర్‌లో పెళ్లి అనుకున్నారు కానీ..?

*Vijay Antony: చాలా రోజులు అరటిపళ్ళు తిని బతికా..

*Nikhil: అమిత్ షా నుంచి నాకూ ఆహ్వానం వచ్చింది.. కానీ?

*Tiger Nageswara Rao: ఫస్ట్ లుక్‌కి డేట్ ఫిక్సయింది.. ఈ సారి వేట మామూలుగా ఉండదట!

*Anasuya: రంగమ్మత్త కాదు.. సుమతిగా బోల్డ్ క్యారెక్టర్‌లో!

Updated Date - 2023-05-16T19:44:13+05:30 IST