Vijay Deverakonda: ‘శాకుంతలం’ విడుదల వేళ.. సమంతకు విజయ్ బూస్ట్

ABN , First Publish Date - 2023-04-13T18:59:05+05:30 IST

సమంతకు ‘ఖుషి’ (Kushi) హీరో విజయ్ దేవరకొండ బూస్ట్ ఇచ్చేలా ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన సమంత ఎంతగానో మురిసిపోతూ..

Vijay Deverakonda: ‘శాకుంతలం’ విడుదల వేళ.. సమంతకు విజయ్ బూస్ట్
Vijay Deverakonda and Samantha

మరికొన్ని గంటల్లో ‘శాకుంతలం’ (Shaakuntalam) చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. మరోవైపు సమంత తన హెల్త్ బాగోనప్పటికీ.. ‘శాకుంతలం’ ప్రమోషన్స్, ‘ఖుషి’ (Kushi) సినిమా అలాగే ‘సిటాడెల్’ (Citadel) సిరీస్ కోసం షూటింగ్స్‌లో పాల్గొనడంతో మళ్లీ ఆమె పరిస్థితి మొదటికి వచ్చింది. తాజాగా ఆమె తనకు జ్వరమని, గొంతు కూడా సహకరించడం లేదని ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తను నటించిన పాన్ ఇండియా (Pan India) చిత్రం విడుదలవుతున్న సందర్భంగా తనకు ఇలా జరగడంతో.. సమంత చాలా బాధపడింది. అయినా కూడా సోషల్ మీడియా వేదికగా సినిమా కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ నేపధ్యంలో సమంతకు ‘ఖుషి’ (Kushi) హీరో విజయ్ దేవరకొండ బూస్ట్ ఇచ్చేలా ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన సమంత ఎంతగానో మురిసిపోతూ.. ‘థ్యాంక్యూ మై హీరో’ (Thank you my Hero) అంటూ ధన్యవాదాలు తెలిపింది.

‘‘సామీ.. నీవెప్పుడూ ప్రేమతో ఉంటావు, ఎప్పుడూ కరెక్ట్‌గా పని చేస్తుంటావు.. ఉత్సాహంగా ఉంటావు. నువ్వు చేసే సినిమాలలోని ప్రతి షాట్‌కి ఇప్పటికీ ది బెస్ట్ ఇస్తావు, అది నీ మొత్తం కెరీర్ డిసైడ్ చేస్తుంది. గత సంవత్సరకాలంగా నువ్వు జీవితంతో ఎంత ఫైట్ చేస్తున్నావో ప్రపంచానికి తెలియకపోవచ్చు, అయినా ఎప్పుడూ నవ్వుతూ, నీ ఫ్యాన్స్ కోసం, సినిమాల కోసం ఒక అడుగు ముందుకే వేస్తున్నావు. నీ శరీరం ఇంక ఆపేయమంటున్నా, విశ్రాంతి అవసరం అని చెబుతున్నా సరే ముందుకెళ్తూనే ఉన్నావ్. రేపు రిలీజ్ కాబోతున్న నీ ‘శాకుంతలం’ సినిమాకు మంచి విజయం సాధించాలని కోరుతూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. నీ పట్టుదల, నీ అభిమానుల ప్రేమ నిన్నెప్పుడూ క్షేమంగా ఉంచుతుంది. అంతా మంచే జరుగుతుంది. ప్రేమతో విజయ్” అని ఓ సందేశాన్ని ట్విట్టర్ వేదికగా విజయ్ దేవరకొండ సమంతకు పంపారు. (Vijay Deverakonda Message to Samantha)

విజయ్ దేవరకొండ సందేశం చూసిన సమంత (Samantha Reply)... ‘ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఈ సమయంలో నాకు కావాల్సింది ఇదే. థ్యాంక్యూ మై హీరో’ అని రిప్లయ్ ఇచ్చింది. ప్రస్తుతం వీరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు సమంత అభిమానులు థ్యాంక్స్ చెబుతున్నారు. కాగా వీరిద్దరూ కలిసి ‘ఖుషి’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ (Shiva Nirvana) ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.


ఇవి కూడా చదవండి:

*********************************

*KGF Actress: ‘కెజియఫ్‌’లో వణికించిన నటి.. ఇప్పుడు హాస్పిటల్‌లో ఉంది

*Shocking: యాంకర్ సుమ అరెస్ట్.. ఎందుకంటే?

*Brahmaji: ట్రైలర్ బాగుందా? అని అడిగిన సంయుక్తకు షాకింగ్ రిప్లయ్

*NTR 30: కొరటాల స్పీడ్ చూశారా.. అప్పుడే ఒకటి ఫినిష్..!

*Allu Arjun: సూపర్ హిట్ సినిమా మిస్సయిన అల్లు అర్జున్.. ఏ సినిమానో తెలిస్తే షాకవుతారు

*Direct OTT Release: ఈ వారం రెండు సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోకి..

Updated Date - 2023-04-13T18:59:06+05:30 IST