Bholaa Shankar Teaser Talk: మెగాస్టార్‌.. మాస్ అరాచకం!

ABN , First Publish Date - 2023-06-24T18:56:53+05:30 IST

‘షికారుకొచ్చిన షేర్‌ని బే’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ టీజర్‌తో సందడి చేయడానికి వచ్చేశారు. ఆయన హీరోగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భోళా శంకర్’. ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా వదిలిన ఈ టీజర్ ‘మెగాస్టార్ మాస్ అరాచకం’ అనేలా దూసుకెళుతోంది.

Bholaa Shankar Teaser Talk: మెగాస్టార్‌.. మాస్ అరాచకం!

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మెహర్ రమేష్ (Meher Ramesh) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భోళా శంకర్’ (Bholaa Shankar). చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. మెగాస్టార్ సోదరిగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ కనిపించనుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన అప్‌డేట్స్ సినిమాపై ఎటువంటి క్రేజ్‌ని పెంచాయో తెలిసిందే. ఇప్పుడా క్రేజ్‌ని డబుల్ చేసేలా.. తాజాగా మేకర్స్ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. సంక్రాంతికి వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ తరహాలోనే మెగాస్టార్ ఫ్యాన్స్‌కి కావాల్సిన మాస్ అంశాలను పుష్కలంగా ఇందులో జోడించారనేది ఈ టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మరోసారి ‘మెగాస్టార్.. మాస్ అరాచకం’ ఏంటో ఈ టీజర్ తెలియజేస్తోంది.

టీజర్ విషయానికి వస్తే.. (Bholaa Shankar Teaser Talk)

మొత్తం 33మందిని చంపేశాడు.. 33 మందిని ఒక్కడా..! ఏక్ ఆద్మీ.. హౌ.

ఎవడ్రా నువ్వు.. అని ఓ రౌడీ అనగానే.. ‘షికారుకొచ్చిన షేర్‌ని బే’ అంటూ మెగాస్టార్ మాస్ ఎంట్రీ టీజర్‌కే హైలెట్ అనేలా ఉంది. అలాగే టీజర్ చివరిలో.. ఏయ్ భోళా.. ఇది నా ఏరియా అని విలన్ అనగా.. ‘ఈ స్టేట్ డివైడ్ అయినా.. అందరు నా వాళ్లే, ఆల్ ఏరియాస్ నావే.. నాకు హద్దుల్లేవ్.. సరిహద్దుల్లేవ్.. 11 ఆగస్ట్ చూసుకుందాం’ అని మెగాస్టార్ చెప్పే మాసీ డైలాగ్‌తో టీజర్‌ని ముగించారు. మధ్యలో కీర్తి సురేష్, సుశాంత్‌లను కూడా చూపించారు. మెగాస్టార్ లుక్, స్వాగ్ అండ్ స్టైల్.. యాక్షన్ ఎపిసోడ్స్, బీజీఎమ్.. మొత్తం కలిసి.. బాక్సాఫీస్ షేక్ చేయడానికి భోళా వచ్చేస్తున్నాడనేలా ఈ టీజర్‌తో మేకర్స్ అంచనాలను పెంచేశారు. (Bholaa Shankar Teaser Out)

Mega-Star-Chiru.jpg

యాక్షన్‌తో మెగాస్టార్ ఎంట్రీ, ‘శంకర్‌దాదా MBBS’ తరహాలో చిరు చెప్పే డైలాగ్స్.. తమన్నా, కీర్తిసురేష్‌, సుశాంత్‌ల లుక్‌ని రివీల్ చేసిన తీరు.. యాక్షన్ ఎపిసోడ్స్, బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే సాంగ్.. ఇలా టీజర్‌కి కావాల్సిన సరుకుని మెహర్ రమేష్ చక్కగా సమకూర్చారు. బాక్సాఫీస్ వద్ద మరోసారి బాస్ శివతాండవం ఆడేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఈ టీజర్‌తో క్లారిటీ ఇచ్చేశారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మెగాస్టార్ సినిమాకి ఫస్ట్ టైమ్ మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.


ఇవి కూడా చదవండి:

**************************************

*Anand Sai and Vasuki: ‘తొలిప్రేమ’ రీ రిలీజ్‌పై ఈ దంపతులు ఏమన్నారంటే..


**************************************

*Megastar Chiranjeevi: మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మెగాస్టార్


**************************************

*KP Chowdary: ‘కబాలి’ నిర్మాత కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. చిక్కుల్లో అషు రెడ్డి

**************************************

*BoyapatiRAPO: మరింత దగ్గరకి మాస్ బీభత్సం.. ఈ మధ్య కాలంలో ఇలాంటి అనౌన్స్‌మెంట్ అయితే రాలే..


**************************************

*Sreeleela: దేవాలయం కంటే గొప్పది.. ఆ విషయం బాలయ్యకి కూడా తెలియదు.


**************************************

*Spy Trailer Talk: స్వాతంత్య్రం అంటే ఒకడు ఇచ్చేది కాదు, లాక్కునేది. ఇదెవరు చెప్పారో తెలుసా?


**************************************

Updated Date - 2023-06-24T18:58:24+05:30 IST