సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sridevi Shoban Babu OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన బావామరదళ్లు.. ఎక్కడ చూడొచ్చంటే..

ABN, First Publish Date - 2023-03-30T09:31:35+05:30

యువ నటుడు సంతోష్ శోభన్ (Santhosh Shoban) వరుస సినిమా చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

OTT Release
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువ నటుడు సంతోష్ శోభన్ (Santhosh Shoban) వరుస సినిమా చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు. ఈ యంగ్ హీరో తాజాగా నటించిన చిత్రం ‘శ్రీదేవి శోభన్ బాబు’ (Sridevi Shobhan Babu). తమిళంలో ‘96’, తెలుగులో ‘జాను’ (Jaanu) మూవీలో చిన్నప్పటికీ జాను పాత్ర చేసిన గుర్తింపు పొందిన గౌరి కిషన్ (Gouri Kishan) హీరోయిన్‌గా నటించింది. ప్రశాంత్ కుమార్ దిమ్మల (Prashanth Dimmala) దర్శకత్వం వహించిన ఈ మూవీలో రోహిణి, నాగబాబు ముఖ్యపాత్రలు పోషించగా.. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుశ్మిత కొణిదల (Sushmitha Konidela) నిర్మించింది. (Megastar Chiranjeevi's daughter)

ఫిబ్రవరి 18న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే.. ఇటీవలికాలంలో థియేటర్స్‌లో అంతగా ఆకట్టుకోలేని సినిమాలు సైతం ఓటీటీల్లో మంచి వ్యూస్‌ని సాధిస్తున్నాయి. దీంతో థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని చూడటం మిస్సయిన ఎంతోమంది సినీ లవర్స్ ఓటీటీ విడుదల కోసం ఎదురూచూస్తున్నారు. ఈ తరుణంలోనే ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.

‘శ్రీదేవి శోభన్ బాబు’ ఓటీటీ రైట్స్‌ని ఇంతకుముందే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ఈ విషయం గురించి తెలుపుతూ.. మార్చి 30న స్ట్రీమింగ్ కానున్నట్లు ఈ ఓటీటీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. చెప్పినట్లుగానే శ్రీరామనవమి సందర్భంగా మార్చి 29 అర్థరాత్రి నుంచే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయడం ప్రారంభించింది.

కథేంటంటే..

శ్రీదేవి (గౌరి) హైదరాబాద్‌లో ఒక ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తుంటుంది. ఓ సారి ఫ్రెండ్స్‌తో కలిసి అరకు టూర్‌కి వెళతానని తండ్రి నాగబాబు (Nagababu)ని అడుగుతుంది. అయితే.. తండ్రి మాత్రం వద్దని అంటాడు. ఎందుకని శ్రీదేవి కారణం అడిగితే.. తనకి గతంలో జరిగిన అన్యాయం గురించి వివరిస్తాడు. దాంతో శోభన్ కుటుంబం మీద పగ తీర్చుకోడానికి శ్రీదేవి బయలుదేరుతుంది. ఈ క్రమంలో బావామరదళ్లైన హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ ఎలా చిగురించిందనేది ఈ చిత్ర కథాంశం. అయితే.. ఈ చిత్రం ఓటీటీలో కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని మూవీ టీం భావిస్తోంది. (Sridevi Shobhan Babu Story)

ఇవి కూడా చదవండి:

Taapsee Pannu: తాప్సీపై కేసు.. ఆ సమయంలో లక్ష్మీదేవి లాకెట్ ధరించడంతో..

Adipurush: రిలాక్స్ ప్రభాస్ ఫ్యాన్స్.. వాటిని నమ్మొద్దు.. దానికే ఫిక్సయిపోండి..

Shah Rukh Khan Vs Virat Kohli: సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..

Akanksha Dubey: యువ నటి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. అతను మోసం చేయడం వల్లేనంటూ..

Global Icon Allu Arjun: స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్‌ స్టార్‌గా.. 20 ఏళ్లలో ఎన్ని మార్పులు..

Nawazuddin Siddiqui: నటుడిపై సోదరుడి షాకింగ్ ఆరోపణలు.. ముగ్గురు భార్యలతో పాటు..

Akanksha Dubey: ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో లైవ్.. వెక్కి వెక్కి ఏడ్చిన నటి..

NTR: ఆ భావోద్వేగం కలిసొచ్చింది.. వారిద్దరూ కలిస్తే అంతేమరి..

Updated Date - 2023-03-30T09:33:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!