Anasuya: రంగమ్మత్త కాదు.. సుమతిగా బోల్డ్ క్యారెక్టర్‌లో!

ABN , First Publish Date - 2023-05-15T19:13:01+05:30 IST

అనసూయ బోల్డ్ పాత్రలో (Bold Character) నటించిన చిత్రానికి సంబంధించిన లుక్ ఒకటి విడుదలైంది. జీవితంలో ఒక్కొక్క‌రికీ ఒక్కో క‌థ ఉంటుంది. ప్ర‌తీ క‌థ‌లోనూ హృద‌యాల‌ను క‌దిలించే భావోద్వేగం ఉంటుంది. అలాంటి సుమ‌తి (Sumathi) అనే

Anasuya: రంగమ్మత్త కాదు.. సుమతిగా బోల్డ్ క్యారెక్టర్‌లో!
Anasuya

‘రంగస్థలం’ (Rangasthalam) చిత్రంలో రంగమ్మత్తగా అనసూయ (Anasuya) తన నటనతో అందరినీ మెప్పించింది. ఆ తర్వాత ఆమెకు ఆ తరహా పాత్రలు చాలానే వచ్చాయి కానీ.. తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే అనసూయ అలాంటి పాత్రలు చేసుకుంటూ వస్తుంది. తాజాగా అనసూయ బోల్డ్ పాత్రలో (Bold Character) నటించిన చిత్రానికి సంబంధించిన లుక్ ఒకటి విడుదలైంది. జీవితంలో ఒక్కొక్క‌రికీ ఒక్కో క‌థ ఉంటుంది. ప్ర‌తీ క‌థ‌లోనూ హృద‌యాల‌ను క‌దిలించే భావోద్వేగం ఉంటుంది. అలాంటి సుమ‌తి (Sumathi) అనే ఓ ఎమోష‌న‌ల్ అండ్ బోల్డ్ క్యారెక్ట‌ర్‌లో ఈసారి అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌ మెప్పించ‌నుంది. ఆమె కీల‌క పాత్ర‌లో న‌టించిన ఎమోష‌న‌ల్ జ‌ర్నీ చిత్రం ‘విమానం’ (Vimanam). జూన్ 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి అనసూయ స్పెషల్ పోస్టర్‌ (Anasuya Special Poster)ని మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

సోమ‌వారం అన‌సూయ భ‌ర‌ద్వాజ్ పుట్టినరోజు. ఈ సంద‌ర్భంగా ‘విమానం’ మూవీ మేక‌ర్స్ సుమ‌తి పాత్ర‌కు సంబంధించి గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. అందులో ఆమె అందంగా రెడీ అవుతుంది. అస‌లు ఆమె అలా రెడీ కావ‌టానికి గల కార‌ణాలేంటి? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌. అయితే ఈ లుక్‌లో మాత్రం ఆమె మరోసారి రంగమ్మత్త (Rangammatta)నే తలపిస్తోంది. ఇందులో అనసూయ బోల్డ్‌గా నటిస్తుందనే విషయాన్ని మేకర్స్ తెలపడంతో పాటు.. ఇటీవల వచ్చిన టీజర్ కూడా ఆకట్టుకునేలా ఉండటంతో.. సినిమాపై సాధారణంగానే అంచనాలు పెరిగిపోతున్నాయి.

Anasuya-Pic.jpg

‘విమానం’ చిత్రంలో వీర‌య్య (Veerayya) అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్ర‌లో స‌ముద్రఖ‌ని (Samuthirakani), కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ (Master Dhruvan) న‌టిస్తుండగా.. సుమ‌తి పాత్ర‌లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌ (Anasuya Bharadwaj), రాజేంద్ర‌న్ పాత్ర‌లో రాజేంద్ర‌న్‌, డేనియ‌ల్ పాత్ర‌లో ధ‌న్‌రాజ్‌, కోటి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మెప్పించబోతున్నారు. అస‌లీ పాత్ర‌ల మ‌ధ్య ఉన్న రిలేష‌న్ ఏంట‌నేది జూన్ 9న రివీల్ అవుతుంది. కాగా.. శివ ప్రసాద్ యానాల (Siva Prasad Yanala) దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

************************************************

*Spy Teaser: ‘కార్తికేయ 2’ని మించి.. నిఖిల్ మరో సాహసం చేస్తున్నాడు

*AadiKeshava Glimpse: పంజా వైష్ణవ్ తేజ్ ఉగ్రరూపం

*Pic Talk: రారా కృష్ణయ్యా.. రారా కృష్ణయ్యా..

*Ram Charan: ముంబైలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏం చేశారంటే..

*Krithi Shetty: కాబోయేవాడు కాస్త బొద్దుగా ఉండాలి..

*Ustaad Bhagat Singh: బాబాయ్ మూవీ గ్లింప్స్‌పై అబ్బాయ్ రియాక్షన్ ఇదే..

*Bandla Ganesh: బానిసత్వానికి భాయ్ భాయ్.. మళ్లీ రాజకీయాల్లోకి వస్తా..

*Ileana: బంప్ అలెర్ట్.. అంటూ ఇలియానా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

Updated Date - 2023-05-15T19:13:01+05:30 IST