Hebah Patel: హెబ్బా నటించిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ డైరెక్ట్‌గా ఓటీటీలోకే.. ఎప్పుడు, ఎక్కడంటే?

ABN , First Publish Date - 2023-09-26T17:09:26+05:30 IST

రామ్ కార్తిక్‌, హెబ్బా ప‌టేల్ కీల‌క పాత్ర‌ల్లో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్’. వెన్నులో వ‌ణుకుపుట్టించే ఉత్కంఠ‌భ‌రిత‌మైన థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 6న ఈ చిత్రం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Hebah Patel: హెబ్బా నటించిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ డైరెక్ట్‌గా ఓటీటీలోకే.. ఎప్పుడు, ఎక్కడంటే?
Hebah Patel

రామ్ కార్తిక్‌ (Ram Karthik), హెబ్బా ప‌టేల్ (Hebah Patel) కీల‌క పాత్ర‌ల్లో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్’. వెన్నులో వ‌ణుకుపుట్టించే ఉత్కంఠ‌భ‌రిత‌మైన థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. న‌రేష్ వీకే (Naresh VK), ప‌విత్రా లోకేష్‌ (Pavitra Lokesh), జ‌య‌ప్ర‌కాష్‌ వంటి వారు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాను విప్ల‌వ్ కోనేటి (Viplove Koneti) డైరెక్ట్ చేయడంతో పాటు.. ఆయనే స్వయంగా నిర్మించారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆహా ఓటీటీ (Aha OTT)లో అక్టోబర్ 6న నుండి స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ వారు అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. మ‌ద‌న‌ప‌ల్లి టౌన్‌లో జ‌రిగిన వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ తెర‌కెక్కింది. ఎమోష‌న‌ల్ డ్రామా, మ‌న‌సును తాకే థ్రిల్స్, అనూహ్య‌మైన రొమాన్స్, అన్నిటి మేళ‌వింపుగా అద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియ‌న్స్ ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు. అనూహ్య‌మైన రీతిలో సాగే ఈ సినిమాలో ఓ కుటుంబం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డాల‌నుకుంటుంది. అస‌లు వాళ్ల ఉద్దేశం ఏంటి? మ‌ళ్లీ పుట్ట‌డ‌మేనా? ఈ క‌థ‌ను ముందుకెళుతున్న కొద్దీ అనూహ్య‌మైన ట్విస్టులు, స‌స్పెన్స్, డ్రామా, రొమాన్స్... ఇలాంటివి ఎన్నెన్నో క‌ళ్ల‌ముందు క‌ద‌లాడుతుంటాయని, వెన్నులో వణుకుపుట్టించే సన్నివేశాలు ఇందులో పుష్కలంగా ఉంటాయని దర్శకనిర్మాత విప్ల‌వ్ కోనేటి (Director Viplove Koneti) తెలుపుతున్నారు.


Hebah-Patel.jpg

ఆద్యంతం స‌స్పెన్స్‌తో.. ఇంత‌వ‌ర‌కూ క‌నీవినీ ఎరుగ‌ని థ్రిల్ల‌ర్‌గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుందని, అక్టోబ‌ర్ 6న వస్తున్న ఈ సినిమా థ్రిల్ల‌ర్ జోన‌ర్‌కి స‌రికొత్త నిర్వ‌చ‌నం చెప్పే సినిమా అవుతుందని ఆయన అంటున్నారు. హెబ్బా ప‌టేల్ విషయానికి వస్తే.. ఇటీవ‌ల ఆమె న‌టించిన సినిమా ‘ఓదెల రైల్వే స్టేష‌న్’ ఆహాలోనే విడుదలై మంచి క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ‘ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్’తో మ‌ళ్లీ ఆహా ప్రేక్ష‌కుల‌ను హెబ్బా ప‌ల‌క‌రించ‌నుంది. రీసెంట్‌గా వచ్చిన ‘మ‌ళ్ళీ పెళ్లి’ (Malli Pelli)తో ఆహా ఆడియ‌న్స్‌ని అల‌రించిన న‌రేష్ వీకే, ప‌విత్రా లోకేష్.. మరోసారి ఈ ‘ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్’లో భార్యభర్తలుగా కనిపించనున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Salaar: రెబల్ స్టార్ ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. షారుఖ్‌కి ఝలక్!

***************************************

*Nayanthara: నయనతార అసలు పేరు.. నటి కాకముందు ఆమె ఏం చేసేదో తెలుసా? వీడియో వైరల్

**************************************

*Thee Ivan: పెళ్ళికి ముందే వివాహేతర సంబంధాలు పెట్టుకునే వారికి సందేశమిచ్చే చిత్రమిది

**************************************

*Janam: రాజకీయ నాయకులతో పాటు జ‌నానికి కూడా చురకలు వేస్తున్నారట..

****************************************

*P Vasu: మా గాడ్ ఫాదర్ ఎన్టీఆరే..

****************************************

Updated Date - 2023-09-26T17:09:26+05:30 IST