Namitha: అది మన సంస్కృతి కాదు. మనకంటూ ఒక సంస్కృతి ఉంది

ABN , First Publish Date - 2023-04-14T13:28:58+05:30 IST

తాజాగా నమిత BJP పార్టీని ట్యాగ్ చేస్తూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసింది.. అందులో ఏముందంటే..

Namitha: అది మన సంస్కృతి కాదు. మనకంటూ ఒక సంస్కృతి ఉంది
Actress Namitha

తన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు, రాష్ట్ర ప్రజలకు హీరోయిన్‌ నమిత (Heroine Namitha) ఒక సూచన చేశారు. ప్రతి యేటా జనవరి ఒకటో తేదీన ఆంగ్ల సంవత్సరాది జరుపుకోవడం మన సంస్కృతి (Culture) కాదన్నారు. ఏప్రిల్‌ 14వ తేదీన వచ్చే ‘తమిళ ఉగాది’ని సుఖ సంతోషాలతో ఆనందంగా జరుపుకోవడమే మన సంస్కృతి అని చెప్పారు. ఇదే విషయంపై ఆమె BJP పార్టీని ట్యాగ్ చేస్తూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో..

Read Also- Shaakuntalam film review: కాళిదాసు కవిత్వం కొంతయితే...

‘సాధారణంగా కొత్త సంవత్సరం రోజైన జనవరి ఒకటో తేదీన మన స్నేహితులతో బయటకు వెళ్లి న్యూ ఇయర్‌ సెలెబ్రేషన్స్‌ (New Year Celebrations) జరుపుకుంటాం. స్నేహితులతో కలిసి డ్యాన్సు‌లు వేస్తాం. కానీ, అది మన సంస్కృతి కాదు. మనకంటూ ఒక సంస్కృతి ఉంది. చిత్తిరై మాసం మొదటి రోజైన ఏప్రిల్‌ 14వ తేదీన మన ఉగాది. అదే మనకు కొత్త సంవత్సరాది (New Year). ఆ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. ఆలయాలకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఇష్టదైవాన్ని ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరికీ తమిళ నూతన ఉగాది శుభాకాంక్షలు (New Year Wishes)’’ అని అన్నారు.

Nami.jpg

కాగా, 2004లో విజయకాంత్‌ (Vijayakanth) నటించిన ‘ఎంగళ్‌ అన్నా’ (Engal Anna) మూవీ ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నమిత... విజయ్‌ (Vijay), అజిత్‌ (Ajith) వంటి అగ్రహీరోల చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. టాలీవుడ్‌లోనూ (Tollywood) నమిత స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. నటిగా ఆమెని తమిళ ప్రేక్షకులకే కాకుండా.. తెలుగు ప్రేక్షకులు (Telugu Audience) సైతం ఎంతో ఇష్టపడతారు. అయితే వివాహం తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన నమిత.. ప్రస్తుతం నటనకు స్వస్తి చెప్పి ఇంటిపట్టునే ఉంటున్నారు. త్వరలోనే రీ ఎంట్రీ అనేలా వార్తలు వైరల్ అవుతున్న నేపధ్యంలో.. పొలిటికల్‌గా ఆమె బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఆమె పోస్ట్ చూస్తుంటే తెలుస్తుంది.


ఇవి కూడా చదవండి:

*********************************

*Vijay Deverakonda: ‘శాకుంతలం’ విడుదల వేళ.. సమంతకు విజయ్ బూస్ట్

*KGF Actress: ‘కెజియఫ్‌’లో వణికించిన నటి.. ఇప్పుడు హాస్పిటల్‌లో ఉంది

*Shocking: యాంకర్ సుమ అరెస్ట్.. ఎందుకంటే?

*Brahmaji: ట్రైలర్ బాగుందా? అని అడిగిన సంయుక్తకు షాకింగ్ రిప్లయ్

*NTR 30: కొరటాల స్పీడ్ చూశారా.. అప్పుడే ఒకటి ఫినిష్..!

*Allu Arjun: సూపర్ హిట్ సినిమా మిస్సయిన అల్లు అర్జున్.. ఏ సినిమానో తెలిస్తే షాకవుతారు

*Direct OTT Release: ఈ వారం రెండు సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోకి..

Updated Date - 2023-04-14T13:29:00+05:30 IST