Varun Tej: మెగా ప్రిన్స్‌ నుంచి మరో అనౌన్స్‌మెంట్ రాబోతోంది

ABN , First Publish Date - 2023-06-26T19:18:06+05:30 IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి మరో అనౌన్స్‌మెంట్ రాబోతోంది. రీసెంట్‌గా లావణ్య త్రిపాఠితో ఎంగేజ్‌మెంట్ పూర్తి చేసుకున్న వరుణ్ తేజ్.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. అలాగే ఇప్పుడాయన హీరోగా నటిస్తోన్న VT13 చిత్రానికి ఓ పవర్‌ఫుల్ టైటిల్‌ని మేకర్స్ ఫిక్స్ చేశారట. త్వరలోనే ఆ టైటిల్‌ని ప్రకటిస్తామని మేకర్స్ తెలియజేశారు.

Varun Tej: మెగా ప్రిన్స్‌ నుంచి మరో అనౌన్స్‌మెంట్ రాబోతోంది
Mega Prince Varun Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince) నుంచి మరో అనౌన్స్‌మెంట్ రాబోతోంది. అయితే ఇది తన పెళ్లికి సంబంధించినది కాదు.. రీసెంట్‌గా ఆయన పెళ్లికి సంబంధించి హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)తో నిశ్చితార్థం (Engagement) పూర్తయిన విషయం తెలిసిందే. నిశ్చితార్థం అయితే అయింది కానీ.. పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం ఇంతవరకు బయటికి రాలేదు. ఇంకా పెళ్లి డేట్ పెట్టుకోలేదని అంటున్నారు. ఆ విషయం అటుంచితే.. ఆయన హీరోగా చేస్తున్న మరో సినిమాకు సంబంధించిన టైటిల్ ప్రకటన అతి త్వరలో రాబోతోంది. వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా (Shakti Pratap Singh Hada) దర్శకత్వంలో రూపొందుతున్న #VT13 చిత్ర టైటిల్‌లో అతి త్వరలో ప్రకటించబోతున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. రినైసన్స్ పిక్చర్స్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

వాస్తవ సంఘటనల స్పూర్తితో ఇండియన్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ చిత్రంగా తెలుగు-హిందీ ద్విభాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్‌ IAF అధికారిగా కనిపించనున్నారు. ప్రేక్షకులు లార్జర్ దేన్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌ని పొందేలా.. మేకర్స్ అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా చెబుతున్నారు. బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించం కోసం మేకర్స్ భారీ సెట్‌ను రూపొందించారు. మునుపెన్నడూ చూడని ఈ యాక్షన్ కోసం వరుణ్ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించగా, మేకర్స్ నుండి మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది. (VT13 Movie Title)

Varun-Tej-1.jpg

దేశం ఇప్పటివరకు చూడని అతిపెద్ద, భయంకరమైన వైమానిక దాడులలో పోరాడిన మన హీరోల పోరాట స్ఫూర్తికి తగిన పవర్ ఫుల్ టైటిల్‌ని ఈ సినిమాకు మేకర్స్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. దేశభక్తి, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్‌టైనర్‌తో కూడిన ఈ చిత్ర టైటిల్‌ను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ (Former Miss Universe Manushi Chhillar) ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ ఈ సినిమాకు రచయితలు. ఈ సినిమా కాకుండా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేస్తున్న చిత్రానికి ‘గాంఢీవధారి అర్జున’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

**************************************

* Prithviraj Sukumaran: షూటింగ్‌లో ప్రమాదం.. పృథ్వీరాజ్ సుకుమారన్‌కు గాయాలు


**************************************

*Ashu Reddy: టైమ్ వచ్చినప్పుడు అందరి జాతకాలు బయటపెడతా..!


**************************************

*Sobhita Dhulipala: కాబోయేవాడు అలా ఉండాలంటూనే.. చైతూ లక్షణాలకు మ్యాచ్ చేస్తోంది


**************************************

*Bholaa Shankar Teaser Talk: మెగాస్టార్‌.. మాస్ అరాచకం!


**************************************

*Anand Sai and Vasuki: ‘తొలిప్రేమ’ రీ రిలీజ్‌పై ఈ దంపతులు ఏమన్నారంటే..


**************************************

Updated Date - 2023-06-26T19:18:06+05:30 IST