Pawan Kalyan: పవర్ స్టార్ సినిమాకు సీక్వెల్!

ABN , First Publish Date - 2023-04-10T14:07:40+05:30 IST

టాలీవుడ్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన సినిమా వకీల్ సాబ్ (Vakeel Saab). వేణు శ్రీరాం (Venu Sriram) దర్శకత్వం వహించారు. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

Pawan Kalyan: పవర్ స్టార్ సినిమాకు సీక్వెల్!

టాలీవుడ్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన సినిమా వకీల్ సాబ్ (Vakeel Saab). వేణు శ్రీరాం (Venu Sriram) దర్శకత్వం వహించారు. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ విడుదలై రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా పవర్ స్టార్ అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్‌ను వేణు చెప్పారు.

‘వకీల్ సాబ్’ విడుదలై ఏప్రిల్ 9కి రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా పవన్ అభిమానులు ట్విట్టర్ స్పేసెస్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో వేణు శ్రీరాం పాల్గొన్నారు. ‘వకీల్ సాబ్ 2’ (Vakeel Saab 2) కు సంబంధించిన పని జరుగుతుందన్నారు. ప్రస్తుతం స్క్రిఫ్ట్ దశలో ఉందని పేర్కొన్నారు. సెషన్‌లో భాగంగానే.. థియేటర్స్‌లో ‘వకీల్ సాబ్‌’ ని రీ రిలీజ్ చేస్తామన్నారు. అందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. హిందీ చిత్రం ‘పింక్’ (Pink) కు రీమేక్‌గా ‘వకీల్ సాబ్’ రూపొందింది. కోర్టు డ్రామాగా తెరకెక్కింది. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్, శ్రుతి హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘పింక్’ కు అనేక మార్పులు, చేర్పులు చేసి ‘వకీల్ సాబ్’ టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

Pawan-Kalyan.jpg

పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘వినోదాయ సీతం’ రీమేక్ షూటింగ్‌ను ఈ మధ్యనే పూర్తి చేశారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ను పట్టాలెక్కించారు. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో ఓ గ్యాంగ్ స్టర్ డ్రామాలో నటిస్తున్నారు. ‘హరి హర వీరమల్లు’ షూటింగ్‌‌ను 60శాతానికి పైగా పూర్తి చేశారు. పవన్ వరుస ప్రాజెక్టుల మధ్య ఫుల్ బిజీగా ఉండగా ‘వకీల్ సాబ్ 2’ ను ఎప్పుడు పట్టాలెక్కిస్తారో తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలి.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Aadujeevitham: ఈ సినిమా కోసం చిరంజీవికి నో చెప్పిన పృథ్వీరాజ్ సుకుమారన్.. ట్రైలర్‌‌ను వీక్షించారా..?

Allu Arjun: ‘వేర్ ఈజ్ పుష్ప’ ప్రమోషన్ వీడియోకు భారీ ఖర్చు..?

Jr NTR: భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్న తారక్!

Salman Khan: యంగ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్

Chor Nikal Ke Bhaga: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును చెరిపేసిన బాలీవుడ్ సినిమా

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Updated Date - 2023-04-10T14:10:45+05:30 IST