Tollywood: శోభితతో చైతూ.. సుప్రియతో శేష్.. ఇలా దొరికేశారేంటి?

ABN , First Publish Date - 2023-03-29T15:43:20+05:30 IST

టాలీవుడ్‌ (Tollywood)లో ఇప్పుడు ఇద్దరు హీరోల గురించి హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు ఇటీవల సమంత (Samantha)తో విడాకులు తీసుకున్న నాగ చైతన్య (Naga Chaitanya) ఒకరైతే.. మరో హీరో యంగ్ అండ్ సక్సెస్‌ఫుల్ హీరో

Tollywood: శోభితతో చైతూ.. సుప్రియతో శేష్.. ఇలా దొరికేశారేంటి?
Chaitu with Sobhita and Sesh with Supriya

టాలీవుడ్‌ (Tollywood)లో ఇప్పుడు ఇద్దరు హీరోల గురించి హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు ఇటీవల సమంత (Samantha)తో విడాకులు తీసుకున్న నాగ చైతన్య (Naga Chaitanya) ఒకరైతే.. మరో హీరో యంగ్ అండ్ సక్సెస్‌ఫుల్ హీరో అడవి శేష్ (Adivi Sesh). సమంతతో విడాకుల అనంతరం.. మరో నటి శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala)తో చైతూ డేటింగ్ చేస్తున్నాడని, అన్నీ బాగుంటే త్వరలో ఆ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకునే అవకాశాలు ఉన్నట్లుగా టాక్ నడుస్తుంది. ఇలా వార్తలు వైరల్ అవుతున్నా.. చైతూ సైడ్ నుంచిగానీ, శోభిత సైడ్ నుంచిగానీ ఎవరూ ఖండించలేదు సరికదా.. ఇద్దరూ కలిసి ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తుండటంతో, దాదాపు వినిపిస్తున్న వార్తలు నిజమే అనేలా అంతా ఫిక్సయ్యారు. తాజాగా ఓ హోటల్‌లో శోభితతో కలిసి ఉన్న చైతూ పిక్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

Naga-Chaitanya.jpg

చైతూ సంగతి అలా ఉంటే.. మరో యంగ్ హీరో అడవి శేష్‌పై కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి రూమర్సే వైరల్ అవుతున్నాయి. అడవి శేష్ విషయానికి వస్తే.. అతను అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) మేనకోడలు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) ఫస్ట్ ఫిల్మ్ హీరోయిన్ అయినటువంటి సుప్రియ (Supriya)తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య అక్కినేని ఫ్యామిలీ (Akkineni Family) జరుపుకున్న క్రిస్టమస్ (Christmas) సంబరాల్లో కూడా అడవి శేష్, సుప్రియ పక్కపక్కన కనిపించి సందడి చేశారు. తాజాగా మరోసారి వారిద్దరూ ఒకే కారులో కనిపించి.. మీడియాకు మరింతగా పనిచెప్పారు.

Sesh.jpg

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) పుట్టినరోజును పురస్కరించుకుని.. హీరోలు, దర్శకులు, నిర్మాతలకు పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పార్టీకి అడవి శేష్, సుప్రియ (Adivi Sesh and Supriya) ఒకే కారులో వచ్చి.. మీడియాకు చిక్కేశారు. కారు దిగి ఇద్దరూ నడుచుకుంటూ వచ్చారు. అడవి శేష్ మీడియా పాయింట్‌లో ఆగి మాట్లాడితే.. సుప్రియ మాత్రం అక్కడ తనకు తెలిసిన వారిని పలకరించుకుంటూ లోపలికి వెళ్లిపోయింది. అయితే వీరిద్దరూ ఇలా కనిపించడంతో.. కొంతకాలంగా వారిపై వినిపిస్తున్న రూమర్స్‌కు బలం చేకూర్చినట్లయింది. మరో రూమర్ ఏమిటంటే.. అడవి శేష్, సుప్రియలకు పెళ్లి కూడా అయిపోయిందని అంటున్నారు. మరి ఈ వార్తలో ఎంత నిజముందనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే చైతూ, శోభిత కలిసి ఉన్న పిక్.. అలాగే అడవి శేష్, సుప్రియలు కలిసి నడిచి వస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

*********************************

*Sana: అందుకే అలీ రెజాతో రొమాంటిక్ సీన్ చేశా.. అలాంటివి ఇంకా చేయాలని ఉంది

*Upasana: ఉపాసన బేబీ బంప్ ఫొటో వైరల్.. ఇక డౌట్స్ వద్దమ్మా..!

*SSMB28: మళ్లీ అప్పటి వరకు అప్‌డేట్స్ అడగవద్దు.. ఫ్యాన్స్‌కి నిర్మాత హెచ్చరిక

*Hyper Aadi: రికార్డులు అనేవి పుట్టిందే ఆయనను చూసి.. హైపర్ ఆది స్పీచ్ వైరల్

*Jr NTR: చరణ్‌కు తారక్ బర్త్‌డే విష్.. మెగా, నందమూరి ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

*Kabzaa: ‘కబ్జ’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

*Bhanushree Mehra: మరో బాంబ్ పేల్చిన అల్లు అర్జున్ ‘వరుడు’ హీరోయిన్

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-29T15:44:03+05:30 IST