Sobhita Dhulipala: కాబోయేవాడు అలా ఉండాలంటూనే.. చైతూ లక్షణాలకు మ్యాచ్ చేస్తోంది

ABN , First Publish Date - 2023-06-24T20:54:32+05:30 IST

శోభిత నటించిన ‘ది నైట్ మేనేజర్ 2’ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో జూన్ 30 నుండి స్ట్రీమ్ కాబోతోంది. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో.. తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలను గురించి చెప్పుకొచ్చింది. అలాగే చైతూ ఎలాంటి వాడో కూడా ఆమె తెలిపింది. ఆమె కోరుకున్న లక్షణాలు, చైతూ గురించి చెప్పిన లక్షణాలు దగ్గరగా ఉండటంతో.. మళ్లీ వారిద్దరి బంధం వార్తలు వైరల్ అవుతున్నాయి.

Sobhita Dhulipala: కాబోయేవాడు అలా ఉండాలంటూనే.. చైతూ లక్షణాలకు మ్యాచ్ చేస్తోంది

తెలుగులో సినిమాలు చేసినా.. నాగ చైతన్యతో డేటింగ్ చేస్తుందనే వార్తలతో టాలీవుడ్‌ (Tollywood)లోనూ, మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (PS) చిత్రంలో వానతి పాత్రలో నటించి కోలీవుడ్‌ (Kollywood)‌లోనూ క్రేజ్ సంపాదించుకున్న తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala). తాజాగా ఈ భామ తనకు కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు, గుణగణాలు ఉండాలో చెప్పుకొచ్చింది. తనకి కాబోయే వాడు మంచి మనసున్న వాడై ఉండాలని కోరుకుంటోంది.

ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ... ‘‘జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి. సింప్లిసిటీ, మంచి మనసు, ఇతరుల పట్ల దయ, కరుణ చూపించాలి. ఈ జీవితం చాలా చిన్నదన్న విషయాన్ని గుర్తించి, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి’’ అని చెబుతూనే.. ‘నా వ్యక్తిగత జీవితంపై మాట్లాడటం మాని నా నటన, నా పనితీరు గురించి మాట్లాడితే సంతోషిస్తా. నేను వైజాగ్‌ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. ఈ స్థాయికి చేరుకునేందుకు ప్రతి దశలోనూ ఎంతో కష్టపడ్డా’ అని తనపై విమర్శలు చేసే వారికి కౌంటర్‌ ఇచ్చింది శోభిత.

sobhitadhulipalanew3.jpg

ఇక నాగ చైతన్య (Naga Chaitanya) గురించి మాట్లాడుతూ.. చైతూ చాలా మర్యాదస్తుడు. హుందాగా ఉంటాడు. ఎప్పుడూ ప్రశాంతంగా, కూల్‌గా ఉంటాడు. అతనిలో నాకు నచ్చింది అదే అని చెప్పుకొచ్చింది. అతనిలోని లక్షణాలు.. ఆమె కోరుకుంటున్న లక్షణాలకి చాలా దగ్గరగా ఉన్నాయంటూ.. కచ్చితంగా వారిద్దరి మధ్య ఏదో మ్యాటర్ ఉందనేలా సోషల్ మీడియాలో టాక్ రన్ అవుతూనే ఉంది. ప్రస్తుతం శోభిత నటించిన ‘ది నైట్ మేనేజర్ 2’ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో జూన్ 30 నుండి స్ట్రీమ్ కాబోతోంది. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఆమె ఈ విషయాలను చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Bholaa Shankar Teaser Talk: మెగాస్టార్‌.. మాస్ అరాచకం!


**************************************

*Anand Sai and Vasuki: ‘తొలిప్రేమ’ రీ రిలీజ్‌పై ఈ దంపతులు ఏమన్నారంటే..


**************************************

*Megastar Chiranjeevi: మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మెగాస్టార్


**************************************

*KP Chowdary: ‘కబాలి’ నిర్మాత కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. చిక్కుల్లో అషు రెడ్డి

**************************************

*BoyapatiRAPO: మరింత దగ్గరకి మాస్ బీభత్సం.. ఈ మధ్య కాలంలో ఇలాంటి అనౌన్స్‌మెంట్ అయితే రాలే..


**************************************

Updated Date - 2023-06-24T20:55:14+05:30 IST