Chor Nikal Ke Bhaga: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును చెరిపేసిన బాలీవుడ్ సినిమా

ABN , First Publish Date - 2023-04-06T18:54:31+05:30 IST

కరోనా అనంతరం ప్రేక్షకుల అభిరుచుల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి.ఓటీటీలో సినిమాలు చూసే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో కంటెంట్‌ బాగుందని తెలిస్తే, సబ్‌టైటిల్స్‌లోను సినిమాను వీక్షిస్తున్నారు.

Chor Nikal Ke Bhaga: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును చెరిపేసిన బాలీవుడ్ సినిమా

కరోనా అనంతరం ప్రేక్షకుల అభిరుచుల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఓటీటీలో సినిమాలు చూసే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో కంటెంట్‌ బాగుందని తెలిస్తే, సబ్‌టైటిల్స్‌లోను సినిమాను వీక్షిస్తున్నారు. తాజాగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన ఓ థ్రిలింగ్ డ్రామా ఓటీటీలో రికార్డులను తిరగరాస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును కూడా బద్దలు కొట్టింది.

బాలీవుడ్ స్టార్స్ యామీ గౌతమ్ (Yami Gautam), సన్నీ కౌశల్ (Sunny Kaushal), శరద్ ఖేల్కర్ (Sharad Kelkar) కీలక పాత్రలు పోషించిన సినిమా ‘చోర్ నికల్ కే భాగా’ (Chor Nikal Ke Bhaga). నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా విడుదలైంది. మ్యాడ్‌డక్ ఫిలిమ్స్ నిర్మించింది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఓటీటీలో రికార్డు స్థాయి స్ట్రీమింగ్స్‌తో దూసుకుపోతుంది. ఈ మూవీ 61దేశాల్లో టాప్ 10లో ట్రెండ్ అవుతుంది. స్ట్రీమింగ్ ప్రారంభమైన రెండు వారాలకే ‘చోర్ నికల్ కే భాగా’ ను ప్రపంచవ్యాప్తంగా 29మిలియన్ అవర్స్ వీక్షించారని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. విడుదలైన రెండు వారాల్లోనే అత్యధికమంది వీక్షించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఈ రికార్డు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) పేరిట ఉండేది. ‘ఆర్ఆర్ఆర్’ కు రెండు వారాల్లో 25.5 మిలియన్‌ అవర్స్‌ స్ట్రీమింగ్స్ లభించాయి. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును ‘చోర్‌ నికల్‌ కే భాగా’ తాజాగా బద్దలు కొట్టింది. మూడో స్థానంలో ఆలియాభట్‌ నటించిన ‘గంగూబాయి కాతియావాడి’ (Gangubai Kathiawadi) ఉంది. ఈ మూవీకీ 22.1 మిలియన్‌ అవర్స్‌ వీక్షణలు ఉన్నాయి.

Yami-Gautam.jpg

వజ్రాల కుంభ కోణం, బీమా నేపథ్యంలో ‘చోర్ నికల్ కే భాగా’ రూపొందింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్ అయిన హైజాకింగ్‌కు కథలో చోటు కల్పించడంతో సినిమా మరింత ఆసక్తికరంగా మారింది. ఓటీటీలో చిత్రానికి అభిమనుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఫలితంగా సినిమా రికార్డు స్థాయి వీక్షణలను దక్కించుకుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Salman Khan: ఓటీటీలపై సంచలన వ్యాఖ్యలు

MM. Keeravani: బాలీవుడ్ సినిమాకు సంగీతం.. హీరో ఎవరంటే..?

Dasara: సీన్‌ను తొలగించాలని డిమాండ్.. థియేటర్స్ వద్ద ధర్నా..

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Updated Date - 2023-04-06T19:00:43+05:30 IST