Aadujeevitham: ట్రైలర్ విడుదల వెనుక అసలు నిజాన్ని బయటపెట్టిన డైరెక్టర్

ABN , First Publish Date - 2023-04-10T20:21:08+05:30 IST

మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆడుజీవితం’ (Aadujeevitham). ఇంగ్లిష్‌లో ‘ది గోట్ లైఫ్’ (The Goat Life) టైటిల్‌తో విడుదల కానుంది. నేషనల్ అవార్డు విన్నర్ బ్లెస్సీ (Blessy) దర్శకత్వం వహించారు.

Aadujeevitham: ట్రైలర్ విడుదల వెనుక అసలు నిజాన్ని బయటపెట్టిన డైరెక్టర్

మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆడుజీవితం’ (Aadujeevitham). ఇంగ్లిష్‌లో ‘ది గోట్ లైఫ్’ (The Goat Life) టైటిల్‌తో విడుదల కానుంది. నేషనల్ అవార్డు విన్నర్ బ్లెస్సీ (Blessy) దర్శకత్వం వహించారు. ఈ సినిమా కోసం ఏకంగా దాదాపుగా 15ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ అకస్మాత్తుగా విడుదల చేశారు. అందుకు గల కారణాన్ని డైరెక్టర్ బ్లెస్సీ తాజాగా చెప్పారు.

‘‘ఆడుజీవితం సినిమాకు సంబంధించిన అనాధికారిక ట్రైలర్ రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో షికార్లు కొడుతుంది. ఓ వెబ్‌సైట్‌లో మూడు నిమిషాల ఫుటేజ్ మొదటిసారిగా అప్‌లోడ్ అయింది. ఆ వీడియోను ట్రైలర్ అనడానికి వీలు లేదు. ఆ వీడియోలో ఉపయోగించిన మ్యూజిక్ కీబోర్డ్‌పై కంపోజ్ చేశారు. కలర్ కరెక్షన్ చేయలేదు. వరల్డ్ రిలీజ్, బిజినెస్, ఫిల్మ్ ఫెస్టివల్స్ కోసం ఈ ట్రైలర్‌ను కట్ చేశాం. ట్రైలర్ లీక్ కావడం విచారకరం. ఇది అధికారిక ట్రైలర్ కాదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇటువంటి దశల్లో ట్రైలర్ లీక్ కావడం మానసికంగా వేదనను మిగిల్చింది. ట్రైలర్ వెనకున్న నిజాన్ని అందరికి తెలియజేయాలని ఈ విషయాన్ని చెబుతున్నాను’’ అని బ్లెస్సీ సోషల్ మీడియాలో తెలిపారు.

Aadujeevitham.jpg

ట్రైలర్ లీక్ కావడంతో పృథ్వీరాజ్ సుకుమారన్ అకస్మాత్తుగా అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘ఆడు జీవితం ట్రైలర్‌ను అనుకోకుండా విడుదల చేశాం. అంత మాత్రాన ఆన్‌లైన్‌లో లీక్ అయిందని భావించకండి. ఆడుజీవితం, ది గోట్‌లైఫ్‌ చిత్రీకరణ కొంత మాత్రమే మిగిలి ఉంది. మీరు వీక్షించిన ట్రైలర్ నచ్చిందని ఆశిస్తున్నాను’’ అని పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పారు. ‘ఆడుజీవితం’ అంతర్జాతీయ ప్రమణాలతో తెరకెక్కిందని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ఈ మూవీ 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Pawan Kalyan: పవర్ స్టార్ సినిమాకు సీక్వెల్!

Aadujeevitham: ఈ సినిమా కోసం చిరంజీవికి నో చెప్పిన పృథ్వీరాజ్ సుకుమారన్.. ట్రైలర్‌‌ను వీక్షించారా..?

Allu Arjun: ‘వేర్ ఈజ్ పుష్ప’ ప్రమోషన్ వీడియోకు భారీ ఖర్చు..?

Jr NTR: భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్న తారక్!

Chor Nikal Ke Bhaga: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును చెరిపేసిన బాలీవుడ్ సినిమా

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Updated Date - 2023-04-10T20:26:06+05:30 IST