Tiger Nageswara Rao: టైగర్ కా హుకుమ్.. ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది

ABN , First Publish Date - 2023-09-27T16:37:29+05:30 IST

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం అక్టోబర్ 20న గ్రాండ్‌‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. అక్టోబర్ 3న ఈ చిత్ర ట్రైలర్ విడుదల కానుంది.

Tiger Nageswara Rao: టైగర్ కా హుకుమ్.. ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది
Tiger Nageswara Rao Movie Still

మాస్ మహారాజా రవితేజ (Mass MahaRaja Ravi Teja), దర్శకుడు వంశీ (Vamsee), అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ (Abhishek Agarwal Arts) అభిషేక్ అగర్వాల్‌ (Abhishek Agarwal)ల క్రేజీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఇది కూడా ఒకటి. పాన్ ఇండియా (Pan India) ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం అక్టోబర్ 20న గ్రాండ్‌‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఇప్పటికే విడుదలైన గ్రిప్పింగ్ టీజర్, చార్ట్‌బస్టర్ పాటలతో టైగర్ నేషనల్ వైడ్‌గా హ్యూజ్ బజ్‌ను క్రియేట్ చేస్తుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ చిత్ర ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 3న పాన్ ఇండియా వైడ్‌గా ఈ చిత్ర ట్రైలర్‌‌ని మేకర్స్ విడుదల చేయబోతున్నారు. ఈ విషయం తెలుపుతూ ఓ మాసివ్ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు.

Tiger-2.jpg

అడవిలో పులిని వేటాడే విధంగా రవితేజ (Ravi Teja) తన ప్రత్యర్థులపై దాడి చేస్తున్నట్లుగా.. ఈ పోస్టర్‌లో రవితేజ కనిపిస్తున్నారు. రవితేజ ఇందులో బీడీ తాగుతూ డాషింగ్‌గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ చూస్తుంటే అక్టోబర్ 20న టైగర్ వేట మాములుగా ఉండదనేది అర్థమవుతోంది. రవితేజ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రమిది. ఖచ్చితంగా ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్‌లా ఉంటుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. (Tiger Nageswara Rao Trailer Release Date)


TNR.jpg

జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం అందిస్తున ఈ చిత్రం నుంచి ఇప్పటివరకూ రెండు పాటలను విడుదల చేశారు మేకర్స్. రవితేజ సరసన నుపుర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ (Gayathri Bharadwaj) హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఆర్‌ మదీ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Skanda: అడుగడుగునా బోయపాటి మార్క్.. చూసుకుందాం.. బరాబర్ చూసుకుందాం

***************************************

*Hebah Patel: హెబ్బా నటించిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ డైరెక్ట్‌గా ఓటీటీలోకే.. ఎప్పుడు, ఎక్కడంటే?

****************************************

*Salaar: రెబల్ స్టార్ ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. షారుఖ్‌కి ఝలక్!

***************************************

*Nayanthara: నయనతార అసలు పేరు.. నటి కాకముందు ఆమె ఏం చేసేదో తెలుసా? వీడియో వైరల్

**************************************

Updated Date - 2023-09-27T16:37:29+05:30 IST