Aishwarya Rajinikanth: ఐశ్వర్య ఇంట్లో భారీ చోరీ.. లక్షలు విలువ చేసే ఆభరణాలు మాయం..

ABN , First Publish Date - 2023-03-20T13:10:50+05:30 IST

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Superstar Rajinikanth) కూతురు, ధనుష్‌ (Dhanush) మాజీ భార్య ఐశ్యర్య రజనీకాంత్‌ (Aishwarya Rajinikanth) ఇంట్లో భారీ దొంగతనం జరిగింది.

Aishwarya Rajinikanth: ఐశ్వర్య ఇంట్లో భారీ చోరీ.. లక్షలు విలువ చేసే ఆభరణాలు మాయం..
Aishwarya Rajinikanth

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Superstar Rajinikanth) కూతురు, ధనుష్‌ (Dhanush) మాజీ భార్య ఐశ్యర్య రజనీకాంత్‌ (Aishwarya Rajinikanth) ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. దీంతో తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ (police complaint) చేశారు. లక్షలు విలువ చేసే నగలు, వజ్రాలు దొంగతనం జరిగినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా.. తన దగ్గర పని చేస్తున్న ముగ్గురి పేరుని ఆ కంప్లైంట్‌లో పేర్కొన్నారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తేనాం పేట పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఐశ్వర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. డైమండ్‌ సెట్‌, ఆలయ అభరణాలలో అన్‌కట్‌ డైమండ్స్, నవరత్నం సెట్లు, పురాతన బంగారు ముక్కలు, వజ్రాలతో కూడిన రెండు నెక్‌ పీసెస్‌కి సరిపడే చెవిపోగులు, ఆరమ్ నెక్లెస్‌, 3.6 లక్షల విలువ చేసే సుమారు 60 సవర్ల బ్యాంగిల్స్ ఉన్నాయని ఫిర్యాదులో ఐశ్వర్య తెలిపారు. 2019లో తన సోదరి సౌందర్య రజనీకాంత్ పెళ్లిలో వాటిని చివరిసారిగా ధరించినట్లు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత లాకర్‌లో పెట్టి తాళం వేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఆ నగలను బయటికి తీయలేదని ఆమె పేర్కొన్నారు. అలాగే.. అప్పటి నుంచి మూడు సార్లు ఇళ్లు మారినప్పటికీ ఇంతవరకు ఆ లాకర్‌ని తెరవలేదని ఫిర్యాదులో ఆమె చెప్పుకొచ్చారు. అయితే.. లాకర్ ఎక్కడ ఉందనేది.. ఆ తాళాలు ఎక్కడ పెడతాననేది తన ముగ్గురి స్టాఫ్‌కి తెలుసని తెలిపారు. అందుకే వారిపై అనుమానంగా ఉందని పేర్కొన్నారు. (Aishwarya Rajinikanth files police complaint)

చివరిసారిగా సోదరి పెళ్లితో నగలు ధరించిన తర్వాత తన మాజీ భర్త అపార్ట్‌మెంట్‌, అనంతరం తను ప్రస్తుతం ఉంటున్నా అపార్టుమెంట్‌లో.. అనంతరం గతేడాది పోయెస్ గార్డెన్‌లోని తన తండ్రి ఇంట్లో భద్రపరిచగా.. అక్కడ అపహరణకు గురైనట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 381 కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా.. ఐశ్వర్య ప్రస్తుతం ‘లాల్ సలాం’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్నా ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. (Aishwarya Rajinikanth files police complaint)

ఇవి కూడా చదవండి:

Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

Kangana Ranaut - Elon Musk: నీ లైఫ్‌లో నాకంటే ఎక్కువ డ్రామా ఉంది.. ట్వీట్ వైరల్

Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

LEO: మళ్లీ కలుసుకుందాం.. సార్‌

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

Updated Date - 2023-03-20T13:10:51+05:30 IST