Jr NTR: భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్న తారక్!

ABN , First Publish Date - 2023-04-07T18:17:35+05:30 IST

టాలీవుడ్‌లోని సూపర్ స్టార్స్‌లో జూనియర్ ఎన్‌టీఆర్ (Jr NTR) ఒకరు. తన నటన, వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘వార్ 2’ (War 2) లో హృతిక్ రోషన్‌తో కలసి నటించనున్నారు.

Jr NTR: భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్న తారక్!
Junior NTR in War 2

టాలీవుడ్‌లోని సూపర్ స్టార్స్‌లో జూనియర్ ఎన్‌టీఆర్ (Jr NTR) ఒకరు. తన నటన, వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘వార్ 2’ (War 2) లో హృతిక్ రోషన్‌తో కలసి నటించనున్నారు. ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. అయాన్ ముఖర్జీ (Ayan Mukherji) దర్శకత్వం వహించనున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ (RRR) తో జూనియర్ ఎన్టీఆర్ దేశ వ్యాప్తంగా ఫేమ్‌ను సంపాదించుకున్నారు. ప్రేక్షకులందరికి చేరువయ్యారు. ఫలితంగా తారక్ రెమ్యునరేషన్ అమాంతం పెరిగిపోయింది. మేకర్స్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.100కోట్లను చెల్లిస్తున్నారని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఫలితంగా దక్షిణాదిలో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ 5 నటుల్లో ఒకరిగా తారక్ చోటును సంపాదించుకున్నారు. ‘వార్ 2’ లో నటిస్తున్నందుకు రూ.30కోట్లను ఛార్జ్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అనేక మంది స్టార్స్ నటిస్తున్నారు. వారికి కూడా భారీగా పారితోషికం ఇవ్వాల్సి ఉండటంతో రూ.30కోట్లను మాత్రమే ఛార్జ్ చేశారని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి.

Tarak.jpg

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ వర్కింగ్ టైటిల్‌గా ‘ఎన్‌టీఆర్ 30’ (NTR 30) అని వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలసి నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాయి. ఈ మూవీలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే ఎన్‌టీఆర్ ‘వార్ 2’ ను పట్టాలెక్కిస్తాడని సమాచారం. అనంతరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాను చేయనున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Salman Khan: యంగ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్

Chor Nikal Ke Bhaga: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును చెరిపేసిన బాలీవుడ్ సినిమా

MM. Keeravani: బాలీవుడ్ సినిమాకు సంగీతం.. హీరో ఎవరంటే..?

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Updated Date - 2023-04-07T18:36:23+05:30 IST