KS Ramarao: ప్రేక్షకులు బాగుంది అని చెప్తే.. సినిమా సక్సెస్ అయినట్టే!

ABN , First Publish Date - 2023-06-26T20:11:32+05:30 IST

ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన చిత్రం ‘ఓ సాథియా’. ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్మాత కె.ఎస్. రామారావు విడుదల చేసి చిత్రయూనిట్‌కు ఆశీస్సులు అందించారు. తన్వికా–జశ్వికా క్రియేషన్స్‌ పతాకంపై దివ్య భావన దర్శకత్వంలో చందన కట్టా, సుభాష్‌ కట్టా ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 7న పాన్‌ ఇండియా లెవెల్‌లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

KS Ramarao: ప్రేక్షకులు బాగుంది అని చెప్తే.. సినిమా సక్సెస్ అయినట్టే!
Producer KS Ramarao

నేను కూడా సినిమా కెరీర్‌లో చాలా కష్టపడ్డాను.. ప్రేక్షకులు బాగుంది అని చెప్తే సినిమా సక్సెస్ అయినట్టేనని అన్నారు నిర్మాత కె.ఎస్. రామారావు (KS Ramarao). ఆర్యన్‌గౌరా (Aryan Gowra), మిస్టీ చక్రవర్తి (Mishti Chakravarty) జంటగా నటించిన చిత్రం ‘ఓ సాథియా’ (O Saathiya). ప్రేమ కథల్లో కొత్త కోణం తీసుకొని నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సరికొత్త ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కింది. తన్వికా–జశ్వికా క్రియేషన్స్‌ పతాకంపై దివ్య భావన (Divya Bhavna) దర్శకత్వంలో చందన కట్టా, సుభాష్‌ కట్టా (Chandana Katta and Subhash Katta) నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 7న పాన్‌ ఇండియా లెవెల్‌లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని నిర్మాత కె.ఎస్. రామారావు చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

ట్రైలర్ విడుదల అనంతరం నిర్మాత KS రామారావు మాట్లాడుతూ.. ఇవాళ ఒక చిన్న సినిమాని తీసి, రిలీజ్ అవ్వడం మాములు విషయం కాదు. ఎన్టీఆర్‌గారు కూడా కష్టపడి పైకి వచ్చారు. కష్టపడాలి అప్పుడే పైకి వస్తాం. ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు తీయాలి. ఈ సినిమాని ఇంటర్నేషనల్ సంస్థ UFO రిలీజ్ చేయడం చాలా మంచి విషయం. UFO లాంటి సంస్థ ఈ సినిమాని రిలీజ్ చేయడం ఈ సినిమా వాళ్ళ అదృష్టం. నేను కూడా సినిమా కెరీర్‌లో చాలా కష్టపడ్డాను. ప్రేక్షకులు బాగుంది అని చెప్తే సినిమా సక్సెస్ అయినట్టే. ప్రతి నిర్మాతకు ఒక స్ట్రగుల్ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది, ఒక సక్సెస్ ఉంటుంది. నా బర్త్‌డే జులై 7. ఆ రోజే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. కచ్చితంగా హిట్ అవుతుందీ సినిమా. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.

డైరెక్టర్ త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) మాట్లాడుతూ.. అమ్మ, నాన్న, ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్, ఫస్ట్ లవ్ అందరికీ ఇష్టం. హీరో తన గురించి చెప్తుంటే నా మొదటి సినిమా కష్టాలు గుర్తొచ్చాయి. అందరికి ఆ కష్టాలు ఉంటాయి. ఈ సినిమాకి నిర్మాత, డైరెక్టర్ ఇద్దరూ లేడీస్ కావడం చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, నిర్మాతకు ఒక ఇంటికి ఇంకో ఇల్లు రావాలని కోరుకుంటున్నాను. టైటిల్ సాంగ్ చాలా బాగుంది. ఈ సినిమా చూస్తే నిజంగానే ఫస్ట్ లవ్ గుర్తుకురావాలని కోరుకుంటున్నాను. అందరికి ఆల్ ది బెస్ట్ అని తెలిపారు.

KSR.jpg

చిత్ర హీరో ఆర్యన్ (Aryan Gowra) మాట్లాడుతూ.. విజయవాడ కృష్ణలంకలో చిన్నప్పటి నుంచి కన్న కల హీరో అవ్వాలని. ఆ కల నేడు నన్ను ఇప్పుడు ఇక్కడ నిలబెట్టింది. ఈ సినిమాకు అన్ని క్రాఫ్ట్స్‌లో కనీసం ఓ 150 మంది పనిచేసి ఉంటారు. వాళ్లందరికీ ఓ ఆరు నెలల పాటు నేను ఎంప్లాయిమెంట్ ఇచ్చాను. నేను కన్న కల వల్లే ఇవ్వగలిగాను అని గర్వంగా ఉంది. ఇండస్ట్రీకి వచ్చి 9 ఏళ్ళు అయింది. అవకాశాల కోసం తిరిగాను. నేను ఫేస్ చేసిన కొన్ని పరిస్థితులతో బాధపడి నేను నా సొంతంగా హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యాను. అన్ని క్రాఫ్ట్స్ నేర్చుకొని లాక్ డౌన్‌లో హీరోగా, డైరెక్టర్‌గా సినిమా తీశాను. నా మొదటి సినిమా బడ్జెట్ 40 లక్షలు, హిట్ చేసి నిర్మాతకు డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ 6 కోట్లు. ఈ జర్నీ కొంచెం సక్సెస్ అయినట్టే కదా. నైట్ జాబ్ చేసుకుంటూ పొద్దున సినిమా చేసుకుంటూ చాలా కష్టపడ్డాను. ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి వాళ్ళు పెట్టే డబ్బులకు న్యాయం చేయాలని కష్టపడ్డాను. నిర్మాత గారికి కథ చెప్పినప్పుడు ఇల్లు కట్టుకోవడానికి దాచుకున్న డబ్బులు నన్ను నమ్మి ఈ సినిమాపై పెట్టారు. ఆయన కోసం ఈ సినిమా హిట్ అవ్వాలి. ఆడియన్స్ థియేటర్‌కి వచ్చి జులై 7న సినిమా చూడండి. మొదటి రోజు థియేటర్ కి వచ్చి చూడండి. సినిమా చూసి వెళ్ళేటప్పుడు ఒక మంచి చిరునవ్వుతో వెళ్తారు. నాకు సపోర్ట్ చేసిన వాళ్లందరికీ చాలా థ్యాంక్స్.. అని ఎమోషనల్‌గా మాట్లాడారు. ఇంకా హీరోయిన్, చిత్ర నిర్మాతలు, చిత్రాన్ని విడుదల చేస్తున్న UFO వారు, దర్శకురాలు, ఇతర అతిథులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. (O Saathiya Trailer Launch)

ఇవి కూడా చదవండి:

**************************************

*Varun Tej: మెగా ప్రిన్స్‌ నుంచి మరో అనౌన్స్‌మెంట్ రాబోతోంది


**************************************

* Prithviraj Sukumaran: షూటింగ్‌లో ప్రమాదం.. పృథ్వీరాజ్ సుకుమారన్‌కు గాయాలు


**************************************

*Ashu Reddy: టైమ్ వచ్చినప్పుడు అందరి జాతకాలు బయటపెడతా..!


**************************************

*Sobhita Dhulipala: కాబోయేవాడు అలా ఉండాలంటూనే.. చైతూ లక్షణాలకు మ్యాచ్ చేస్తోంది


**************************************

*Bholaa Shankar Teaser Talk: మెగాస్టార్‌.. మాస్ అరాచకం!


**************************************

Updated Date - 2023-06-26T20:13:22+05:30 IST