Prithviraj Sukumaran: షూటింగ్‌లో ప్రమాదం.. పృథ్వీరాజ్ సుకుమారన్‌కు గాయాలు

ABN , First Publish Date - 2023-06-26T16:47:03+05:30 IST

మలయాళ నటుడు, దర్శకుడైన పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తోన్న తాజా చిత్రం ‘విలయత్ బుద్ధ’. ఈ సినిమా షూటింగ్‌లో ప్రమాదం సంభవించడంతో పృథ్వీరాజ్‌కు గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కాలికి గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. డాక్టర్స్ ఆయన కాలికి కీహోల్ శస్త్రచికిత్స చేయనున్నట్టు సమాచారం.

Prithviraj Sukumaran: షూటింగ్‌లో ప్రమాదం.. పృథ్వీరాజ్ సుకుమారన్‌కు గాయాలు
Prithviraj Sukumaran

మలయాళ నటుడు, దర్శకుడైన పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నటిస్తోన్న తాజా చిత్రం ‘విలయత్ బుద్ధ’ (Vilayath Buddha). ఈ సినిమా షూటింగ్‌లో ప్రమాదం సంభవించడంతో పృథ్వీరాజ్‌కు గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో.. పృథ్వీరాజ్ కాలికి గాయం కావడంతో వెంటనే ఆయనని కొచ్చిన్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్స్ ఆయన కాలికి కీహోల్ శస్త్రచికిత్స చేయనున్నట్టు సమాచారం. అలాగే కొన్ని వారాల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ సూచించారని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. (Prithviraj Sukumaran Injured)

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌కు యాక్సిడెంట్ అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ నటుడిగా, దర్శకుడిగా ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే. ఆయన హీరోగా చేసిన సినిమాలు, డైరెక్ట్ చేసిన సినిమాలను ఇతర భాషల్లో రీమేక్స్ చేస్తున్నారు. టాలీవుడ్‌లోనూ పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు ఈ మధ్య మారుమోగుతోంది. అందుకు కారణం ప్రభాస్ (Prabhas), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘సలార్’ (Saalar) చిత్రమే.

Saalar.jpg

‘సలార్’ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుపుతూ విడుదల చేసిన ఫస్ట్ లుక్‌ కూడా మంచి స్పందనను రాబట్టుకుంది. ఇప్పుడాయనకి ప్రమాదం సంభవించడంతో.. ‘సలార్’ టీమ్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే.. ఈ సినిమాకు సంబంధించి ఆయనపై కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించాల్సి ఉందట. ‘సలార్’ కాకుండా.. ‘ఆడుజీవితం, బడే మియాన్ చోటే మియాన్’ వంటి చిత్రాలతో పృథ్వీరాజ్ సుకుమారన్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ‘విలయత్ బుద్ధ’ చిత్రానికి జయన్ నంబియార్ (Jayan Nambiar) దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Ashu Reddy: టైమ్ వచ్చినప్పుడు అందరి జాతకాలు బయటపెడతా..!


**************************************

*Sobhita Dhulipala: కాబోయేవాడు అలా ఉండాలంటూనే.. చైతూ లక్షణాలకు మ్యాచ్ చేస్తోంది


**************************************

*Bholaa Shankar Teaser Talk: మెగాస్టార్‌.. మాస్ అరాచకం!


**************************************

*Anand Sai and Vasuki: ‘తొలిప్రేమ’ రీ రిలీజ్‌పై ఈ దంపతులు ఏమన్నారంటే..


**************************************

Updated Date - 2023-06-26T16:47:03+05:30 IST