సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NTR: ఎన్టీఆర్ ‘శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం’ మూవీ గురించి ఈ విషయాలు తెలుసా?

ABN, First Publish Date - 2023-06-26T21:03:05+05:30

పురాణ పాత్రలను పోషించడంలో తన ప్రత్యేకతను చాటుకున్న నందమూరి తారకరామారావు కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి పాత్రను తొలిసారిగా పోషించిన చిత్రం ‘శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం’. 1957 డిసెంబర్‌ 5న వాహినీ స్టూడియోలో ప్రారంభమైన ‘శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం’ చిత్ర నిర్మాణం రెండేళ్ల పాటు జరిగింది. పది లక్షల రూపాయల వ్యయంతో తయారైంది. అన్నామలై, మామండూరు, ఊటీ, మద్రాసు, తిరుపతిలలో షూటింగ్‌ జరిగింది.

NT Ramarao in Sri Venkateswara Mahatyam
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పురాణ పాత్రలను పోషించడంలో తన ప్రత్యేకతను చాటుకున్న నందమూరి తారకరామారావు (NT Ramarao) కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి పాత్రను తొలిసారిగా పోషించిన చిత్రం ‘శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం’ (Sri Venkateswara Mahatyam). ఆరోజుల్లో ఈ సినిమాను ప్రదర్శించిన థియేటర్లు దేవాలయాలుగా మారిపోయాయంటే అతిశయోక్తి కాదు. ప్రతి థియేటర్‌లోనూ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ఉంచడంతో గుడికి వెళుతున్నంత భక్తిశ్రద్ధలతో థియేటర్లకు వెళ్లి జనం విరివిగా కానుకలు సమర్పించేవారు. తలనీలాలు సమర్పించిన సంఘటనలూ లేకపోలేదు.

ఇదే కథతో, టైటిల్‌తో 1939లో ఒక చిత్రాన్ని నిర్మించి విజయం సాధించిన పి.పుల్లయ్య (P. Pullaiah) మళ్లీ అదే సినిమా తీసి హిట్టు కొట్టడం విశేషం. (ముంబై ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఈ చిత్రం నెగెటివ్‌ కాలిపోవడం వల్ల ఈతరం ప్రేక్షకులకు తొలి ‘వేంకటేశ్వర మహత్మ్యం’ను చూసే అవకాశం లేదు). 1957 డిసెంబర్‌ 5న వాహినీ స్టూడియోలో ప్రారంభమైన ‘శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం’ చిత్ర నిర్మాణం రెండేళ్ల పాటు జరిగింది. పది లక్షల రూపాయల వ్యయంతో తయారైంది. అన్నామలై, మామండూరు, ఊటీ, మద్రాసు, తిరుపతిలలో షూటింగ్‌ జరిగింది.

కళాదర్శకుడు ఎస్‌.వి.ఎస్‌.రామారావు పర్యవేక్షణలో వాహినీ స్టూడియోలో తిరుమల ఆలయం సెట్‌ వేశారు. ఇందులో శ్రీవారికి నిత్యపూజలు జరిగేవి. ఈ సెట్‌లోనే చిత్రీకరించిన ‘శేష శైలా వాస శ్రీ వేంకటేశ’ పాటలో ప్రముఖ గాయకుడు ఘంటసాల (Ghantasala) నటించి, అభిమానులను పరవశింపచేశారు. స్వతహాగా వేంకటేశ్వర స్వామి భక్తుడైన ఘంటసాల ఈ పాటలో అలా నటించడం ఒక మహద్భాగ్యంగా భావించేవారు. షూటింగ్‌ పూర్తయిన కొన్ని నెలల వరకూ ఆలయం సెట్‌ను అలాగే ఉంచేశారు. ఆంధ్రదేశం నుండి షూటింగ్స్‌ చూడటానికి వాహినీ స్టూడియో (Vahini Studio)కు వచ్చే ప్రతిఒక్కరూ ఈ సెట్‌లోని శ్రీవారిని దర్శించి, అక్కడే ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు వేసేవారు. ఆ రకంగా పోగయిన రూ 46 వేలకు మరో నాలుగు వేలు జత చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి పుల్లయ్య పంపించి, ఆ డబ్బుతో భక్తులకు వసతి ఏర్పాట్లు కల్పించమని కోరారు.

1960 జనవరి 9న విడుదలైన ఈ చిత్రం 16 కేంద్రాలలో వంద రోజులు.. విజయవాడ, హైదరాబాద్‌లలో 25 వారాలు ఆడింది. ఇదే చిత్రాన్ని హిందీలో ‘భగవాన్‌ బాలాజీ’ (Bhagavan Balaji) పేరుతో, తమిళంలో ‘శ్రీనివాస కల్యాణం’ (Srinivas Kalyanam) పేరుతో పుల్లయ్య అనువదించారు. ఆ రెండు భాషలలోనూ ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఏడుకొండలవాడి మహత్యాన్ని వివరిస్తూ తెలుగులో చాలా సినిమాలు వచ్చినా వాటిల్లో అగ్రతాంబూలం ‘శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం’ చిత్రానిదే. ముచ్చటగా మూడవసారి ఈ కథను తీయాలని పుల్లయ్య ముచ్చటపడ్డారు కానీ ఆయన కోరిక నెరవేరలేదు. కాకపోతే తన సొంత బేనర్‌పై ఎన్టీఆర్‌ (NTR) ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం’ (Sri Tirupati Venkateswara Kalyanam) చిత్రాన్ని నిర్మించారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*KS Ramarao: ప్రేక్షకులు బాగుంది అని చెప్తే.. సినిమా సక్సెస్ అయినట్టే!


**************************************

*Varun Tej: మెగా ప్రిన్స్‌ నుంచి మరో అనౌన్స్‌మెంట్ రాబోతోంది


**************************************

* Prithviraj Sukumaran: షూటింగ్‌లో ప్రమాదం.. పృథ్వీరాజ్ సుకుమారన్‌కు గాయాలు


**************************************

*Ashu Reddy: టైమ్ వచ్చినప్పుడు అందరి జాతకాలు బయటపెడతా..!


**************************************

*Sobhita Dhulipala: కాబోయేవాడు అలా ఉండాలంటూనే.. చైతూ లక్షణాలకు మ్యాచ్ చేస్తోంది


**************************************

*Bholaa Shankar Teaser Talk: మెగాస్టార్‌.. మాస్ అరాచకం!


**************************************

Updated Date - 2023-06-26T21:03:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!