Skanda: అడుగడుగునా బోయపాటి మార్క్.. చూసుకుందాం.. బరాబర్ చూసుకుందాం

ABN , First Publish Date - 2023-09-26T18:41:34+05:30 IST

బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘స్కంద -ది ఎటాకర్’. టాలీవుడ్ క్రష్ శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై.. నిర్మాత శ్రీనివాస చిట్టూరి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 28న విడుదల కాబోతోన్న ఈ చిత్ర రిలీజ్ ట్రైలర్‌ను తాజాగా కరీంనగర్‌లో జరిగిన ఈవెంట్‌లో మేకర్స్ విడుదల చేశారు.

Skanda: అడుగడుగునా బోయపాటి మార్క్.. చూసుకుందాం.. బరాబర్ చూసుకుందాం
Skanda Movie Still

బోయపాటి శ్రీను (Boyapati Sreenu), ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘స్కంద -ది ఎటాకర్’ (Skanda). టాలీవుడ్ క్రష్ శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై.. నిర్మాత శ్రీనివాస చిట్టూరి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎస్ ఎస్ థమన్ (SS Thaman) సంగీతం అందించిన ఆల్బమ్ సెన్సేషనల్ హిట్‌గా నిలవగా.. టీజర్, ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న నేపధ్యంలో మేకర్స్ కరీంనగర్‌ (Karimnagar)లో ‘స్కంద కల్ట్ జాతర’ (Skanda Cult Jathara) ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో ‘స్కంద’ రిలీజ్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

ఇంతకు ముందు వచ్చిన ట్రైలర్, ఇప్పుడు వచ్చిన రిలీజ్ ట్రైలర్.. రెండిటిలోనూ బోయపాటి మార్క్ అడుగడుగునా కనిపించింది. ఉస్తాద్ రామ్ మ్యాసియస్ట్ యాక్షన్, బోయపాటి హైవోల్టేజ్ ఇంటెన్స్ సీక్వెన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్‌తో.. ఈ రిలీజ్ ట్రైలర్ మాస్ రాంపేజ్ అనేలా ఉంది. ఇందులో ‘నేను సంపేటపుడు వాడి తలకాయ యాడుందో చూస్తాను.. ఆడి యెనకాల ఎవడున్నాడో చూడను’, ‘రింగ్‌లో దిగితే రీసౌండ్ రావాలె... చూసుకుందాం..బరాబర్ చూసుకుందాం..’ అంటూ రామ్ చెప్పిన డైలాగ్స్ పవర్ ఫుల్‌గా వున్నాయి. మాస్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వచ్చిన ఈ ట్రైలర్.. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించేలా తెరకెక్కిందనే విషయాన్ని తెలియజేస్తుంది. థమన్ నేపధ్య సంగీతం ట్రైలర్‌లోని యాక్షన్‌ని మరింతగా ఎలివేట్ చేసింది. ఓవరాల్‌గా ఈ ట్రైలర్‌తో బోయపాటి, రామ్‌ల మాస్ తాండవం చూడటానికి అంతా సిద్ధమవ్వండి అనేలా మేకర్స్ ఈ ట్రైలర్‌తో మరోసారి హింట్ ఇచ్చేశారు. (Skanda Release Trailer Talk)


Ram.jpg

ఇక ఈ కల్ట్ జాతర ఈవెంట్‌లో ఉస్తాద్ రామ్ పోతినేని మాట్లాడుతూ (Ram Speech).. కరీంనగర్‌లో స్పెషల్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం ఆనందంగా వుంది. ఇక్కడికి వచ్చిన అందరికీ థాంక్స్. బోయపాటి‌గారి సినిమా అంటే ఫైట్స్ అని అంటారు. ఐతే కేవలం ఫైట్స్ మాత్రమే కాదు.. ఆ ఫైట్స్ వెనుక ఎమోషన్. ఆ ఎమోషన్‌ని ఎలా బిల్డ్ చేస్తారనేది స్కంద కీ ఎలిమెంట్. స్కంద కేవలం మాస్ సినిమానే కాదు. చాలా అందమైన ఫ్యామిలీ ఎలిమెంట్స్ వున్నాయి. ఈ సినిమాకి సోల్ ఫ్యామిలీ ఎమోషన్స్. బోయపాటి గారు ప్రతి సినిమాలో ఒక సోషల్ మెసేజ్ పెడతారు. ఇందులో మెసేజ్‌ని కుటుంబ సభ్యులంతా ఎంజాయ్ చేస్తారు. సెప్టెంబర్ 28న థియేటర్స్‌లో కలుద్దామని అన్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Hebah Patel: హెబ్బా నటించిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ డైరెక్ట్‌గా ఓటీటీలోకే.. ఎప్పుడు, ఎక్కడంటే?

****************************************

*Salaar: రెబల్ స్టార్ ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. షారుఖ్‌కి ఝలక్!

***************************************

*Nayanthara: నయనతార అసలు పేరు.. నటి కాకముందు ఆమె ఏం చేసేదో తెలుసా? వీడియో వైరల్

**************************************

*Thee Ivan: పెళ్ళికి ముందే వివాహేతర సంబంధాలు పెట్టుకునే వారికి సందేశమిచ్చే చిత్రమిది

**************************************

*Janam: రాజకీయ నాయకులతో పాటు జ‌నానికి కూడా చురకలు వేస్తున్నారట..

****************************************

Updated Date - 2023-09-26T18:41:34+05:30 IST