Allu Arjun: ‘వేర్ ఈజ్ పుష్ప’ ప్రమోషన్ వీడియోకు భారీ ఖర్చు..?

ABN , First Publish Date - 2023-04-08T17:33:56+05:30 IST

కొత్త రకం సినిమాలు, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు అల్లు అర్జున్ (Allu Arjun). దేశమంతటా ఆయనకు అభిమానులున్నారు. బన్నీ తాజాగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2). ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Allu Arjun: ‘వేర్ ఈజ్ పుష్ప’ ప్రమోషన్ వీడియోకు భారీ ఖర్చు..?

కొత్త రకం సినిమాలు, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు అల్లు అర్జున్ (Allu Arjun). దేశమంతటా ఆయనకు అభిమానులున్నారు. బన్నీ తాజాగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2). ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని లెక్కల మాస్టారు సుకుమార్ (Sukumar) తెరకెక్కిస్తున్నారు. ఐకాన్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టారు. ‘వేర్ ఈజ్ పుష్ప’ (Where is Pushpa) పేరుతో కాన్సెఫ్ట్ వీడియోను విడుదల చేశారు. అన్ని భాషల్లోని ప్రేక్షకులకు అందుబాటులో ఉంచారు. ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్లింప్స్‌కు అన్ని భాషల్లో కలిపి 54మిలియన్స్‌కు పైగా వీక్షణలు, 2మిలియన్స్‌కు పైగా లైక్స్ వచ్చాయి. ‘వేర్ ఈజ్ పుష్ప’ ప్రమోషన్ వీడియో కోసం మేకర్స్ భారీ స్థాయిలో ఖర్చు చేశారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి.

‘పుష్ప 2’ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తే ఓటీటీ రైట్స్‌కు మంచి ధర వస్తుందని మేకర్స్ భావిస్తున్నారట. అందు కోసం ప్రమోషన్ వీడియోకు భారీ స్థాయిలో ఖర్చు పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్లింప్స్ కోసం నిర్మాణ సంస్థ దాదాపుగా రూ.4కోట్లను వెచ్చించిందని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ‘పుష్ప 2’ తో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) రికార్డులను తిరగరాయలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారట. అందు వల్లే ప్రచార కార్యక్రమాల కోసం పదుల కోట్లలోనే బడ్జెట్‌ను వెచ్చించనున్నారని టాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

Pushpa-2.jpg

బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘పుష్ప: ది రైజ్’ (Pushpa The Rise). మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది. ‘పుష్ప’ వరల్డ్ వైడ్‌గా రూ.300కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, రావు రమేష్, ధనంజయ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రెండో భాగంపై భారీ బజ్ ఉంది. అంచనాలకు తగ్గట్టుగానే ‘పుష్ప 2’ భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Jr NTR: భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్న తారక్!

Salman Khan: యంగ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్

Chor Nikal Ke Bhaga: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును చెరిపేసిన బాలీవుడ్ సినిమా

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Updated Date - 2023-04-08T19:30:32+05:30 IST