Vishwak Sen: తారక్ అన్న మెసేజ్ చూసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి

ABN , First Publish Date - 2023-03-18T18:44:05+05:30 IST

ఎన్టీఆర్‌ అన్న ఇక్కడికి వచ్చింది నా ఒక్కడి కోసం కాదు. ఆయన అభిమానికి ఇచ్చిన మాట కోసం.. సరిగ్గా నిద్రలేకపోయినా సరే వచ్చారు. ఆయన చేసింది నా ఒక్కడి కోసం కాదు..

Vishwak Sen: తారక్ అన్న మెసేజ్ చూసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి
Jr NTR And Vishwak Sen

హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) తొలి పాన్ ఇండియా (Pan India) చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki). విశ్వక్ సేన్ ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత కూడా. విశ్వక్‌కు జోడీగా నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) నటించింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, టీజర్, పోస్టర్స్ సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 22న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ యమా జోరుగా నిర్వహిస్తోంది. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) ముఖ్య అతిథిగా మాసీవ్ ప్రీ రిలీజ్ వేడుకని (Pre Release Event) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఆర్‌ అన్న ఇక్కడికి వచ్చింది నా ఒక్కడి కోసం కాదు. ఆయన అభిమానికి ఇచ్చిన మాట కోసం.. సరిగ్గా నిద్రలేకపోయినా సరే వచ్చారు. ఆయన చేసింది నా ఒక్కడి కోసం కాదు. నాలో ప్రతి ఒక్క అభిమానిని చూసి చేసింది. రెండు నెలల క్రితం అన్న తన ఇంటికి పిలిచి తమ్ముడికి భోజనం పెట్టినట్లు పెట్టారు. ధమ్కీ సినిమా ఈవెంట్‌కి రావాలన్నా అని అడిగాను. ‘మాట ఇచ్చాను’ అన్నారు. ఇటివలే అన్న వాళ్ళ ఇంట్లో ఒక సంఘటన జరిగింది. ఇలాంటి సమయంలో ఆయన్ని ఫేవర్ అడగొద్దని సైలెంట్‌గా వుండిపోయా. ఆయన ఇంట్లో కార్యక్రమాలు అయిపోగానే ఈవెంట్ ఎప్పుడో కనుక్కోమని నాకు కబురు పంపించారు. అప్పుడు ఆయన ఆస్కార్ కాదు.. అంతకంటే ఎక్కువ అనిపించింది. ఆయన మ్యాన్ అఫ్ వర్డ్. ‘రావడం నా భాద్యత’ అని ఆయన మెసేజ్ పెట్టిన వెంటనే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇండియాని గర్వంగా చేసినందుకు థాంక్స్ అన్నా. ఇండియాలో బెస్ట్ యాక్టర్ ఎవరు అంటే ఎన్టీఆర్ అని ఎప్పుడో చెప్పా. 17 ఏళ్లకు బాంబులు వేసి తొడగొట్టారు.. మళ్ళీ అది రిపీట్ కాదు. ఇప్పటి వరకూ చూసింది తారక్ అన్న టీజరే. ఇప్పటి నుంచి అసలు సినిమా మొదలవుతుంది. (Vishwak Sen About Tarak)

Vishwak-Sen.jpg

నేను పడిపోతే బావుండు.. నవ్వుదామని చాలా మంది వుంటారు. దేవుడు ఇవన్నీ చూస్తున్నాడని అనుకుంటా. అందుకే నాకు తోడుగా అన్నని పంపించాడు. నాకు బ్లాక్‌బస్టర్ స్టార్ట్ అయిపోయింది. నందమూరి అభిమానులందరికీ కృతజ్ఞతలు. ‘దాస్ కా ధమ్కీ’ 22న ఉగాది రోజు వస్తోంది. ఐదేళ్ళ తర్వాత మళ్ళీ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. నేను యాక్టింగ్ చేస్తే మూడు సినిమాలు చేసే వాడిని. కానీ నా ప్రాణం, డబ్బులన్నీ పెట్టి చేసిన సినిమా ఇది. ఫస్ట్ హాఫ్‌లో పాటలు, కామెడీ, ఫైట్లతో ఎంజాయ్ చేస్తారు. ఇంటర్ వెల్‌లో ప్యాక్ అవుతుంది. సెకండాఫ్ చుప్ చాప్‌గా చూస్తారు. గుండెలు బరువౌతాయి. హాట్ రేట్ పెరుగుతుంది. చివర్లో ఒక సర్‌ప్రైజ్ ఎలిమెంట్ వుంది. మిమ్మల్ని నిరాశ పరచను. ఇది జస్ట్ ఫిల్మ్ కాదు.. విశ్వక్ సేన్ 2.0. ఉగాది రోజున ప్రతి ఒక్కడి సీట్ షేక్ అవ్వుద్ది. అందరం థియేటర్‌లో కలుద్దాం’’ అని అన్నారు. (Vishwak Sen about Das Ka Dhamki)

ఇవి కూడా చదవండి:

*********************************

* Akhil Akkineni: పెళ్లిపై అఖిల్ అక్కినేని సంచలన వ్యాఖ్యలు

*Singer Sunitha: చాలా బరువుగా ఉంది.. అయినా హాయిగా ఉంది

*NTR30: ఇలా అయితే సినిమాలు మానేస్తా.. ఫ్యాన్స్‌కి స్వీట్ వార్నింగ్

*Young Tiger NTR: విశ్వక్ సేన్ దర్శకత్వం మానేయాలని కోరుకుంటున్నా..

*Jr NTR: ఆస్కార్ క్రెడిట్ ఎవరిదంటే.. ఎన్టీఆర్ స్పీచ్ వైరల్

*Bigg Boss Himaja: ఘోరంగా ఏడ్చాను.. కానీ?

*Shruti Haasan: సిల్లీ క్వశ్చన్ అడగమంటే.. శృతిని అలాంటి ప్రశ్నేనా అడిగేది?

*Pavitra Lokesh: పెద్ద బాంబ్ పేల్చిన పవిత్రా లోకేష్ మొదటి భర్త.. పాపం నరేష్..?

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

Updated Date - 2023-03-18T19:18:14+05:30 IST