Naga Chaitanya: నాగచైతన్య కేక్ కట్ చేయిస్తున్న ఈ బాబు ఎవరు?

ABN , First Publish Date - 2023-03-24T20:27:46+05:30 IST

యువసామ్రాట్ నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కస్టడీ’ (Custody). ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం

Naga Chaitanya: నాగచైతన్య కేక్ కట్ చేయిస్తున్న ఈ బాబు ఎవరు?
Naga Chaitanya at Birthday Party

యువసామ్రాట్ నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కస్టడీ’ (Custody). ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ (Post Production) కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా నాగచైతన్య ఓ బర్త్‌డే వేడుకలో సందడి చేశారు. ఈ వేడుకలో బాబుతో దగ్గరుండి మరీ నాగచైతన్య కేక్ కట్ చేయిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరీ బాబు అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలలోకి వెళితే..

టెలికాం ఇండస్ట్రీయలిస్ట్ శ్రీధర్ రావు (Sridhar Rao) కుమారుడే ఈ బాబు అని తెలిసింది. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 49‌లోని అభిశ్రీ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన ఉగాది సంబరాలకు నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉగాది సంబరాలతో పాటు శ్రీధర్ రావు కుమారుడు అభి శ్రీ సత్యం (Abhi Sri Satyam) పుట్టినరోజు కూడా అదే రోజు కావడంతో.. సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌కు నాగ చైతన్య‌తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ (Anup Rubens), తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud), టూరిజం చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, ఎమ్మెల్సీ రమణ, మాజీ యం.పి అంజన్ కుమార్, పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బిగ్ బాస్ ఫేమ్ అషూ రెడ్డి (Ashu Reddy), హిమజ (Himaja)తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Sridhar-Rao.jpg

ఈ వేడుకలో అక్కినేని హీరో నాగ చైతన్య అభి శ్రీ సత్యంతో కేక్ కట్ చేయించి, అభినందించారు. ఇక గ్రామీణ వాతావరణాన్ని తలపించే విధంగా ఏర్పాటు చేసిన సంప్రదాయ ఎడ్ల బండి, గ్రామీణంగా కనిపించే ఇళ్లు, చేద బావి.. వంటి దృశ్యాలు ఈ వేడుకలో అందరినీ కనువిందు చేశారు. కాగా.. నాగచైతన్య, వెంకట్ ప్రభు (Venkat Prabhu) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘కస్టడీ’ చిత్రం 12 మే, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇది కాకుండా ‘దూత’ (Dootha) అనే వెబ్ సిరీస్‌లో కూడా ఆయన నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Naresh and Pavitra Marriage: నరేష్, పవిత్రల పెళ్లి.. అసలు కథ ఇదేనా?

*Srikanth: ఆ రూమర్స్ భరించలేకే.. భార్యతో కలిసి వెళుతున్నా..

*Brahmanandam: నాకు మోక్షం వద్దు.. మళ్లీ మళ్లీ జన్మించాలనే కోరుకుంటా!

*Trivikram Srinivas: ఆయన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి.. ఈ పాత్రను పోషిస్తున్నారు

*NTR30: ఈ టెక్నీషియన్స్ మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు

*Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?

*Rangamarthanda: బ్రహ్మీ నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ఫిదా!.. ఇద్దరూ కలిసి ఏం చేశారంటే?

*Das Ka Dhamki: ఇదేందయ్యా ఇది.. ‘ధమ్కీ’నా? ‘ధమాకా’నా?

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-24T20:27:48+05:30 IST