సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pooja Hegde: కుందనపు బొమ్మలా.. బతుకమ్మ పాటలో గోపికమ్మ!

ABN, First Publish Date - 2023-03-31T21:54:13+05:30

బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా నటించిన బాలీవుడ్ సినిమా ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan). ఆయన సరసన బుట్ట బొమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన

Pooja Hegde in Bathukamma Song
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పాటలను, సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ గౌరవిస్తారు.. ఆదరిస్తారు. ఒక్కోసారి ప్రాంతీయ సంస్కృతికి పెద్దపీట వేస్తూ రూపొందే చిత్రాలకు భారీ విజయాలు కూడా దక్కాయి. ఇక తెలుగు సినిమాల్లో తెలంగాణ పండుగ.. బతుకమ్మ (Bathukamma) నేపథ్యంలో పాటలు అప్పుడప్పుడూ వినబడుతున్నాయి. ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అందులో కొత్తేమీ లేదు. కానీ, బాలీవుడ్ సినిమాలో బతుకమ్మ పాట వినబడితే... అందులోనూ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో అచ్చమైన, స్వచ్ఛమైన తెలంగాణ సంస్కృతికి సంబంధించిన పాట వినబడితే విశేషమే కదా! బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా నటించిన బాలీవుడ్ సినిమా ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan). ఆయన సరసన బుట్ట బొమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో తెలంగాణ సంస్కృతిలో (Telangana Culture) భాగమైన, ఆడబిడ్డల మనసుకు దగ్గరైన బతుకమ్మ పండుగ (Bathukamma Festival) నేపథ్యంలో పాటను రూపొందించారు. తాజాగా సినిమాలోని బతుకమ్మ పాటకు సంబంధించిన వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

ఈ పాటలో ‘ముకుంద’ (Mukunda) సినిమాలో గోపికమ్మ పాటకు (Gopikamma Song) ఎలా అయితే ముద్దు ముద్దుగా డ్యాన్స్ చేసిందో.. అలానే పూజా హెగ్డే మరోసారి గుర్తుండిపోయేలా ఈ పాటలో నర్తించింది. తెలంగాణ పల్లె సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా పాటను చిత్రీకరించారు. లంగా వోణి వేసి, కొప్పులో మల్లెపూలు పెట్టి, మెడ నిండా నగలతో బతుకమ్మ పాటలో పూజా హెగ్డే.. అచ్చం తెలంగాణ పడుచులా పూజా హెగ్డే నృత్యం చేస్తుంటే.. చూడడానికి రెండు కళ్లు సరిపోవనుకోండి. ఆమెతో పాటు ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), సల్మాన్ ఖాన్ కూడా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించడం ఈ పాటకున్న మరో ప్రత్యేకత.

ఇక ఈ బతుకమ్మ పాట గురించి బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Butta Boman Pooja Hegde) మాట్లాడుతూ .. బతుకమ్మ పర్వదినం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భారతీయ సంస్కృతిలో పువ్వులను పూజించే గొప్ప పండుగ ఇది. తెలంగాణ అమ్మాయిలందరూ సంబరంగా జరుపుకునే, ఎంతో విశిష్టత ఉన్న బతుకమ్మ పండుగ పాటలో నేను నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. సల్మాన్ ఖాన్‌గారు, వెంకటేష్‌గారు, భూమిక గారితో పాటలో సందడి చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. తెలంగాణ బతుకమ్మ పండుగకు మా టీమ్‌ నుంచి భక్తితో సమర్పించిన కానుక ఇది (Tribute to Telangana's Beautiful Flower Festival). ‘కీసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ తెలుగు ప్రేక్షకులందరికీ తప్పక నచ్చుతుంది. ఈద్‌కి విడుదలవుతున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూస్తారని భావిస్తున్నానని అన్నారు. (Pooja Hegde about Bathukamma Song)


ఇవి కూడా చదవండి:

*********************************

*Shaakuntalam: ‘మల్లికా మల్లికా’ వీడియో సాంగ్‌.. అబ్బ ఏముందిరా బాబు సమంత!

*Ram Charan and NTR: రామ్ చరణ్‌‌ రికార్డులు బద్దలుకొడితే.. తారక్‌కి ఇంత అవమానమా?

*Allu Arjun: రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి బన్నీ రాలేదని ట్రోల్ చేశారుగా.. ఈ విషయం తెలిస్తే?

*Poonam Kaur: ఫైట్ చేయగలను.. డ్యాన్స్ చేయగలనంటూ ఏ పాటకు డ్యాన్స్ చేసిందంటే..

*Sarath Babu: హాస్పిటల్‌లో నటుడు శరత్ బాబు.. అసలేమైంది?

*Manchu Lakshmi: ‘ఛమ్కీల అంగీలేసి’ పాటకి మంచు లక్ష్మీ స్టెప్స్.. అరిపించేసింది

*Tollywood: శోభితతో చైతూ.. సుప్రియతో శేష్.. ఇలా దొరికేశారేంటి?

Updated Date - 2023-03-31T21:54:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!