Nikhil: అమిత్ షా నుంచి నాకూ ఆహ్వానం వచ్చింది.. కానీ?

ABN , First Publish Date - 2023-05-16T14:08:22+05:30 IST

అమిత్ షా వాస్తవంగా కలవాలనుకున్నది ‘కార్తికేయ 2’ (Karthikeya 2) హీరో నిఖిల్‌ (Nikhil)ని అయితే.. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆ ప్లేస్‌లో నితిన్‌కి ఆహ్వానం వచ్చిందనేలా అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఇదే విషయంపై నిఖిల్

Nikhil: అమిత్ షా నుంచి నాకూ ఆహ్వానం వచ్చింది.. కానీ?
Nikhil at Spy Teaser Launch Event

ఆ మధ్య అమిత్ షా (Amit Shah).. టాలీవుడ్ హీరో నితిన్‌ (Nithiin)ని ప్రత్యేకంగా మీట్ అవడంతో.. అంతా ఆశ్చర్యపోయారు. నితిన్‌ని అమిత్ షా కలవడం వెనుక కారణం ఏమిటనేది ఎవరికీ తెలియదు. కానీ ఆయన వాస్తవంగా కలవాలనుకున్నది ‘కార్తికేయ 2’ (Karthikeya 2) హీరో నిఖిల్‌ (Nikhil)ని అయితే.. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆ ప్లేస్‌లో నితిన్‌కి ఆహ్వానం వచ్చిందనేలా అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఇదే విషయంపై నిఖిల్ తన ‘స్పై’ మూవీ టీజర్ లాంఛ్ (Spy Movie Teaser Launch) ఈవెంట్‌లో క్లారిటీ ఇచ్చారు. తనకు కూడా అమిత్ షా నుంచి ఆహ్వానం వచ్చినట్లుగా ఆయన తెలియజేశారు.

నిఖిల్ మాట్లాడుతూ.. ‘‘నాకు కూడా ఆహ్వానం వచ్చింది. ఓ పబ్లిక్ ఈవెంట్‌కి హాజరు కావాలని నాకు ఆహ్వానం పంపారు. కానీ నేను వెళితే.. అజెండాలని, అదని ఇదని అంటారు. నేను పాలిటిక్స్‌కి దూరంగా ఉండాలని అనుకున్నాను. సినిమా తీస్తున్నప్పుడు సినిమానే ఉండాలి. ఆయన ఆహ్వానానికి ధన్యవాదాలు. ఆయనకే కాదు.. ఏ పార్టీకి చెందిన మంత్రులైనా.. ‘కార్తికేయ 2’ సినిమాని చూసి ఎవరెవరైతే ప్రశంసించారో వారందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాని (‘స్పై’) కూడా ఇప్పుడు చాలా మంది మినిస్టర్స్‌కి రిలీజ్ కంటే ముందే చూపించబోతున్నాము. ఇందులో కాంట్రవర్సీకి చోటుండదు. అందుకే.. ఎవరికైనా డౌట్స్ ఉంటే.. అలాంటి వారందరికీ ముందే ఈ సినిమాని చూపించాలని డిసైడ్ అయ్యాం..’’ అని తెలిపారు.

Nikhil.jpg

జెండాలు.. అజెండాలు ఏం లేవ్

ఒక మంచి సినిమా చేద్దామనే ఆలోచన తప్ప.. జెండాలు, అజెండాలు మాకేం లేవని అన్నారు హీరో నిఖిల్. ఈ మధ్యకాలంలో నేషనల్ ఇష్యూస్ (National Issues) ఉన్న సినిమాలు ఏవైనా వస్తే.. అజెండా బేస్డ్ సినిమాలని ఒక ముద్ర వేస్తున్నారు. స్పై అజెండా బేస్డ్ సినిమానా? అనే ప్రశ్న ‘స్పై’ టీమ్‌కు ఎదురైంది. దీనికి నిఖిల్ సమాధానమిస్తూ.. ‘‘అజెండాలు ఏమిలేవు.. పొలిటికల్ పార్టీస్‌తో అసలు సంబంధమే లేదు. మా వెనుక ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్ లేదు. ఎవరినీ తక్కువ చేసే సినిమా అయితే కాదిది. ఎవరినీ ప్రమోట్ చేసినట్లుగా ఉండదు.. అలాగే కించపరిచినట్లుగా ఉండదు. ఒక నిజాయితీగా ప్రయత్నించిన ఫన్ సినిమా ఇది. టీజర్ చూశాక అందరికీ అర్థమయ్యే ఉంటుంది. యాక్షన్, రొమాంటిక్, ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్నీ ఉంటాయి. మేమంతా కూడా రియల్ ‘రా’ ఏజెంట్స్‌లా ట్రైనింగ్ కూడా తీసుకున్నాం. ఫన్ ఫిల్మ్ ఇది.. అజెండాలు ఏమీ లేవు’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Tiger Nageswara Rao: ఫస్ట్ లుక్‌కి డేట్ ఫిక్సయింది.. ఈ సారి వేట మామూలుగా ఉండదట!

*Anasuya: రంగమ్మత్త కాదు.. సుమతిగా బోల్డ్ క్యారెక్టర్‌లో!

*Spy Teaser: ‘కార్తికేయ 2’ని మించి.. నిఖిల్ మరో సాహసం చేస్తున్నాడు

*AadiKeshava Glimpse: పంజా వైష్ణవ్ తేజ్ ఉగ్రరూపం

Updated Date - 2023-05-16T14:08:22+05:30 IST